Seetharatnam Gari Abbayi (1992)

seetharatnam gari abbayi 1992

మేఘమా మరువకే.. లిరిక్స్

చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర
నటీనటులు: వినోద్ కుమార్ , రోజా
దర్శకత్వం: ఇ.వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: బురుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 1992

మేఘమా మరువకే

మోహమా విడువకే

మాఘమాస వేళలో మల్లె పూల మాలగ
మరుని గూడి మెల్లగా మరలి రావె చల్లగా
మదిలో మెదిలే మధువై

మేఘమా మరువకే
మోహమా విడువకే

నిదుర కాచిన కన్నె పానుపే రా రా రమ్మంటుంటే
కురులు విప్పిన అగరువత్తులే అలకలు సాగిస్తుంటే
సిగ్గే ఎరుగని రెయిలో తొలి హాయిలో అలివేణి
రవికే తెలియని అందము అందించనా నెరజానా
కలలా అలలా మెరిసి

మేఘమా మరువకే
మోహమా విడువకే

గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందడిలోన
తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామా
మరుగే ఎరుగని కోనలో ఆ మోజులు మహారాజా
నలిగే మల్లెగా సవ్వడి వినిపించనా నెరజానా
జతగా జరిగే అలుసీ

మేఘమా మరువకే
ఆమోహమా విడువకే

*********** ********* **********

ఆ పాపి కొండల్లో.. లిరిక్స్

చిత్రం: సీతారత్నంగారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు

తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి
తడిగా పొడితడిగా తమకాన దాగితే
తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు
తడిగా మడితడిగా తొలి హద్దు దాటితే
తెరిచేయనా ఆ తెరచాపని
విడదీయని ఓ విడిధీయనా
తపనలే తగలనీ లాయి లాల లాయి లాయిలో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు

కొరికే కోరికలే కరిచే కౌగిలిలో
ఎదతో పై ఎదతో సయ్యాటలాడితే
కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై
కదిపి నిను కుదిపి కేరింతలాడితే
కవ్వించనా కొంగు కొసరించనా
ఊరించకే ఊయలూగించకే
మనువులే కుదరనీ వెన్నెలమ్మ లాయి లాయి లో

ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో

*********** ********* **********

మత్తుగా గమ్మత్తుగా.. లిరిక్స్

చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి బాలు, చిత్ర

నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
నాదిరి దినతొం దినతొం దిల్ దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన

ఓ…మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పసిడి పైట పాన్పు చేయనా
పడుచు తనపు పొగరు చూపనా

ఓ…మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా

నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం దిరినా దిరినా
నాదిరి దినతొం దిన దినతొం దిన దినతొం దిరినా దిరినా
త్రిల్లాన దిల్లానా
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన
దిల్ దిల్ త్రిల్లాన దిల్ దిల్ త్రిల్లాన

లే వయసా తెలుసా తొలిపరువపు పిటపిటలు
నా ఎదలో మెదిలే తొలి ముద్దుల కిటకిటలు
ఓ మనసా వినవే చిరు పెదవుల గుసగుసలు
లాలనగా తడిమే చిరు స్వాసల సరిగమలు
పుట్టిందమ్మా ఈడు ఆ ఆ ఆ…
కోరిందయ్యో తోడు ఆ ఆ ఆ…
తపించి తపించి తరించనా నీలో నేనూ
జపించి జపించి జయించనా నిన్నే నేనూ
తాకాలి ఒళ్ళు ఒళ్ళు కురవాలి ప్రేమ జల్లు గుండెల్లో

ఓ…మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా

తాంకు జంతై కిటతక జకుతై తాంకు జంతై (2)

ఈ రగిలే సెగలు తొలి వలపుల రిమరిమలే
నీ ఒడిలో పొదిగే అలుపెరుగని విరహములే
ఓ సుఖమే కలిగే కుడిఎడమల నడుమలలో
యవ్వనమే కరిగే తడి తమకపు గడబిడలో
పట్టిందయ్యో పిచ్చి ఆ ఆ ఆ…
గిట్టేంచెయనా వచ్చి ఆ ఆ ఆ…
నిషాలు రసాలు పుట్టించుకో మళ్ళి మళ్ళీ
నషాల నిషాలు రెట్టించుకో తుళ్ళి తుళ్ళి
కూసింది కన్నె కోడి కుదిరింది మంచి జోడి వారేవా

ఆ…మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా
పడుచు తనపు పొగరు చూపనా
పసిడి పైట పాన్పు చేయనా
ఓ…మత్తుగా గమ్మత్తుగా
చిత్తుగా చెంగొత్తగా

*********** ********* **********

నా మొగుడే బ్రహ్మచారి.. లిరిక్స్

చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్, పి. సుశీల, యస్. పి. శైలజ

