చిత్రం: శక్తి (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం:
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ , జయసుధ , రాధ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: ఎ. గోపాలకృష్ణ
విడుదల తేది: 02.09.1983
పల్లవి:
అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
అరె దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో తీపి తిక్క
చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో తీపి తిక్క
చరణం: 1
అందాలన్ని చూస్తూ చూస్తూ ఆగలేక
ఆగలేనే వయసుతోని వేగలేక
మల్లెపూలు చల్లగాలి ఓపలేక
మంచం మీద దొర్లి దొర్లి నిద్రరాక
హేయ్ వచ్చేశాను వేళాపాళ చూసుకోక
వచ్చేశాను వేళాపాళ చూసుకోక
చెప్పేశాను తప్పోవప్పో దాచుకోక
చెప్పేశాను తప్పోవప్పో దాచుకోక
అరె చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
హొయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా రేపో నేడో తీపి తిక్క
చరణం: 2
కాగే కాగే వచ్చావింక కాచుకోక
కళ్ళల్లోకి చూసుకొంటు ఉండిపోక
ఉయ్యాలల్లే ఊగుతున్న నడుముదాక
ఉత్సహంగా చెయ్యివేస్తే వదిగిపోక
కొంగు గాలి తగలంగానే పొంగిపోక
కొంగు గాలి తగలంగానే పొంగిపోక
పొంగుతున్న పాలమీద నీళ్లు చల్లక
అరె పొంగుతున్న పాలమీద నీళ్లు చల్లక
హెయ్ చిక్కాడమ్మ చిక్కాడు చిచ్చు ముక్క
దక్కాడమ్మ దక్కాడు తస్స చెక్క
చిక్కిందమ్మ చిక్కింది కన్నె చుక్క
దక్కిందమ్మ దక్కింది జున్ను ముక్క
ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
హోయ్ ఆడేనమ్మ ఈడు జోడు చెమ్మచెక్క
తీరేనమ్మా నేడో రేపో తీపి తిక్క