Sasirekha Parinayam (2008)

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ నంబియర్
నటీనటులు: తరుణ్, జనీలియా
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 01.01.2009

(గమనిక: మణిశర్మ గారు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాలో రెండు పాటలను విద్యాసాగర్ గారు కంపోజ్ చేశారు అని గుర్తించగలరు )

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా
కనులను ముంచిన కాంతివో
కలలను పెంచిన బ్రాంతివో
కలవనిపించిన కాంతవో ఒహొ ఒహ్ ఒహూ
మతిమరపించిన మాయవో మది మురిపించిన హాయివో
నిదురను తుంచిన రేయివో ఒహొ ఒహ్

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావనా
అలా ఉండి పోక పైకి తేలునా

చరణం: 1
శుభలేఖల నీకల స్వాగతిస్తుందో
శశిరేఖల సొగసెటు లాగుతూ ఉందొ ఒహొ ఊఒ
తీగల అల్లగ చేరుకొనుందూవో
జింకల అందక జారిపొనుందొ
మన్సున పొచిన కొరిక పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకె అంతగ ఒహ్…
అనుమతి నివ్వని ఆంక్షగ నిలబడనివ్వని కాంక్షగ
తికమకపెట్టగ ఇంతగా ఒహ్…

ఇలా ఎంతసేపు నిన్ను చూసినా
సరే చాలు అనదు కంటి కామన

చరణం: 2
మగ పుట్టుకే చేరని మొగలి జడలోనా
మరు జన్మగా మారని మగువు మెడలోన ఒహ్…
దీపమై వెలగని తరుని తిలకాన
పాపనై ఒదగని పడతి ఒడిలోనా
నా తలపులు తన పసుపుగ నా వలపులు పారణిగా.
నడిపించిన పూదారిగా ఒహ్…
ప్రణయం విలువె కొత్తగ పెనిమిటి వరసె కట్టగ
బతకగనేనే నేర్పానుగా ఒహ్…

***********  ***********  ************

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని కొలువుంచె మంత్రం నీవవని
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వె నెలవు తీరేలా
నూరెళ్ళు నన్ను నీ నివేదనవని

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని

చరణం: 1
వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమని చెరను దాటించె రామ చంద్రుడా
రాధ మదిని వేదించె శ్యామ సుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని  కుసుమించె గంధం నేనవని

చరణం: 2
ఆశ పెంచుకున్న మమతకు ఆదారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాప గలిగిన కైలశమా
కొంగు ముళ్ళులోన ఒదిగిన వైకుంటమా
ప్రాయమంత కరిగించి దారపోయన
ఆయువంత వెలిగించి హారతియ్యనా…

నిన్నే నిన్నే  నిన్నే …
ఓ నిన్నే నిన్నే  నిన్నే …

***********  ***********  ************

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: రంజిత్

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా …
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా… (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

ఓ చెలీ…  ఓ చెలీ… ఓ చెలీ… నా చెలీ (2)

చరణం: 1
నిన్నా ఎంచక్కా ఉన్నా మొన్నా దర్జాగా ఉన్నా
ఇవ్వాళ ఏమైందే
గాలే కాటేసినట్టు పూలే కరిచేసినట్టు
ఏదేదొ అవుతుందే
ఎర్రా ఎర్రాని చెంపల్లో సింధూరాలెన్నో చేరాయీ
ఉఱ్ఱూతలూగే ఊహల్లో గందాలే నింపుతున్నాయి…

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా …
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా… (2)

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు

Baby you are driving me crazy..
where can you where can you be
why don’t you show up and make life easy..

Baby you are driving me crazy..
where can you where can you be
why don’t you show up and make life easy..

ఓ చెలీ…  ఓ చెలీ… ఓ చెలీ… నా చెలీ (2)

చరణం: 2
ఇంకా నా వల్ల కాదు ఇంకో క్షణమైనా నన్ను నేనాపలేనేమో
నీకై ఆరాటాలన్నీ నాతో తారాడుతుంటే నే తాళలేనమ్మో
నీ నోట రాని నా పేరే  నాదైనా నాకే చేదేలే
నీ సొంతం కానీ ఈ జన్మే నీరంటూ లేని గోదారే…

ఓ సారి నా వైపు చూశావూ కాసేపు నా గుండె కోశావూ
అందాల బాణాలు వేశావూ దాదాపు ప్రాణాలు తీశావు
ఏ మంత్రమేసి ఏ మాయ చేసీ ఈ వింత మైకం పెంచావూ
నా ముందే ఉండీ ఏకంగా నన్నే నా నుండే దూరం చేశావూ

ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా బుజ్జమ్మా …
ఓ బుజ్జమ్మా బుజ్జమ్మా… (2)

***********  ***********  ************

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ఉబికి వస్తుంటె సంతోషం అదిమి పెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేను నా వెనక తాను
ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం

ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా
వానల మనసును తడిపిందా
వీణల తనువును తడిమిందా

ముల్లుల బుగ్గను చిదిమిందా
మెల్లగ సిగ్గును కదిపిందా
వానల మనసును తడిపిందా
వీణల తనవును తడిమిందా

చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
చిలిపి కబురు ఏం విందో
వయసుకెమి తెలిసిందో
ఆద మరుపో, ఆటవిడుపో
కొద్దిగా నిలబడి చూద్దాం
ఆ క్షణంకంటె కుదరంటొంది నా ప్రాణం
కాదంటె ఎదురు తిరిగింది నా హృదయం

********  *********  ********

చిత్రం: శశిరేఖ పరిణయం (2008)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సైందవి

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం
కలత పడుతోందే లోలోన కసురుకుంటోందే నాపైన
తన గుబులు నేను నా దిగులు తాను
కొంచమైనా పంచుకుంటే తీరిపోతుందేమో భారం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఏ వైనం

పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా
పచ్చగ ఉన్నా పూదోట నచ్చడం లేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
తప్పటడుగో తప్పుఅనుకో తప్పదే తప్పుకుపోదాం
తక్షణం ఎంతో పట్టుపడుతోంది ఆరాటం
పదమంటూ నెట్టుకెళుతోంది నను సైతం

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Goppinti Alludu (2000)
error: Content is protected !!