చిత్రం: సారొచ్చారు (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఖుషి మురళి, శ్వేతా మోహన్, చిన్న పొన్ను
నటీనటులు: రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ
దర్శకత్వం: పరశురాం
నిర్మాత: ప్రియాంక దత్
విడుదల తేది: 21.12.2012
పల్లవి:
సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా
గాజుల ఘల్లు గాజుల ఘల్లు ఏమన్తున్నాదో
గుట్టుగ రేగిన గుండెలో జల్లు ఏమంతున్నాదో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా
నా గుండెల్లో పండగ తెచ్చావే
నా గాజుల్లో సడిపెంచావే
నా పూవుల్లో రారమ్మయ్యావే
నా కళ్ళలో నీరై నువ్వే జారావే
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా
సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది
చరణం: 1
చిన్ని చిన్ని పాదాలు చిట్టి చిట్టి అందెళ్లు
చిందే చిందే రాగాలన్నీ ఏమంటూన్నాయో
హో నువ్వే నువ్వే నా జంటా నీతో స్నేహం చాలంటా
వేరే వద్దు ఆరే అడుగులు నడవాలన్నాయే
చిటికేసే చేతులలో గోరింట ఎరుపే ఏమంటుందో
కలకాలం కాకుండా క్షణకాలం చెలిమై
చేయ్ కలిపేస్తే చాలంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా
చరణం: 2
ఓ ముద్దు ముద్దు అందంలో ముద్దుగుమ్మ రూపంలో
ముత్యం లాంటి ముక్కుపుడక ఏమంటున్నాదో
హో ముక్కెర పైన మెరుపల్లె బుగ్గెర చుట్టూ సిగ్గల్లె
ముక్కెర కింద ఊపిరి నువ్వైవుంటే చాలంది
గలగలలా నాలాగే గుసగుసగా చెవిలో ఏమంటుందో
నీ పలుకే పాటలకే నీ బదులే వింటూ ఇక ఏమాటా విననంది
కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో
మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో
చెప్పేయ్వా ఓ పిల్లా చెప్పేయ్వా చెప్పేయ్వా
సిన్నదాని సూపుల్లో చిక్కినాడు సూరీడు
పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చందురుడు
నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది
హో సూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది