Sambaram (2003)

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఆర్.పి.పట్నాయక్
నటీనటులు: నితిన్, నేహ
దర్శకత్వం: దశరద్ (కొండపల్లి దశరథ్ కుమార్)
నిర్మాత: తేజ
విడుదల తేది: 31.07.2003

ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా

ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా

చరణం: 1
తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా గతమంత వెంట
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా

చరణం: 2
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా

********   *********   ********

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: టిప్పు

దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
అలవాటు లేని ఈ పులకింత
తన రూపమే గదా మనసంతా
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా
No doubt no doubt no doubt no
ఇది ప్రెమ ప్రేమ ప్రేమ….ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ…..ఇది ప్రేమ ప్రేమ ప్రేమ

ప్రాణమున్నది మనసు తెను లేని జీవితం బొరుసు
పుస్తకాలలో దాచుకున్న నా జ్ఞాపకాలనే అడుగు
ఆమె పేరునే మనసు అరె మాటిమాటికీ తలుచు
ఆమెకోసమై ఎంత వేచినా చెంత చేరదే అలుపు
అనురాగమే ఒక మేఘమై తొలిప్రేమగా కురిసింది అని
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే

దేవుడిచ్చిన వరమని తెలిసే…..నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే

ఆమె కళ్ళలో మెరుపు అరె ఆమె నవ్వు మైమరుపు
ఆమె ఊహలో ఆమె ధ్యాసలో తేలితున్నది మనసు
ఆమెకోసమీ బ్రతుకు మది ఆమెకోసమే బతుకు
ఇన్ని రోజులు చిన్ని మనసెలా కలవరించెనో అడుగు
తన ప్రేమలో నిజముందని ఈ రోజుతో ఋజువైనదని
తనలో తనే మనసే ఇలా మురిసిందిలే…హో..హో..

దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
దేవుడిచ్చిన వరమని తెలిసే
నడిచి వచ్చిన కలలని తెలిసే
మనసు తెచ్చిన వెలుగని తెలిసే
తెలిసే తెలిసే తెలిసే
అలవాటు లేని ఈ పులకింత
తన రూపమే గదా మనసంతా
ఇది ప్రేమ కాక మరి ఏంటంటా
No doubt no doubt no doubt no
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ……ఇది ప్రేమ ప్రేమ ప్రేమ
ఇది ప్రేమ ప్రేమ ప్రేమ…….ఇది ప్రేమ ప్రేమ ప్రేమ

*********  *********  *********

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: రాజేష్

మధురం మధురం ఎపుడూ ప్రేమ
సహజం సహజం ఇలలో ప్రేమ
కలలసీమలో నిజము ఈ ప్రేమ
అనురాగం పలికించే ప్రియనేస్తం ప్రేమ ప్రేమ…

ఎపుడూ ఎదకీ ఒకటే ధ్యాస
ఎపుడో అపుడూ నాదను ఆశ
బదులు కోసమే ఎదురు చూస్తున్నా
మదిలోనే కొలువున్నా నిను చూసీ పలుకే రాదే…

వలపూ విషమూ ఒకటేనేమో
మనసూ మమతా కలలేనేమో
చిగురుటాశలే చెదిరిపోయేనే
ఎదకోసే ఈ బాధా మిగిలిందీ ప్రేమ ప్రేమ….

*********  ********   ********

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

నీ స్నేహం దూరం ఆయె
నీ ప్రాణం భారం ఆయె
నీ నీడే రాదే నీ వెంట
ఇన్నాళ్ళూ నీతో ఉంటూ
కన్నీళ్ళే రానీకంటూ
చెప్పేటి వారే లేరింకా
పగలనీయకు గుండెలని
చెలిమి లేదు అని…
ఎవరి దారులు వారివనీ
ముగిసె నీ మజిలీ…
ఋణము తీరిన బంధం నిన్నే
ఒదిలి పోయిందీ…
మనసు ఒంటరినయ్యానంటూ
కుమిలి పోతుందీ…

నీ ఆశే నీరయ్యింది
నీ శ్వాసే నిప్పయ్యింది
నీకంటూ ఇంకా ఏముంది
ఈ దూరం భారం అంది
ఈ గాయం పోనంటుంది
నువ్వింక చేసేదేముంది…

*********  ********   ********

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే
కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగా
లక్షలాది మంది లేదా మందగా
పంతం పట్టీ పోరాడందే
కోరిన వరాలు పొందలేరు కదా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

చేస్తూ ఉంటే ఏ పనైనా సాద్యమే
చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనేదీ లేదురా
నవ్వే వాళ్ళు నిద్దరపోగా
దిక్కులు జెయించి సాగిపోరమరి

పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తొడై ఉండగా ఏ సాయం కోసం చూడకా
నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏ నాడూ వెనకడుగేయకా ఏ అడుగూ తడబడనీయకా
నీ గమ్యం చేరేదాకా ధూసుకుపోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం
కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా

*********  ********   ********

చిత్రం: సంబరం (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్

ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కొరదా ప్రతి హృదయం
ప్రేమను పొందటమో వరం
అది అంబరమంటిన సంబరం
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కొరదా ప్రతి హృదయం

పసి మదిలో ఏముందో ముందుగానే తెలిసుంటుంది
అందుకనే ఆ దైవం జంటగానే నడిపిస్తుంది
మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో
భాష రాని గుండెలో ఎన్ని ఊసులో
సిరివెన్నెలంటి ఈ స్నేహం
గతజన్మలోని బహుమానం
ఈ జంట చూసి పులకించిపోయి శతమానమంది లోకం

ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కొరదా ప్రతి హృదయం

ఎవ్వరితో ఎవ్వరికో ప్రేమ రాత రాసుంటుంది
ఆ మదికీ ఈ మదికీ బంధమేసి నడిపిస్తుంది
గుప్పేడంత గుండెలో ప్రేమ అన్నది
జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది
ప్రేమించి చూడు ఒకసారి
అది మార్చుతుంది నీ దారి
ఈ ప్రేమలోన ఆకాశమంత సంతోషముంది లేరా

ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కొరదా ప్రతి హృదయం
ప్రేమను పొందటమో వరం
అది అంబరమంటిన సంబరం
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కొరదా ప్రతి హృదయం

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Neramu Siksha (2009)
error: Content is protected !!