చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నళిని
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 29.12.1983
పల్లవి :
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి..
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి..
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
చరణం: 1
ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ..
కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ..
ఒప్పుకోవమ్మా.. తప్పుకోకమ్మా..
పైట లాగకుంటే పల్లె తిట్టుకుంటదీ.. హా హా హహా
గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్..
అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా
చీకటి పిచ్చి ముదిరిందంటే.. వెన్నెల పెళ్ళి కుదిరిందంటే..
కొత్తలవాటు కొంపకు చేటూ… అయినా తప్పదు ఆటుపోటూ..
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా..
అరె.. దూరి దూరి పోయావంటే పాములుంటాయ్..
చరణం: 2
గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ..
ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ..
బెట్టు చాలయ్యా.. నన్నంటుకోవయ్యా
తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ.. హా హా హహా
అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్..
వాముల పాటు పాముల కాటూ.. వయసుల వాటు ప్రేమల కాటూ..
పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో.. రెప్పలగంట కొట్టిందంటే.. జంటకు గంట గడవాలంటే..
ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి… తోకా ఎత్తి నిలబడిపోయి…
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా
దూరి దూరి పోయావంటే పాములుంటాయ్
పామే వచ్చి నిన్ను చూసి… తోకా ఎత్తి నిలబడిపోయి…
పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
******** ******** *********
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
పల్లవి:
లలలలలలా.. లలలలలలా
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఊపను ఉయ్యాల
ఏమని పాడను ముద్దుల జోలా…
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను వెచ్చని జోలా..
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
చరణం: 1
మసకైనా పడనీవూ.. మల్లె విచ్చుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..
మాటు మణిగిపోనీవూ.. చాటు చూసుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..
వేళాపాళా లేదాయే.. పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే.. చెప్పకపోతే గొడవాయే
బజ్జోమంటే తంటాలా.. ఎప్పుడు పడితే అపుడేనా
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
చరణం: 2
మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ… హవ్వ హవ్వ హవ్వా..
లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ… హవ్వ హవ్వ హవ్వా..
వెండీ గిన్నె తేవాయే… వెన్నెలబువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే… వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా… ఆనక అంటే అల్లరేనా
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను ముద్దుల జోలా…
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
********* ******** ********
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
కట్టు జారి పోతా ఉందీ.. చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్..
బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్
ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ..
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ…
అరే…కట్టు జారి పోతా ఉందా… హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా.. హా
బొట్టు కారి పోతా ఉందా… హోయ్
చుక్క బొట్టు కారి పొతా ఉందా… హా
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా…
కట్టు జారి పోతా ఉందీ… చీర కట్టు జారి పోతా ఉందీ
చరణం: 1
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ
పరువంతా తీసిందమ్మా…
సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా..ఆ… ఆ
కలలెన్నో రేపిందమ్మా…
చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..
చరణం: 2
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా
ముద్దెట్టుకోమందమ్మా…
సిగ్గమ్మ వచ్చింది.. శెలవంటు వెళ్ళింది ..
సిగ్గమ్మ వచ్చింది …శెలవంటు వెళ్ళింది
ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా… ఒదిగొదిగి పొమ్మందమ్మా…
పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు…
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు
అరే…కట్టు జారి పోతా ఉందా…హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా..హ హా
బొట్టు కారి పోతా ఉందీ..
చుక్క బొట్టు కారి పోతా ఉందీ..
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హ హ హ హ హా
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ…
కట్టు జారి పోతా ఉందీ… చీర కట్టు జారి పోతా ఉందీ
****** ****** *******
చిత్రం: సంఘర్షణ (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల,
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
పేదోళ్ళ పాకల్లో సంబరాలు
గొప్పోళ్ల గుండెల్లో గింగిరాలు
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు
పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు
వాడైనా వీడైనా జాతికి మానవుడు
నీతికి వారసుడే ఒకడికి ఒకడూ సోదరుడే
అరెరెరె గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో
అరె జమ్కుజమా జమాలకిడి సంబరాలో
గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో
జమ్కుజమా జమాలకిడి సంబరాలో
కలిసికట్టుగున్నాము
గుమ్కు గుమా గుమాలకిడి
గెలుపు తెచ్చుకున్నాము
జమ్కు జమా జమాలకిడి
కలిసికట్టుగున్నాము
గెలుపు తెచ్చుకున్నాము
కాపాడుకుందాము రేపటికి
ఈ దీపాలు ఇలాగే వెలగడానికి
చదువు సంధ్యలేదు మన పిల్లోళ్ళకి
సక్కంగా పంపుదాము బళ్ళోనికి
కొల్లబోయు గుల్లైనా జీవితాలకీ
కొత్త ప్రాణం పోసుకుందాం రోజు రోజుకీ
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
మనసు పెంచుకుందాము
గుమ్కు గుమా గుమాలకిడి
మమత పంచుకుందాము
జమ్కు జమా జమాలకిడి
మనసు పెంచుకుందాము
మమత పంచుకుందాము
మనుషులల్లె ఉందాము ఎప్పటికీ
మన మంచి సెడు తెలుసుకుని పెరగడానికి
చిచ్చుబుడ్డి పెట్టేద్దాం మత్సరానికి
కాకరొత్తి చాలు చేయి కలపడానికి
రేపు మాపు రాబోయే వెన్నెలకీ
పాడుకుందాం స్వాగతాలు ఈ రాత్రికి
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు
సంబరాలో సంబరాలు
దీపాళి పండగా సంబరాలు