చిత్రం: శంభో శివ శంభో (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: శంకర్ మహదేవన్
నటీనటులు: రవితేజ, అల్లరి నరేష్ , శివబాలాజీ, సునీల్, సముద్రఖణి, ప్రియమణి, రోజా, అభినయ
దర్శకత్వం: సముద్రఖణి
నిర్మాత: బెల్లంకొండ సురేష్
విడుదల తేది: 14.01.2010
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని…
నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని…
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
నువ్వెవరు నేనెవరంటూ తేడాలే లేకపోతే
లోకంలో సోఖం లేదు మనుషుల్లో లోపం లేదు
చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా
నవ్వుల్లో బాధల్లోను విడిపోనిది స్నేహమేగా
ప్రపంచమే తలకిందైనా…
ప్రేమ వెంట స్నేహం ఉంటే.. విజయమే
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ
నీలకు బదులు నిప్పులు రానీ
పిడికిలి వదలకు పిడుగులు పడని
చూపర ధైర్యాన్ని…
నరాలు తెగిపడి నెత్తురు రానీ
నరమేధాలే కలిగిన గాని
స్నేహం కోసం ప్రాణం పోనీ
చెయ్యర యుద్ధాన్ని…
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
ఓ ఓ ఓ
కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా
నదిలోన భోగ్గే పెడితే క్షణమైనా నిలుచుంటుందా
ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన బీజమేనురా
నీ ఆశలు తీరడానికి ఆ ముసుగులు వేసుకోకురా
స్నేహానికి జన్మ హక్కురా…
నీ తప్పు ఒప్పున దిద్దేయ్.. బాధ్యత
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
చంద్రం రౌద్రం ఔతుందేంటి
మంచే అగ్నిగ మరిగిందేంటి
ప్రేమకు గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి
దిక్కులు దిశలే మారాయేంటీ
పడమట సూర్యుడు పొడిచాడేంటి
గుండెల్లో ఈ గుణపాలేంటి అసలీ కథయేంటి
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
శంభో శివ శంభో శివ శివ శంభో
****** ******* *******
చిత్రం: శంభో శివ శంభో (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: యస్. పి.బాలు, సాధనా సర్గమ్
పల్లవి:
కనుపాపల్లో ప్రేమ కలలే చూపినా
మరునిమిషంలో ప్రేమా కలతే రేపినా
పూవే అందునా ముళ్ళనే దాటక
ప్రేమే చేరునా మనసునే వేధించక
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం
చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా…ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల
తుడిచే నేస్తం కనపడదేలా
చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా…ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక
****** ******* *******
చిత్రం: శంభో శివ శంభో (2010)
సంగీతం: సుందర్ సి. బాబు
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: హరిహరన్
పల్లవి:
ఎవరేమన్నా ప్రేమా ఎదకోతేనుగా
ఎదురీతల్లొ ప్రేమ ఎదుగును వింతగా
ప్రేమను ప్రళయమే వీడిపోదూ
తనతో ఆడితే ప్రేమ తానే కాదు
ప్రతి కథలో ఇది సహజం
పరులకిదే అపార్ధం
చరణం: 1
కడలిని వీడి అడుగులు వేయవు అలలేనాడు
నింగిని వీడి నిలబడగలదా వెన్నెల ఏనాడూ
దేహం ఒకరు ప్రాణం ఒకరని దేవుడు కలిపాడు
విధిలా మారి మళ్ళీ తానే విడదీస్తున్నాడు
ఓ దైవమా…ఈ పాపమెవ్వరిది మరి నీదా నాదా
నా కన్నులలో కన్నీరేల
తుడిచే నేస్తం కనపడదేలా
చరణం: 2
హృదయంలో తొలి ఉదయంలా తన ప్రేమే వెలిగిందీ
ఊహకు అందని ఉపద్రవమేదో నను బలి చేసింది
కనులకు చూపై పెదవికి నవ్వై నను మురిపించింది
ఆ కన్నులలోనే కన్నీరై కలవర పరిచింది
ఓ నేస్తమా…ఓ నేస్తమా నాకన్నా నిన్నే మిన్నగ ప్రేమించా ప్రేమా
అడుగే పడదు అలికిడి లేకా
మరణంలోనూ నిను మరువను ఇంక