చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం: చిత్ర, యస్.పి.బాలు
నటీనటులు: జగపతి బాబు, గౌతమి, జయసుధ
కథ, మాటలు (డైలాగ్స్): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. యమ్. రత్నం
నిర్మాత: ఎ. యమ్. రత్నం
సినిమాటోగ్రఫీ: నవకాంత్
ఎడిటర్: కోలా భాస్కర్
బ్యానర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 22.06.1995
పల్లవి:
మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ
మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
చరణం: 1
సిగ్గు మొగ్గ అల్లాడి పోయిందిరో కౌగిలిమ్మనీ
సాకు చెప్పి తెల్లారి పోనివ్వకు కన్నె రేయినీ
కొంగుదాటు కవ్వింపులో ఉన్నది కొత్త అందమూ
కోక చాటు కేరింతలో పట్టదా పూల గంధమూ
ఏదో ఏదో ఉయ్యాల ఉయ్యాల ఊగాల ఉయ్యాల
ఏదో ఏదో సయ్యాట సాగాల సందేళ
శోధించుకో వేధించుకో అందిట్లో ఇందిట్లో
ఏముందో చూడాల
మత్తుగా హత్తుకో మెత్తగా వత్తుకో
చరణం: 2
కస్సు మంటు రెచ్చింది నా యవ్వనం కోడె నాగులా
వెన్నుపూస కరగాలి కౌగిళ్ళలో వెన్నపూసలా
తేనెలూరు శృంగార తీరాలలో తాళమేసుకో
భగ్గుమన్న అగ్గెల్లి నా వంటిని అంటిపెట్టుకో
తూలే తుళ్ళే వాగల్లే నీ వళ్ళే పొంగాల
మళ్ళీ మళ్ళీ నా వళ్ళే వంకల్లే వంగాలా
ఊరించుకో సాధించుకో
నీ గుట్టు నా బెట్టు నిలబెట్టుకోవాల ఈ వేళ
మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