Sakhi (2000)

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ (All Songs)
నటీనటులు: ఆర్. మాధవన్, షాలిని కుమార్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: మణిరత్నం
విడుదల తేది: 14.04.2000
చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: మహాలక్ష్మి అయ్యర్ , హరిణి, కళ్యాణి

పల్లవి:
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణు గానమున ఆలాపనే కన్నా..
మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా…

నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొరా ప్రాయమున యమున
మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా..

చరణం: 1
కనుల వెన్నెల పట్ట పగల్ పాల్ చిలుకగా
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే
కాదిలి వేణుగానం కాదడ పలికే
కాదిలి వేణుగానం కాదడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే
అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీచ శకుంతమరందమెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన
వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు
శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
నీ ఆనందమోహన వేణుగానమున
ఆలాపనే కన్నా…. కన్నా ….

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బి.చరణ్, నవీన్

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు(4)

అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ
ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే
దరికే వస్తే లేనంటావే

నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో  నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ

ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)

చరణం: 1
నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీకన్నా ఎవరులే

నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో  నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ

ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)

చరణం: 2
ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడూ
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా

నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ
ఓహో  నగిళ నగిళ నగిళ ఒహో హో బిగువు చాలే నగిళ

ఓహో పడుచు పాట నెమరువేస్తే ఎదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4)

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: స్వర్ణలత

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా…
వలపు విరహమా ఓ నా ప్రియా…
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో

కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
మదికే అతిధిగ రానేలనో
సెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకు నిదరేది
ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో
నా పిలుపే అందని దూరాలలో

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

చరణం: 1
అనురాగానికి స్వరమేది
సాగర ఘోషకు పెదవేది
అనురాగానికి స్వరమేది
సాగర ఘోషకు పెదవేది
ఎవరికి వారే ఎదురుపడి
వ్యధలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి
నిను చేరగ నేనే శిలనైతిని
ఎండమావిలో నావనులే
ఈ నిట్టుర్పే నా తెరచాపలే

కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

చరణం: 2
వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి
వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి
చేసిన బాసలు కలలైపోతే
బతుకే మాయగ మిగులునని
నీకై వెతికా కౌగిలిని
నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో
నను ఓదార్చే నీ పిలుపెన్నడో

కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
కలలైపోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: హరిహరన్

సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు

పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే

చరణం: 1
కలికి చిలకమ్మ ఎర్రముక్కు
ఎర్రముక్కులే పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికే కోపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటే
ఎర్రని పంట పాదమంటే
కాంచనాల జిలుగు పచ్చ
కొండబంతి గోరంత పచ్చ
పచ్చా…పచ్చా..పచ్చా…
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం

సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు

అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవు తొలి వర్ణం
ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరెనీ కన్నె గగనం
నన్నే చేరె ఈ కన్నె భువనం

చరణం: 2
రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే
కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే

సఖియా….చెలియా…
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా…చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు

తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే
తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే
ఇరుకనుపాపల కధ తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.జానకి, శంకర్ మహదేవన్

పల్లవి:
బాధ తీరునది శాంతి పోవునది
బాధ తీరునది శాంతి పోవునది

సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం…
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో…
ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో..
కళ్యాణం పూర్తైన నాడే

సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం…
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో…
ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో..
కళ్యాణం పూర్తైన నాడే…

చరణం: 1
ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కధ
చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను
కళ్యాణం ప్రేమ ఏం కాదా..
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట
కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా
చిరు ముక్కు ఎరుపెక్కె
కోపాల అందాలు రసిక రసిక కావ్యం
కళ్యానమయ్యాక చిరు బుర్రు
తాపాలు ఏం ఏం ఏం బాధల్
మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా

సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం…

చరణం: 2
హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల
కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం
హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి
నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా…
కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు
కళ్యానమయ్యాక కరువగులే బావా
విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది
అదే అదే ప్రేమ
ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం
ఉందామా భామ
మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది…
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా

సెప్టెంబర్ మాసం… సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం… అక్టోబర్ మాసం…
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో…
ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో..
కళ్యాణం పూర్తైన నాడే…

చిత్రం: సఖి (2000)
సంగీతం: ఏ ఆర్. రెహమాన్
సాహిత్యం: రాజశ్రీ
గానం: శ్రీనివాస్, సాధన సర్గం

నిన్న మునిమాపుల్లో
నిన్న మునిమాపుల్లో
నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపోతానోయ్ ఇలా డోలలుగేనో
ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా

చరణం: 1
చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లె మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి
సేవలు సేయవలెగా
ఇద్దరమొకటై కన్నెరైతే తుడిచేవేలందం

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా

నిన్న మునిమపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపోతానో ఇలా డోలలూగేనో
ఆనందాలర్ధరాత్రి అందాల గుర్తుల్లో
నిన్ను వలపించ మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే

చరణం: 2
శాంతించాలి పగలింటి పనికే
శాంతించాలి పగలింటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దూ వలపే
వుల్లెన్ చొక్కా ఆరబోసే వయసే
నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసే
ఉప్పు మూటే అమ్మైనా
ఉన్నట్టుండి తేస్త ఎత్తేసి విసిరేస్త
కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి
వరమొకటడిగేస్తా

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు
శ్వాస తుది వరకూ వెలిగే వేదం
వాంఛలన్ని వరమైన ప్రాణ బంధం

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా

Your email address will not be published. Required fields are marked *

Previous
Run (2002)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Kodalu Pilla (1972)
error: Content is protected !!