చిత్రం: సీమ టపాకాయ్ (2011)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: వేటూరి
గానం: జావేద్ ఆలీ , శ్రావణ భార్గవి
నటీనటులు: అల్లరి నరేష్ , పూర్ణా
దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత: డా. విజయ ప్రసాద్ మళ్ళా
విడుదల తేది: 13.05.2011
(ఈ పాట సూపర్ స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన సింహాసనం సినిమాలోనిది పాడినవారు: రాజ్ సీతారాం, పి.సుశీల, లిరిక్స్: వేటూరిగారు, సంగీతం: బప్పీ లహరి )
సరిగమగా…
ఆకాశంలో.. ఆకాశంలో.. (2)
ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేల
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
హే తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే…
జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం
హే అనురాగం అందమిలా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే నీ ముద్దు ముంగిళ్లలోన
కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం
హోయ్ నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే
జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం
ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
హే..నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
హో వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే
జుం జుం జుం జుం తన జుం
జుం జుం జుం జుం తన జుం