చిత్రం: సత్య (1999)
సంగీతం: విశాల్ భరద్వాజ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: జె.డి చక్రవర్తి , ఊర్మిళ మథోండ్కర్
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 1999
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
రాతిరంతా చందమామతో
లేని పోని ఊసులాడటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
ఒక్క సారి నిన్ను వానవొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహలోన తడిసాను
ఒక్క సారి నిన్ను వాన వొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహ లోన తడిసాను
మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా
కునుకు రాని అర్ధరాత్రిలో
కళ్ళు తెరిచి కలవరించడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
మెరిసె మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటె
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై
అలజడి ఎటున్నా రమ్మని
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ
దారి పోయె ప్రతి వారిలో
నీ పోలికలే వెతుకుతుండటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో