Santosham (2002)
Santosham (2002)

Santosham (2002)

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉష
నటీనటులు: నాగార్జున, ప్రభుదేవా, శ్రేయ శరన్, గ్రేసి సింగ్
దర్శకత్వం: దశరథ్
నిర్మాత: కె.ఎల్.నారాయణ
విడుదల తేది: 09.05.2002

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా
తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమో
తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై
అందవా.. స్నేహమా..

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

రెక్కలు తొడిగిన తలపు నువ్వే కాదా నేస్తమా..
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా..
హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా..
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా..
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే.. పంచుమా..
 
నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా
నా కళ్లెదురుగా నిలుచున్నదీ నువ్వే కదా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా..
అమృతమనుకుని నమ్మటమే ఒక శాపమా..
నీ ఒడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితమా..
తీయని రుచిగల కటికవిషం నువ్వే సుమా..
పెదవులపై చిరునవ్వుల దగా
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా.. తీరులో ప్రళయమా..
పంతమా.. బంధమా..

నీ ఆటేమిటో.. ఏనాటికి ఆపవు కదా
నీ బాటేమిటో.. ఏ జంటకీ చూపవు కదా

*********  *********  ********

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల  
గానం: రాజేష్, ఉష

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగ సన సన్నగ చేజారిపోనీయకా
చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో శృతి కలిపి పాడగ
నీ నీడలో అణువణువు ఆడగ
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

*********  *********  ********

చిత్రం: సంతోషం
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
పాడినవారు: రాజేష్

ఏమైనదో ఏమో నాలో
కొత్తగా ఉంది లో లో
కలలిలా నిజమైతే
వరమిలా ఎదురైతే
నాలో నీవై నీలో నేనై
ఉండాలనే నా చిగురాశనీ
లో లో పొంగే భావాలన్నీ
ఈవేళిలా నీతో చెప్పాలని ఉన్నదీ
అందాల సిరిమల్లె పువ్వూ
ఏ మూల దాగావో నువ్వూ
చిరుగాలిలా వచ్చి నీవూ
యదలోన సడి రేపినావూ
ఏదో రోజు నీకై నువ్వు
ఇస్తావనే నీ చిరునవ్వునీ
ఎన్నెన్నో ఆశలతోనే
ఉన్నాను నే నీకోసం ఇలా…

*********  *********  ********

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె. కె., ఉష

దేవుడే దిగివచ్చినా
స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా
తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే

చరణం: 1
వెన్నెల చూడు నన్నిలా
ఎంత హాయిగా ఉంది ఈ దినం
నమ్మవా  నన్ను నమ్మవా
చేతికందుతూ ఉంది ఆకసం
ఇప్పుడే పుట్టినట్టుగా
ఎంత బుజ్జిగా ఉంది భూతలం
ఎప్పుడు ముందరెప్పుడు
చూడలేదిలా దీని వాలకం
ప్రేమొస్తే ఇంతేనేమో పాపం
దాసోహం అంటుందేమో
వంగి వంగి ఈ లోకం

చరణం: 2
కోయిలా నేర్చుకోయిలా
ఆమె నవ్వులో తేనే సంతకం
హాయిగా పీల్చుకో ఇలా
చల్లగాలిలో ఆమె పరిమళం
నీటిపై చందమామలా
నేడు తేలుతూవుంది నా మది
చీటికి మాటి మాటికీ
కొత్త కొత్తగా ఉంది ఏమది
అణువంతే ఉంటుందమ్మ ప్రేమ…
అణచాలి అనుకున్నామా
చేస్తుందమ్మా హంగామా…

దేవుడే దిగివచ్చినా
స్వర్గమే నాకిచ్చినా
షాజహన్ తిరిగొచ్చినా
తాజ్ మహల్ రాసిచ్చినా
ఇప్పడీ సంతోషం ముందర
చిన్నబోతాయి అన్నీ కదరా
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే
లోలోన మనసంతా సంతోషమే
ఈప్రేమ పులకింత సంతోషమే

*********  *********  ********

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: శంకర్ మహదేవన్

పల్లవి:
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం

గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం

ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం

చరణం: 1
అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ళ కూతలకీ
హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్ళవనీ జంటలకీ
ఆనందం అందించే ఈ క్షణం
పేకాటరాయుళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు కొంటెసైగలే ఇష్టమంట

ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం

గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం

చరణం: 2
ఈ పెళ్ళిపందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈవేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేదమంత్రాలలో
కన్యాదాతకి అప్పగింతలూ కంటితుడుపులూ తప్పవంటా

హే ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం

గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం

ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ త్తోం
ధీంధినక్ తరి నత్తిక్ నత్తిక్ త్తోం (2)

*********  *********  ********

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: కె.కె., ఉష

డిరి డిరి డిరిడీ వారెవ్వా (౩)

ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా…
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా

అరె డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా

చరణం: 1
అ అదిరి పడకురో దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో
ఏవి టుందో చెప్పలేవురో
అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే

హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా…
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా

చరణం: 2
కనులు కలపరో మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
వలపు వల జారుకుందిలే….
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే

హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
ఇప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా…
అరె ఇద్దరొకటయెరో వారెవ్వా

హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
హే డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా
డిరి డిరి డిరిడీ వారెవ్వా…

*********  *********  ********

చిత్రం: సంతోషం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: విశ్వా
గానం: మనో, భార్గవి , విశ్వా

మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ

మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా

చేంజ్ ద బీట్…
ఓ మాన్…
నాన్సెన్స్

చరణం: 1
మేక్… బ్రేక్ బట్ డోన్ట్ మిస్టేక్ గీవ్
టేక్ కాజ్ లైవ్స్ ఆన్ స్టైక్
ప్రెజెంట్ ఈజ్ యువర్స్ , నో ప్యూచర్  నో పాస్ట్
ఐవాజ్ సర్వై వ్ డ్ యు జస్ట్ ఫర్
ఐయామ్ గోవా మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ
ట్రస్ట్ మి బేబి ఐ విల్ మేకిట్ త్రూ
ఐ డోన్ట్ కేర్ జస్ట్ హు యు ఆర్
డోన్ట్ యు డేర్ ట్రై నౌ దట ఫర్

మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా
మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ

లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్…

జస్ట్….బ్రేక్….ఇట్

చరణం: 2
ఈస్ట్ వెస్ట్ ఐయామ్ ద బెస్ట్
చెక్ ఇట్ ఔట్ నౌ ఇఫ్ యు డోన్ట్ ట్రస్ట్
డు ఆర్ డై ఈజ్ ఆన్ మైలిస్ట్
టేక్ మి ఆన్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్
ఐ కెన్ మేక్ యు డాన్స్ టు మై ట్యూన్స్
కేస్ ద వరల్డ్ గ్రేటెస్ట్ ఫోర్ట్యూన్స్
ఇఫ్ యు ధింక్ యు ఆర్ స్పెషల్ అండ్ స్మార్ట్
లుక్ ఆన్, యు కెన్ టచ్ మై హార్ట్

మోహబూబా మోహబూబా మెరుపే ఈ మగువబ్జా
చూపేస్తే చురకబ్జా నా వలపే వడదెబ్బ
మోహబూబా మోహబూబా లవ్ ప్రిన్సే మనమబ్బా
కనుసైగే చాలబ్బా దిల్ కబ్జా సున్ షబ్బా

Mass (2004)
Previous
Mass (2004)