Saani Telugu Song Lyrics

Saani Telugu Song Lyrics

Saani Telugu Song Lyrics

సాని.. ఒక వేశ్యా గానం… లిరిక్స్

సం‌గీతం:‌ చరణ్ అర్జున్
సాహిత్యం:‌ చరణ్ అర్జున్
‌గానం:‌ మౌనికా రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న
నటీనటులు: స్వర్ణ గణేష్ అరెడ్డి,నిసార్, ఉదయ్,బంగార్రాజు
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 15.08.2020

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ..
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ..
కనురెప్పలకేమో కాటుక రుద్దాను గానీ..
పెదవులకు రంగులు ఏవో అద్దాను గానీ..
నా ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని..
ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గానీ..

సూపులకేమో నేను దొరసాని ఓ.. ఓ…
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ.. ఓ…

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ
తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ
సూపులకేమో నేను దొరసాని రేల రేలా.. రా..
లో లోపల మాత్రం నా పేరు సానీ.. ఆ.. అ ఆ..అఆ..

నీది నాదీ.. కాదు తల్లీ..
ఇది పైవాడి ఆటనే సెల్లీ..
దేవాన దేవుళ్లన్నాడే…
ఈ సిత్రాలు ఉన్నాయ్ తలచి సూడే..
నాన్న కానీ నాన్న పడమటి అర్రలో..
నన్ను తోసే బతుకు పోరులో..
అమ్మ నుండి నాకు దక్కిన వరము,
అమ్మితేనే ఒళ్ళు అన్నమూ…
ఎముకల గూడు నేను ఎనకాల గోడ నేను,
నీ మొరటు చేతుల్లోన నలిగిపోనూ…
నీ ఆనందాల కోసం చేస్తా ఏదేదో శబ్దం,
వినగలిగే మగవాడెవడు ఎద చప్పుడూ…

చూపులకేమో నేను దొరసాని ఏహే.. ఏహే..
లో లోపల మాత్రం నా పేరు సానీ.. ఏహే.. ఏహే..

ఎవ్వరికి ఎవ్వరే ఈ లోకానా.. అరిగోశాలిస్తున్నావో కూనా..
కాగడవెలుగే చూస్తారే పైనా.. కాలే గాయాలే కనిపించేనా..
ఆట పాట ప్రేమ పెళ్లి పేరంటం అన్ని ఆశలున్నా నలుసునీ..
నల్ల మబ్బులోకి వెళ్ళిపొమ్మని దాచినారు చందమామనీ..
డబ్బున్న మగమహరాజు నా ఇంటికి వస్తూపొతే,
మా గొప్ప రసికుడు అంటూ పొగిడేస్తారు..
మీ కామ దాహం తీర్చి తరిగిన బ్రతుకును మాత్రం
హీనంగా చూస్తూ ఎందుకు చీ కొడతారు..

సూపులకేమో నేను దొరసాని ఓ.. ఓ…
లో లోపల మాత్రం నా పేరు సాని ఓ.. ఓ…

అందరి లోతెంతో ఉంటది ఈడా..
సందర్భం చూపును దాని జాడ
ఎవరెవరి గుట్టుందో నీ కాడా..
నేనైతే గా ముచ్చట మాట్లాడా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!