Sashi (2021)

Sashi (2021)

Last updated:

ధీంతానా.. ధీంతానా… లిరిక్స్

చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిల్లివేరు
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హరిచరణ్
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి పురాణిక్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ నాయుడు నందిక‌ట్ల
నిర్మాణం: ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు
విడుదల తేది: 12.02.2021

Dheemthana Dheemthana Song Telugu Lyrics

ధీంతానా ధీంతానా… ఇది మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా… కల ఎదుట వాలినది నిజమేనా

ధీంతానా ధీంతానా… ఇది మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా… కలఎదుట వాలినదినిజమేనా
కనురెప్పల కోలాటమిది… ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది… నులివెచ్చగ బాగుందిది
హే… నిన్నింక వదలనులే… నీ చెయ్యి విడువనులే
నీలోంచి కదలనులే…

ధీంతానా ధీంతానా… ఇది మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా… కల ఎదుట వాలినది నిజమేనా

పాలసంద్రంలా పొంగిపోతున్న… పాలపుంతల్లో తేలిపోతున్న
విరిసే తోటలన్నీ తూనీగల్లే… తిరిగేస్తున్న
కురిసే తారాలన్నీ… దోసిళ్ళలో నింపేస్తున్న
చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న… కొత్త జన్మేదో అందుకున్నా
రెక్క విప్పుకుంటూ… గువ్వలన్నీ గుండెలోకి దూకినట్టు
ఉత్సవాలు జరుపుతున్న
నింగి అంచుమీద… రంగు రంగు చేపలాగ గెంతుతున్న, ఓ ఓ ఓఓ

ధీంతానా ధీంతానా… ఇది మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా… కల ఎదుట వాలినది నిజమేనా

ఇంతకాలంగా ఎక్కడున్నావే… ఉన్నపలంగా ఊడిపడ్డావే
తెలిసీ తెలియనట్టు… నా మనసునే లాగేసావే
అసలేం ఎరగనట్టు… నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూశాకే ప్రాణమొచ్చిందే… వింతలోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి… నా చెంప గిల్లుతుంటే
ఇంతకన్నా హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కన్ను ఇంకా… నన్ను కూడా చూడనందే, ఓ ఓ ఓఓ

ధీంతానా ధీంతానా… ఇది మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా… కలఎదుట వాలినదినిజమేనా
కనురెప్పల కోలాటమిది… ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది… నులివెచ్చగ బాగుందిది
హే… నిన్నింక వదలనులే… నీ చెయ్యి విడువనులే
నీలోంచి కదలనులే…

Sashi Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఒకే ఒక లోకం నువ్వే… లిరిక్స్

చిత్రం: శశి (2021)
సంగీతం: అరుణ్ చిల్లివేరు
సాహిత్యం: చంద్రబోస్
గానం: సిద్ శ్రీరామ్
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి పురాణిక్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ నాయుడు నందిక‌ట్ల
నిర్మాణం: ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు
విడుదల తేది: 12.02.2021

Okey Oka Lokam Song Telugu Lyrics

ఒకే ఒక లోకం నువ్వే… లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే… నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే… కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే… ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా… నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా… జన్మజన్మలా జంటవ్వనా

ఓఓ… కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా… ఆఆ
ఓఓ… కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా… ఆఆ
నిన్న మొన్న గుర్తే రాని… సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి… ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా…

క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే… ఏఏ ఏ ఏ
ఎండే నీకు తాకిందంటే… చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే… వణుకు నాకు పుట్టేనే
దేహం నీది… నీ ప్రాణమే నేనులే

ఒకే ఒక లోకం నువ్వే… లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే… నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే… కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే… ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా… నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా… జన్మజన్మలా జంటవ్వనా

Sashi Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!