Shailaja Reddy Alludu (2018)

shailaja reddy alludu 2018

చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: శ్యాం కాసర్ల
గానం: సత్యవతి (మంగ్లీ)
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: మారుతి దాసరి
నిర్మాతలు: ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్
విడుదల తేది: 13.09.2018

ఛమ్ ఛమ్ బల్ బరి జాతరే చూడే
బమ్‌చిక్ బమ్ బలిపోతాయ్యాడే
ప్రేమా పంతం నడుమన వీడే నలిగిపోతుండే
ఈ పోరడు హల్వా అయితుండే

తిప్పలు మస్తుగా బడ్డా
కొప్పులు రెండు కలువవు బిడ్డా
ఇంతటి కష్టం పడక
ఢిల్లీకి రాజవ్వచ్చుర కొడక

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

శాసనమే తన మాట
నీ అత్త శివగామి బయట
పంతం కూతురు ఎదుట
టామ్ అండ్ జెర్రీ ఆట

అమ్మకు అచ్చు జిరాక్సు
ఈ బొమ్మకు పిచ్చి పీక్సు
బద్దలు కానీ బాక్సు
వద్దనే మాటకు ఫిక్సు

అత్తను చూస్తే నిప్పుల కుండ
కూతురు చూస్తే కత్తుల దండ
ఈ ఇద్దరూ సల్లగుండ

పచ్చటి గడ్డి భగ్గున మండ
పట్టిన పట్టు వద్దనకుండ
ఏ ఒక్కరు తగ్గకుండ
బాబు నీ నెత్తిమీదేస్తే బండ
పడ్డవురా నువ్వు లేవకుండ

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

ఆ రైలు పట్టాలోలే
పక్కన్నే ఉంటారు వీళ్లే యే యే
మెళ్లోనే వేస్తారు నగలే యే యే
ఒళ్లంత చూస్తే ఇగోలే
కలిసుందాం రా సినిమా ఆ ఆ
కలిసే చూస్తారమ్మ
అటు ఇటు అచ్చు బొమ్మా ఆ ఆ
ఎన్నడు కలవవులేమ్మ

కట్టిన బట్ట పెట్టిన బొట్టు దగ్గర ఉండి
ఎక్కే బండి అన్నింట్ల అమ్మ సెలక్షన్
కడుపున పుట్టి అట్టకు మట్టి
పెరిగిన కుట్టి మాటలబట్టి
కట్టయ్యె ఉన్న కనెక్షన్
బాబు మట్టయ్యిపోయే ఎఫెక్షన్
నువ్వు తట్టుకోరా ఎమోషన్

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

2 thoughts on “Shailaja Reddy Alludu (2018)”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top