చిత్రం: యస్. పి.భయంకర్ (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
గానం: యస్. పి.బాలు సుశీల (All)
నటీనటులు: నాగేశ్వరరావు , కృష్ణంరాజు , సురేష్ , శ్రీదేవి, విజయశాంతి, గీత, సిల్క్ స్మిత
దర్శకత్వం: వి. బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి. బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 01.05.1984
కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే పోనీ
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
నిలవేసే కన్నుల్ని వలవేసే నవ్వుల్ని
ఎవరేమన్నా ఆగవని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
చెలరేగే అందాల్ని చరపట్టే ఆటల్ని
ఇది హద్దంటే పాపమని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
వయసొచ్చిందే అందుకని
దానికి పొగరుంటేనే వేడుకని
ముందు ముందు ముసళ్ళ పండగ మనమే చూడాలని
కానీ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
చిగురాకు పెదవుల్ని చిరు సిగ్గు బుగ్గల్ని
కలబోతేని ముద్దులని
జతకోరే ప్రణయాన్ని ఒడి చేరే పరువాణ్ణి
ముడివేసేదే కౌగిలని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ఆడివిడిపోనీ బంధమని
దానికి సడలింపే ఉండదని
ప్రాణం ఎవరో దేహం ఎవరో
తెలియక మధ్యన సాగాలని
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ
చాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే పోనీ
ఉఁ కానీ కానీ రాతిరి కానీ
హా రానీ రానీ రానీ చీకటి రానీ