Sathamanam Bhavati (2017)

చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా, మోహన్ భోగరాజ్
నటీనటులు: శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్
కథ, దర్శకత్వం, మాటలు, స్క్రీన్ ప్లే : సతీష్ వేగేశ్న
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 14.01.2017

మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కల
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో
బాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా

పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి
కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి
వొదట అందరి దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా
ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా
నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరు వెతికే వీల్లేక

కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే
పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరు

***********  **********  **********

చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సమీరా భరద్వాజ్

నాలో నేను నీలో  నేను నువ్వంటే నేను రా
నాతో నేను నీతో నేను నీవెంటే నేను రా
ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను
ఎంత ఎంత ముద్దొస్తున్నావో
ఎంత ఎంత అల్లేస్తున్నావో
నువ్విలానాలోనుంచి నన్నే
మొత్తంగా తీసెసావు

చల్లగాలి చక్కలిగింతల్లో నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో  నువ్వే నువ్వే

రంగు రంగుల కుంచెల గీతం లో నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో నువ్వే నువ్వే

అటు ఇటు ఎక్కడో నువ్వు ఎటు నిలిచినా
మనసుకు పక్కనే నిన్నిలా చూడనా
నీది ధ్యాసలో నను నేను మరిచిన
సంతోషంగా సర్లే అనుకొన్న ఎన్నాళ్లయినా
కళలుకిన్ని రంగులు పూసింది నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది నువ్వే నువ్వే

నిన్న లేని సందడి తెచ్చింది నువ్వే
నన్ను నాకు కొత్తగా చూపింది నువ్వే నువ్వే

మనసుకు నీ కల అలవాటు అయ్యిలా
వదలిని ఓ క్షణం ఊపిరే తీయగా
నా నలువైపులా తియ్యని పిలుపుల
మైమరిపించే మెరుపులా సంగీతం
నీ నువ్వేగా

**********  *********  *********

చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యస్.పి.బాలు

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదో లాంటి తేనెల బాణం
దిగదా ఎదలోకి

నువ్వు నడిచే దారులలో
పూల గంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కాదే
హాయి రాగాల ఆమనిగా
దినమొక రకముగా పెరిగిన సరదా
నినువిడి మనగలదా

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

నన ననన నానాన
రురు రురురు రూరూరు
లల లలల లాల
హహా హాహాహా

ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి ఎదుటే నిలిచాను
చదువుకునే బదులిడని చెప్పుకోలేవులే మనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిబాష
తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా

నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది

**********  *********  *********

చిత్రం: శతమానం భవతి (2017)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: చిత్ర, విజయ్ యేసుదాసు

వధువేమొ.. అలమేలు
వరుడట.. శ్రీవారు
మనువాడి.. కలిసారు
చెలిమి కలిమి ఒకరికొకరు.. ఈ జంటను దీవించగ
దేవతలందరి నోట.. పలికేను చల్లని మాట
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ

మీసకట్టు కుంకుమ బొట్టూ
కంచి పట్టు పంచె కట్టూ
అల్లుకుంది అనుబంధము
మమతలు ముడివేస్తూ
తను.. తన.. తాళి బొట్టూ
ఆమె.. తన.. ఆయువు పట్టూ

ఏకమైంది దాంపత్యము.. ఏడడుగులు వేస్తూ
నాలొ సగం నీవంటు.. నీలొ సగం నేనంటూ
జనుమలు జతపడు వలపుగ ఇరుమనసులకొక
తలపుగ కలగలిసిన ఒక తనువుకు
శతమానం భవతీ
శతమానం భవతీ

అందగాడు అందరివాడూ
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు నచ్చిన చెలికాడూ
పంచదార నవ్వుల వాడూ
పాతికేళ్ల పండుగ వీడూ
తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు
ఉగ్గుపాలె గోదారై
ఊపిరి గాలే గోదారై
గల గల పరుగుల కలలుగ అలలెగసిన
తలువయసుకు నలుపెరుగని పసి మనసుకు
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ
శతమానం భవతీ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sri Sri Sri Maryada Ramanna (1967)
error: Content is protected !!