చిత్రం: సంఘం (1954)
సంగీతం: ఆర్.సుదర్శనం
సాహిత్యం: తోలేటి వెంకటరెడ్డి
గానం: సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, వైజయంతి మాల, అంజలీ దేవి
దర్శకత్వం: ఎమ్.వి.రామాన్
నిర్మాణం: ఎవిఎమ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 10.07.1954
పల్లవి :
ఆ…ఆఆ… ఆ… ఆఆ…
లల్లా లాల్లలా… లల్లా లాల్లలా…
లల్లా లాల్లలా… లల్లా లాల్లలా…
లాలల లాలల లా లల్లల్లా…
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే
చరణం: 1
స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
కర్షక సౌఖ్యం…
కర్షక సౌఖ్యం… కార్మిక శ్రేయం..
కర్షక సౌఖ్యం…. కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆ…ఆ
కలిగే మార్గం చూపిస్తా…
చరణం: 2
రాణీ రుద్రమ… మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ.. నేనే
రాణీ రుద్రమ.. మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ.. నేనే
రణ తిక్కన భార్యా… సతి మాంచాల
తిక్కన భార్యా… సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే..
భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..
ఆహో..ఓఓఓ…ఆఅహో..ఆ…ఆ…
ఆహో..ఆ… ఆ.. …
****** ****** ******
చిత్రం: సంఘం (1954)
సంగీతం: ఆర్. సుదర్శనం
సాహిత్యం: తోలేటి
గానం: సుశీల, టి. ఎస్. భగవతి
పల్లవి:
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా…
నా అందచందములు దాచితి నీకై… రావేలా…
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా…
నా అందచందములు దాచితి నీకై… రావేలా…
ముద్దునవ్వులా మోహనకృష్ణా… రావేలా…
ముద్దునవ్వులా మోహనకృష్ణా… రావేలా…
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ…
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ…
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా…
నా అందచందములు దాచితి నీకై… రావేలా….
చరణం: 1
నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా…
నను చూసి కనుసైగ చేసితివోయీ… రావేలా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా….
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా….
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ….
మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా…
నా అందచందములు దాచితి నీకై రావేలా…
చరణం: 2
హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా…
అనురాగ రసములే చిందితివోయీ…. రావేలా
హృదయవీణ తీగలు మీటీ ఆవేళా….
అనురాగ రసములే చిందితివోయీ…. రావేలా
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా….
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా..
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే…
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా…