చిత్రం: సౌభాగ్యవతి (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఎ. వేణుగోపాల్
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
నటీనటులు: కృష్ణ , శారద
దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
నిర్మాత: పి.నాగభూషణం యాదవ్
విడుదల తేది: 01.05.1975
గోలకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బా
గుట్టు తెలుపుదబ్బో గోల చేయకబ్బా
ఎత్తు వంపుల దిబ్బపై ఎక్కి ఎక్కి చూడాలి
మత్తుగ గమ్మత్తుగ మీ మనసు లయలూగాలి
సత్తువ చూపాలి సరదాలు పొందాలి
కొత్తవారు ఒక్కసారి ఎక్కి చూస్తే అబ్బోయబ్బా
నవాబులూ తానిషాలు ఎక్కిన దీ దిబ్బ
నాణ్యమైన వజ్రాలను కన్నది ఈ దిబ్బ
ఎందరో కన్నేసి ఎదురు దెబ్బ తిన్నారు
ఒక్కరికే దక్కింది కోహినూరు ఓయబ్బా
బండపరుపు రాళ్ళల్లో ఎత్తైనది ఈ కొండ
కండబలం లేనివారు ఎక్కలేరు ఈ కొండ
రబ్బరు బంతల్లే రమ్యమైన దీ దిబ్బ
నిబ్బరంగ పైకెక్కితే క్రిందంతా పట్నమబ్బా