
చిత్రం: సీమశాస్త్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: అల్లరి నరేష్ , ఫర్జానా
దర్శకత్వం & నిర్మాత: జి. నాగేశ్వర రెడ్డి
విడుదల తేది: 16.11.2007
మంచితనం ఇంటిపేరు మొండితనం ఒంటిపేరు
కొత్తదనం కొసరుపేరు తెలుగుదనం అసలుపేరు
ముక్కుసూటితనం మారుపేరు
ఆవేశం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
ఆత్మవిశ్వాసం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
అన్యాయం పైదూకే సింహం నేనౌతా
అంధకారమును చీల్చే సూర్యుడు నేనౌతా
ఆకలంటు అన్నోళ్ళకి అన్నం నేనౌతా
ఆడపడుచులందరికి మరో అన్ననౌతా
మనిషి ఏనాడు రెండుసార్లు చావడు
మనిషి ఏనాడు రెండుసార్లు చావడు
చచ్చేలోగా ఏదో సాధించక తప్పదు
ఉత్తేజం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
ఉద్వేగం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
కన్నీటిని తుడిచేందుకె ఉన్నది నాచేయి
కన్నతల్లి ఋణం తీర్చేందుకె ఉన్నది నాబ్రతుకు
కొందరికే అందుతోంది కూడు గుడ్డా గూడు
అందరికి పంచేందుకె వేస్తా నేముందడుగు
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మడమే తిప్పనని పట్టాను దీక్ష
మనకందరి కుంటుంది రామయ్య రక్ష
నిస్వార్ధం నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
నిజాయితీ నాపేరు ఇక నన్నెవరు ఆపేరు
********* ******** *********
చిత్రం: సీమశాస్త్రి (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సుజాత
చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా
కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా
చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా
కన్నెభామా కన్నెభామా ఆపవే హంగామా
హాయ్‌రామా అందుకోమ్మా అలుసా చెలిప్రేమా
అయ్యొరామా కుట్టకమ్మా కులుకుల చలిచీమా
తగదమ్మా మగజన్మా మొగమాటమా
అన్నీ ఇస్తా అన్నాక ఆత్రంగా ఔననక ఆలోచిస్తానంటావా అంతుచూడకా
అంతోఇంతో బిడియంగా తలవంచుకు నిలబడక కంచేతెంచుకు వస్తావా ముందు వెనుక చూడక
సిగ్గే సిగ్గుపడి తప్పుకుంది చాటుగా
అగ్గై వెంటపడి అంటుకోకె అన్యాయంగా
కొంచెం అలవాటయ్యాక రెచ్చిపోతే పద్ధతిగా అంతేగాని ఇంతిదిగా ఇదేం వేడుకా
మీసం రోషం నచ్చాకే మనసిచ్చా ముచ్చటగా మీనం మేషం లెక్కెడుతూ జారిపోకు చల్లగా
సరదా తీరుస్తా సత్తువెంతొ చూపవే
పెదవే అందిస్తా మాటలాపి ముందుకురావే
********* ******** *********
చిత్రం: సీమశాస్త్రి (2007)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్
ప్రియతమా………ప్రియతమా
ఇంత అందమైన అమ్మాయిని… ని… ని… ని..
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
ఎట్టా తలచినావో మలచినావో దేవుడా
ఇంత అందమైన అమ్మాయిని దేవుడా
నేను ఇంతకాలం చూడలేదు దేవుడా
ఐస్కాంతమేదో తనచూపుల్లో దాగుంది
తనవైపే లాగేస్తూ ఉందే
నా మనసే ఆగదు ఏ భాషైనా చాలదు
తనరూపం వర్ణిస్తూ ఉంటే
హరివిల్లును బొమ్మగ చేసి అణువణువు వెన్నెల పోసి నాకోసం పుట్టించావేమో
తనుసన్నగా నవ్వితే ముత్యాల వాన
ఆ వానలో తడవాలే ఏమైనా
నడువొంపులో ఉన్నదే వయ్యారి వీణ
ఆ వీణలో రాగాన్నైపోనా
అమ్మాయి ఊరేంటో తన ముద్దు పేరేంటో తన ఇష్టాలేంటేంటో…..
చెలినే తలచి పనులే విడిచి రేయి పగలు తనఊహలతో
ఇదివరకెరగని అలగడి మొదలై
తడవ తడవకి తడబడి పొరబడి
కలవరపడుతు కలలే కంటూ
కునుకే రాదు కుదురే లేదు
ప్రియతమా………ప్రియతమా
తను అడిగితే ఇవ్వనా నా ప్రాణమైనా
నా సర్వము తానని అంటున్నా
కనుపాపని కాపాడే కనురెప్పలాగా
చెలితోడుగా నూరేళ్ళుంటాగా
ఆ దేవుడు వరమిచ్చి తన మనసే నాకిస్తే నాకింకేం కావాలి
ఎపుడులేదే ఎదలో గుబులు నిను చూసాక సెగలే మొదలు
కదలదు సమయం క్షణమొక యుగమై
కనులు తెరవగా ఎదురుగ నిలబడి
చేతులుచాచి రమ్మని పిలిచి
అందీ అందక ఊరిస్తావే
ప్రియతమా… ప్రియతమా