చిత్రం: Rx 100 (2018)
సంగీతం: చైతన్య భరద్వాజ్
సాహిత్యం:
గానం: అనురాగ్ కులకర్ణి
నటీనటులు: కార్తిక్ , పాయల్ రాజ్పుత్
దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
విడుదల తేది: 13.07.2018
పల్లవి:
మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా
దాగినావుగా
అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా
చంపడానికా!
కోరుకున్న ప్రేయసివే
దూరమైన ఊర్వశివే
జాలిలేని రాక్షసివే
గుండెలోని నా కసివే
చేపకళ్ల రూపసివే
చిత్రమైన తాపసివే
చీకటింట నా శశివే
సరసకు చెలీ చెలీ రా..
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే అన్నాగా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా కళ్లారా
నిన్నే తలచి తలచిలా ఉన్నాగా
నువ్వే ఎద సడివే…
మబ్బుల్లోన వానవిల్లులా
మట్టిలోన నీటి జల్లులా
గుండెలోన ప్రేమ ముళ్లులా
దాగినావుగా
అందమైన ఆశతీరక
కాల్చుతుంది కొంటె కోరిక
ప్రేమ పిచ్చి పెంచడానికా
చంపడానికా!
చరణం: 1
చిన్నాదాన ఓసి అందాల మైన
మాయగా మనసు జారి పడిపోయెనే
తపనతో నీవెంటే తిరిగెనే
నీ పేరే పలికెనే నీలాగే కులికెనే
నిన్ను చేరగా
ఎన్నాళ్ళైన అవి ఎన్నేళ్ళు అయినా
వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా
గండాలైన సుడి గుండాలు అయినా
ఉంటానిలా నేను నీకే తోడుగా
ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగ ఉందామా
ఇదో ఎడతెగని హంగామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా
చరణం: 2
అయ్యో రామ ఓసి వయ్యారి భామ
నీవొక మరుపురాని మృదు భావమే
కిల కిల నీ నవ్వు తళుకులే
నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో
ఎం చేస్తున్నా నేను ఏ చోటవున్నా
చూస్తూనే ఉన్నా
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి నిన్ను అందులో దాచి
పూజించన రక్త మందారాలతో
కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా
మళ్ళీ మన కథనే రాద్దామా
ఎలా విడిచి బతకనే పిల్లా రా
నువ్వే కనబడవా…