Sannayi Appanna (1980)

చిత్రం: సన్నాయి అప్పన్న (1980)
సంగీతం: జి.కె. వెంకటేశ్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: శోభన్ బాబు , జయప్రద
దర్శకత్వం: దీపక్
నిర్మాతలు: రవి, హరి
విడుదల తేది: 1980

పల్లవి :
సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..

చరణం: 1
ఏ మువ్వ ఎదలో మ్రోగి.. ఏ నవ్వు చెలరేగి..
ఏ ఓర చూపు దూసి… ఏ రూపు నిలవేసి
ఏ ఓర చూపు దూసి… ఏ రూపు నిలవేసి..

చిలిపిగా.. చెలిమిగా…
వలపుగా.. వరముగా…
హృదయాలు కలబోసెనో…

సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..

చరణం: 2
ఏ స్వరము నీలో మెదిలి.. నా పదము పలికిందో..
ఏ సొగసు నీలో మెరిసి.. నా శృతిని తెలిపిందో..

జతులుగా… కళలుగా…
లయలుగా… హొయలుగా…
స్వర్గాలు తెరిపించెనో…

సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sadhyam (2010)
error: Content is protected !!