యాహూ…
రంగమ్మత్తా, అనుసూయక్క
సీతమ్మొదినా, చెల్లాయమ్మా
ఇది విన్నారా
ఏమిటే
కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ కి పెళ్ళికాలేదు
అలాగా ఐతే మా మనవరాల్నిచ్చి చేస్తాను
మనవరాలికిచ్చి చేస్తావా
పోనీ నువ్వే చేసుకోకూడదు
మా ముసలోడొప్పుకోడెమోనే
సిగ్గులేకపోతే సరి
వాడు నా మొగుడూ

నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది
మూడేళ్ళ కిందటే ఈడొచ్చింది
ముదురు బెండకాయ చూసి మూడొచ్చింది

నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి

సోదెమ్మా సోదెమ్మా
ఎలా ఉంది మా జంట
జంట అది ఇప్పపూల పంట
ఐతే మా పెళ్ళేప్పుడంటా
చెబుతాను చెబుతాను
కంచి కామాక్షి మధుర మీనాక్షి
బెజవాడ కనకదుర్గ మీన ఆన
ఇనుకోయే కూనా
నీ పక్కనున్న పోటుగాడే
నిన్ను ఎదుక్కుంటా వచ్చిన ఏటగాడు
ఈడే నీ మెడ్లో తాళి కడతడు
నీ ఒళ్ళో తల పెడతడు
నీ ఊపుకు పగ్గమేస్తడు
ఉయ్యాలకి పాపనిస్తడు
ఇది ఎరుకల సాని మాట

యాహూ…

ఒడ్డు చుస్తే పొడుగు నాకు తెలిసివచ్చింది
బొడ్డు కింద చీరకట్టు అలిసిపోయింది
వాడి చూపు కన్నే వయసు పోపు పెట్టింది
రేపునైనా చేయ్యమంటూ రెచ్చగొట్టింది
ఉలకడు అసలే పలకడు
ఉలకడు అసలే పలకడు
రవికుల తిలకుడు రవికే అడగడు

నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి

చారి గారు పూజారి గారు
మేము చేసేసు కుంటున్నాము
ఏమిటి
లవ్వు
అవ్వా నువ్వా లవ్వా
అవునోయ్ చెవిలో పువ్వా
పెట్టుమరి పెళ్లి ముహూర్తం
పెడతా పెడతా చూసి మరీ పెడతా
స్వస్తి శ్రీ ప్రజాపతి నామ
ప్రజాపతి హలోపతి హోమియోపతి ఏమిటీ సుత్తి
ముందు ఈ పతి సంగతి చెప్పు
వస్తున్నా వస్తున్నా
వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశి నాటి రాత్రి
తొమ్మిది ఘడియల పంతొమ్మిదివిఘడియలకు
ఘడియా ఐతే వేసేసు కుంటాం
వేసికుందురు గాని వేసికుందురు గాని
వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది
ముహూర్తమా ములక్కాయ హ హ హ…

ముహుర్తాలు చూసుకోవు ముద్దు ముచ్చట్లు
మూడు ముళ్ళు కోరుకోవు మూతి చప్పట్లు
అందమంతా అగ్గిమంట రాజుకుంటుంటే
లగ్గమంటూ ఆపమాకు లవ్వు మీదుంటే
జడవను అసలే విడువను
జడవను అసలే విడువను
పెళ్ళికి ముందే తొలిరేయంటా

నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి
నా మొగుడే బ్రహ్మచారి
నేనేమో కన్యాకుమారి

*********** ********* **********

పసివాడో ఏమిటో ఆ పైవాడు.. లిరిక్స్

చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి (1992)
సంగీతం: రాజ్ – కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి బాలు

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

తాళెరుగని తల్లోక్కరు
తోడెరుగని మోడొక్కరు
కొడుకుండి తండ్రవలేక
సతులుండి పతి కాలేక
తన తలరాతకు తలవంచి
శిలలాగే బ్రతికే దొకరు

బంధాలే సంకెళ్లు వేయగా
బ్రతుకంతా చెరసాల లాగా మారగా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు

చేజేతులా ఏ ఒక్కరు
ఏ నేరము చేసెరగరు
తెలిసెవరూ దోషులు కారు
ఫలితం మాత్రం మోశారు
పరులంటూ ఎవరూ లేరు
ఐనా అంతా పగవారు

ఇకనైనా ఈ మంటలారునా
ఇకనైనా ఈ జంట చెంత చేరునా

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు
వేధించే పంతాలు ఏమిటో
వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో

పసివాడో ఏమిటో ఆ పైవాడు
తను చేసిన బొమ్మలతో తలపడతాడు ఆ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top