చిత్రం: శీను (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిహరన్, సుజాత
నటీనటులు: వెంకటేష్ , ట్వింకిల్ ఖన్నా
దర్శకత్వం: శశి
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 27.08.1999
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది యీ అనుభవం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ…ప్రేమ
మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ…ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు యిల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ…వేళ
ఈనాడు యీ దేవితో మనసు తెలిపెను చాల..చాల
కాలాలు వొకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో….
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది యీ అనుభవం
ఎద మేలుకొలిపింది యీ పరిచయం
ఓ…ఓ…ఓ…ఓ…ఓ…ఓ…
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
********* ********* *********
చిత్రం: శీను (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు
ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా
ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా సుమగీతాల సన్నాయిలా
చరణం: 1
ఆకాశ దేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు
నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు
మమతల మధు మధురిమలిటు సరిగమలాయే
కలబడు మన మనసుల కలవరమైపోయే
గాలుల్లో అందాలు పూలల్లో అందాలు జత చేయు హస్తాక్షరి
అభిమానాల అంత్యాక్షరి
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
చరణం: 2
ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు
నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు
కుడి ఎడమల కుదిరిన కల ఎదకెదుటాయే
ఉలి తగిన శిల మనసున సొద మొదలాయే
ఈ సప్తవర్ణాల నా సప్తరాగాల పాటల్లో ప్రథమాక్షరి
ఇది ప్రాణాల పంచాక్షరి
ఏ కొమ్మకా కొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిలా
సుమగీతాల సన్నాయిలా
ఏ పువ్వుకా పువ్వు నీ పూజ కోసం పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివి దిగి వచ్చె ప్రియనేస్తం లాగా
ఎద గూటికి అతిథిగ వచ్చె అనుబంధం కాగా
మనసాయె మంత్రాలయం ఇది స్నేహాల దేవాలయం
********* ********* *********
చిత్రం: శీను (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునాతీరం ఎదలోన మురళీగానం
చరణం: 1
ఓఓఓ… అలసట చెందిన కలలకు చందనమలదిన ఆశల్లో
నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు లోకం అంకితాలు చేసుకున్న శ్లోకం ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
చరణం: 2
ఓఓఓ… విరహపు యాతన విడుదల కోరిన మనసుల జంటల్లో
శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా
హే… కాంచనాల కన్నె చిలక పలికే కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా…
ఆ రాధకే నా గానం ఆరాధనే నా ప్రాణం
నా గాథ ఇకపై మౌనం ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
********* ********* *********
చిత్రం: శీను (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: పార్థసారధి
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
చరణం: 1
దాయీ దాయీ అనగానే చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే తాకగానే పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా చేరువయ్యా నేనే చెలిగా
రెప్ప మూసినా తప్పుకోనని కంటిపాప ఇంటిలోన
ఏరికోరి చేరుకున్న దీపమా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
చరణం: 2
అన్నెం పున్నెం లేని వాడని అనుకున్నాను ఇన్ని నాళ్ళు
అభం శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో మూగసైగే చేసే దాహమా
మౌనం మీటే లీలతో తేనె రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో
సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్న రూపమా
అల్లో నేరేడు కళ్ళ దాన ప్రేమ వాళ్ళో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవాన నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా మైనా ఇంత ప్రేమ నామీదేనా
కల్లో లేవే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా