Seetamalakshmi (1978)

seetamalakshmi 1978

చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్
దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాతలు: మురారి-నాయుడు
విడుదల తేది: 1978

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం..ఊమ్మ్…

కూసంత నవ్విందంటే పున్నమి కావాల…
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల…
ఇక చూడనులే ..ఏ.. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాల..
కాసంత చూసిందంటే కడలే పొంగాల..

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల..
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల… ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం…

లలల్లలా..లాలాలాలా..లలలాలా..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి… వెలిగించాల
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..
లలలాల..లలలా..లలలా…

******   ******  *******

చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను…
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు

ఏ పాట నే పాడను…
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ

ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి… ఈ లాలికీ

ఏ పాట నే పాడనూ
బ్రతుకే పాటైన పసివాడనూ
ఏ పాట నే పాడనూ
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో…
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే

ఎందుకో ఎందుకో
నా మీద అలిగాడు చెలికాడు
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే
ఏ పాట నే పాడనూ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top