సీతారాముల కళ్యాణము.. లిరిక్స్
చిత్రం : సీతారాముల కళ్యాణం (1961)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్యగానం : పి.సుశీల బృందం
తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్యగానం : పి.సుశీల బృందం
నిర్మాణ సంస్థ : ఎన్.ఏ.టి. పిక్చర్స్
విడుదల తేదీ : జనవరి 6, 1961
విడుదల తేదీ : జనవరి 6, 1961
సీతారాముల కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… బొట్టును పెట్టి…
మణి బాసికమును నుదుటను కట్టి… నుదుటను కట్టి..
మణి బాసికమును నుదుటను కట్టి… నుదుటను కట్టి..
పారాణిని పాదాలకు పెట్టి…
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ…
పారాణిని పాదాలకు పెట్టి…
పెళ్ళికూతురై వెలసిన సీతా… కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి…
సంపగి నూనెను కురులను దువ్వి… కురులను దువ్వి..
సొంపుగ కస్తూరి నామము తీర్చి… నామము తీర్చి…
చెంపగవాకి చుక్కను పెట్టి…
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ…
చెంపగవాకి చుక్కను పెట్టి…
పెళ్ళికొడుకై వెలసిన రాముని… కళ్యాణం చూతము రారండి…
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి…
జానకి దోసిట కెంపుల ప్రోవై… కెంపుల ప్రోవై…
రాముని దోసిట నీలపురాశై… నీలపురాశై…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ…
ఆణిముత్యములు తలంబ్రాలుగా…
ఇరవుల మెరిసిన… సీతారాముల కళ్యాణం చూతము రారండి…
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి…