చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్ (All Songs)
నటీనటులు: ఆర్.మాధవన్, మీరా జాస్మిన్
దర్శకత్వం: యన్.లింగుస్వామి
నిర్మాత: ఏ.యమ్.రత్నం
విడుదల తేది: 05.09.2002
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్
గానం: హరిహరన్
మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
చరణం: 1
అల్లరి చేసే పువ్వుల మొక్కను చూశా
రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేశా
నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే
నన్ను వీడి విడిగా విడిపోయే నీడే
అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా
ఎగిరిరావే నా చిలకా
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసి
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
చరణం: 2
ఆ.. వానకు అర్దం ఒక చినుకే నా చెలియా
నువ్వు ఒంటరి చినుకా నీటి వరదా
నిజమును చెప్పవే సఖియా
బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా
కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా
అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా
సిగ్గువీడి రా వెనుకా
ఆగమంటు ఖండించి లోలోపల దండించి
చెప్పమంటూ అర్దించి చెప్పకుండ వంచించి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కథలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ
నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి
ఆశలనే కలిగించి కథలోకి అరుదించి
చిత్రం: రన్ (2002)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఎ.ఎం.రత్నం, శివ గణేష్
గానం: బలరామ్ , సాధనా సర్గం
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
మనముండే చోటు ఏకాంత ద్వీపం
ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు
చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి
నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి
పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా