Seetharama Raju (1999)

చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున, హరికృష్ణ , సాక్షి శివానంద్, సంఘవి
దర్శకత్వం: వై. వి.యస్. చౌదరి
నిర్మాతలు: నాగార్జున, డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 05.02.1999

శ్రీవారు దొరగారు అయ్యగోరు
ఏంటండీ మీ పేరు ఆయ్ చెప్పండీ
వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
ముదు ముద్దుగ అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారు డార్లింగ్ గారు
గారెందుకు బంగారు వింటుంటే కంగారూ
గారంగ శృంగారంగా డార్లింగ్ అంటే చాలు
డార్లింగ్ కీ లింగు లిటుకు లింకులు పెడితే బోరు
ఓ మై డియరూ…  ఓ మై డియరూ

చరణం: 1
ఊఁ నరనరాల్లోన చలిజ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చేయనే…
ఊఁ కలవరంలోన చలివరం కోరు నసతెలుస్తున్నది మందీయనా…
కనుక్కోవ కుశలం కాస్తైన
అతుక్కోను సమయం చూస్తున్న
నచ్చావే నాటీ నాంచారు ఓ మై డియరూ
శ్రీవారు దొరగారు
మేరీ శ్రీమతి గారు

చరణం: 2
ఓ… యమతమాషాల తమ తతంగాల బుసబరించేదెలా ఇంటాయనో ఓయ్
ఊఁ మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగ చల్లారునో
నిగారాల సొగసులు ఇవ్వాల
ఇలాంటేల అనుమతి కావాల
తయ్యారు అయ్యారా మీరూ డార్లింగ్ గారూ
అబ్బా… ఇంకానా
ప్యారి పెళ్ళాంగారు మేరీ శ్రీమతి గారు
సరసంలో  ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ నన్ను పిలావలే ప్రియురాల
ఓ మై డియరూ
మా ఊళ్లో ఆడాళ్ళూ ఏమయ్యె అంటారు ఊహూఁ
ఆ పిలుపే మోటుగా ఉంటే మారుస్తాలే తీరు ఆఁ
డార్లింగ్ కు గారొద్దంటే తీసేస్తాలే సారూ ఎస్ ఎస్
ఓ మై డియరూ
హాయ్ హాయ్ డియరూ
రా మై డియరూ
ఎస్ ఎస్ డియరూ

*********   *********   *********

చిత్రం: సీతారామరాజు (1999)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యమ్.యమ్.కీరవాణి, రాధిక, శారద

పల్లవి :
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే

చరణం: 1
అన్నయ్యా నీ అలక పైపైనేనని
తెలుసును లేవయ్యా
తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి
నాకు తెలుసయ్యా
ఎన్ని కళలో వెంటతెచ్చెనంట
చూడ ముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో రాసిపోసెనంట
సంకురాత్రి వంటి సమయం
మనసే కోరే అనుబంధాలు దరిచేరే
తరతరాల తరగని వరాలగని అని
మనింటి మమతని మరిమరి పొగిడిన
పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూలదారే

చరణం: 2
కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన
కిలకిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల
కొంటె కోలాటం
ఎంత వరమో రామచంద్రుడంటి
అన్నగారి అనురాగం
ఏమి రుణమో లక్ష్మణుణ్ని మించి
చిన్నవాని అనుబంధం
ఇపుడే చే రే పది ఉగాదులొకసారే
ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ
అనేక జన్మల చిగురులు తొడిగిన
చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాల హోరే