చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: చిత్ర
నటీనటులు: వెంకటేష్ , మహేష్ బాబు, సమంత, అంజలి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 11.01.2013
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
ఏకువలోనా గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింటా పంటైయ్యింది
పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి అహ సిగ్గంతా చీర కట్టింది
చీరలో చందమామా ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పే తంతెందుకండి
కోదండరామయ్య వస్తున్నాడండీ
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
రానే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడోయమ్మా ఏదో మాయా
సీతకీ రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకసం వియ్యమొందే వేళిది
మూడు ముళ్లు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా… ఓ…
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకీ వీడదీ సీతమ్మా
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాటా
ఆ మాటా విన్నావా రామా అంటుంది
రామా రామా అన్నది ఆ సీతా గుండె
అన్ననాడే ఆమెకు మొగుడయ్యాడే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంటా చుట్టూ చెట్టూ చేమా…ఓ…
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ… ఓ…
****** ***** *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కార్తీక్, అంజనా సౌమ్య
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
అగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరే అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
నీ వలన తడిశా నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశా
జారు పవిటను గొడుగుగా చేసేనోయ్
అరే ఊపిరితో చలి కాసానోయ్
హే… ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా
ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు, వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
సిగ్గులతో మెరిశా గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిసా ఒళ్లు హరివిల్లుగ వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిరుగులు తొడిగాయో
నువ్వు కుండపోత లాగా వస్తే
బిందె లాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ అగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరే అబ్బాయంటే అంత అసులే
నీకు కళ్లేలు వేసిక అల్లడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే
******** ******* *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: కళ్యాణి
ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్లిపోతే
ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా
కబుర్ల చినుకులతో పొడి కలలన్ని తడిపేయ్యడా
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊపీయడా
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో
నువ్వేనా ప్రపంచం అనేస్తూ వెనకే తిరుగుతూ
నేవ్వేనా సమస్తం అంటాడే
కలలోన కూడా కాలుకందనీడే
ఆరుగుడులుంటాడా ఏడుడుగులేస్తాడా
ఏమడిగినా ఇచ్చే వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాడా
అందరికీ నచ్చేసే వాడా
అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి
పనులను పంచుకునే మనసుంటే ఇంకేం కావాలి
అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలాలి
కోరికేదయినా గానీ తీర్చి తీరాలనీ
అతన్నే అతన్నే అతన్నే చూడటానికి వయస్సే తపిస్తూ ఉంటుంది
అపుడింక వాడు నన్ను చేరుతాడే
******** ******* *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, శ్రీరామ చంద్ర
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది
మేళాలు తాళాలు వినరండి
సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి
అచ్చ తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ
మెచ్చుటకు ముచ్చటగ ఇది సాక్ష్యం చెబుతామంటూ
జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండీ
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ
ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా
ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా
ఇంతమందున్నామే అనిపించే బింకం చాటుగా
కాస్తయినా కంగారు ఉంటుందిగా
నీకయితే సహజం తీయని బరువై సొగసించే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలు వచ్చిందే ఈ సమయం
మగాళ్లమమ్మా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ
రామ చిలుకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజ హంసలతో పంపి ఆహ్వానించాంగా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా
ఏ మాత్రం ఏ చోటా రాజీ పడలేక
చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చెమర్చేలా
గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కనులను విచ్చేలా
కలల్లోనైనా కన్నామా కథనైనా విన్నామా
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని
చేయందుకోవటే ఓ రమణీ
******** ******* *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామ చంద్ర
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
పనేం తోచక పరేషానుగా గడబిడా పడకు అలా
మతోయేంతగా శృతే పెంచగా విచారాలా విల విల
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా
కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా
ముస్తాబే చెదరలా నిను చూడాలంటే అద్దం జడిసేలా ఓ
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా
సరే చాలిక అలా జాలిగా తికమక పెడితే ఎలా
ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా
చలినెటో తరమేస్తామా ఛీ పొమ్మని
కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీ పడమా సర్లేమని
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా
అయ్యెయ్యె పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా
చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా
పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా కొండలను కదిలించాలా
చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు
మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా
మనుషులనిపించే రుజువు మమతలను పెంచే రుతువు
మనసులను తెరిచే హితవు వందేళ్లయినా వాడని చిరునవ్వు
ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరేందుకు గోలా
అయ్యోయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడలా
******** ******* *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: అనంత శ్రీరామ్
గానం: శ్వేతా పండిట్, రాహుల్ నంబియర్
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడని కనుకుంటు వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే ఎదురు చూపై నేనున్నా
నీకై జతగా అవ్వాలని…
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందర్లో ఎలాగే అయినా నేనిలాగే
నీ జాడని కనుకుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవటం కోసం ఇంతలా ఇరవై ఏళ్లా
ఏం చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్లు గడవాలే ఇలా
అంతొద్దే హైరానా నచ్చేస్తారంటున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
మేము పొమ్మంటే ఎంత సరదానా మీకాక్షణం
మీరు వెళ్తుంటే నీడలా వస్తాం వెనకా
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనుక
మంచోళ్ళు మొండోళ్లు కలిపేస్తే అబ్బాయిలు
మా కోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంకా చెప్పింకా
******** ******* *********
చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2012)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, శ్రీరామ చంద్ర, రంజిత్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం
ఏం చేద్దాం… అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం… మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం… మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం… తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఫాలో పదుగురి బాట బోలో నలుగురి మాట
లోలో కలవరపాట దాంతో గడవదు పూట
ఇటా ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా
ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా
ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి ఎం ప్రయోజనం
సిమెంట్ భూతల సహారెడారిది నిలవడం కుదరదే కదలరా
ఏం చేద్దాం… అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం… మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం… మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం… తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఎన్నో పనులను చేస్తాం ఏవో పరుగులు తీస్తాం
ఊహూ సతమతమవుతాం ఓహొ బ్రతుకిదే అంటాం
అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం
వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం
ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే అడక్కు అది ఒక రహస్యమే
ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా
ఏం చేద్దాం… అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం… మును మున్దేముందో తెలియని చిత్రం
ఏమందాం… మననేవరడిగారని ఏమని అందాం
ఏం విందాం… తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకాలొడుపుగ దాటుకుంటు
వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
super