చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: శంకర్ మహదేవన్, దివ్య, (రాప్: దర్శన్)
నటీనటులు: చిరంజీవి, శ్రీకాంత్, కరిస్మా కొటాక్
దర్శకత్వం: ప్రభుదేవా
నిర్మాతలు: అక్కినేని రవిశంకర్, జెమిని కిరణ్
విడుదల తేది: 27.07.2007
గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ (4)
గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ (2)
నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా మనసుకి చెప్పింది గుడ్ మార్నింగ్
నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా మనసుకి చెప్పింది గుడ్ మార్నింగ్
నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
నా నడకకు చెప్పింది గుడ్ మార్నింగ్
నా స్మైలుకి చెప్పింది గుడ్ మార్నింగ్
నా స్టైలుకి చెప్పింది గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్
ఎక్కడో నా గుండెలోన గుర్రు పెట్టి నిదరోతున్నా
అరే ప్రేమకే కాఫీ ఇచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్
కోడి కూసే నిమిషం నుంచి ముసుగు వేసే సమయం దాకా
అయ్యబాబోయ్ నాకు అంత గుడ్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే
గుడ్ మార్నింగ్ సబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ (2)
గొంతు వింటే జర్రు మంటు జారుతుంది నా హార్ట్
అందమైన వీణ తీగపై తేనె జారినట్టు హే
మాట వింటే టండనక అంటు
మొగుతుందే నాలో బీటు
అమ్మవారి జాతర్లోన డప్పు కొట్టినట్టు
అయ్యబాబోయ్ ఏం చూసినా వింతగానే ఉంటుందే
తాజ్మహల్ కి పిచ్చి పిచ్చిగా రంగులేసినట్టు
ఓరి నాయనో ఏది విన్న కొత్తగా అనిపిస్తుందే
గంటసాలే గొంతు మార్చి రాక్ పాడినట్టు
గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే
గుడ్ మార్నింగ్ సబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ (2)
చీరకట్టే సుందరాంగో జీన్స్ వేసే మోడరన్ మేంగో
చెప్పరా అరేయ్ ఎవరైనా తను ఎలా ఉంటుందో
వంట చేసే పని తనముందో
వండి పెడితే తినిపెడుతుందో
చెప్పరా అరేయ్ ఎవరైనా తనకి ఏది నచ్చుతుందో
ఇంటికి వస్తే అమ్మను చూసి కాళ్లు మీదే పడుతుందో
లేకపోతే హాయ్ అంటీ అని సరిపెడుతుందో
ఎపుడు నేనెరగని టెన్షన్ ఇపుడెందుకు పుడుతుందో
అయ్యబాబోయ్ ఏదేమైనా
గు గు గు గు గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ కం ఆన్ ఎవ్రిబడి సే
గుడ్ మార్నింగ్ సబరిబా
గుడ్ మార్నింగ్ ఇట్స్ ఏ లవ్ మంత్రా
గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ హైద్రాబాద్ (2)
************* ************* **********
చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చిత్ర, వేణు
చందమామ కోసమే…
చందమామ కోసమే వేచి ఉన్న రేయిలా
వేయి కళ్ళతోటి ఎదురు చూడనా
వాన జల్లు కోసమే వేచి ఉన్న పైరు లా
గంపేడంత ఆశ తోటి చూడనా
జోల పాటకోసమే ఉయ్యాలలోన చంటి పాప లాగ
కోడి కూత కోసం తెల్లారు జాము పల్లెటూరి లాగ
ఆగనే లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట
ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ
అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
హ వెళ్ళు వెళ్ళు హ వెళ్ళు అంటూ
ఈ కాలాన్ని ముందుకే నేను తొయ్యనా
తొందరే ఉందిగా ఊహ కైన అందనంతగా
కాలమ వెల్లవే తాబేలు లాగ ఇంత నెమ్మదా
నీతో ఉంటుంటే నిన్నే చూస్తుంటే
రెప్పే వెయ్యకుండ చేప పిల్లలా
కాలమే వెయ్యలేని ఆపే వీలు లేని
కాలం వెళ్తోంది జింక పిల్లలా
అడిగితే చెప్పవు అలిగినా చెప్పవు
కుదురుగా ఉండ నివ్వవు
ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ
అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
అరె మూడు రెండు ఒకటి అంటూ
గడియరాన్ని వెనక్కి నేను తిప్పనా
ఎందుకో ఏవిటో నిన్నమొన్న లేని యాతన
నా మది ఆగదే నేను ఎంత బుజ్జగించినా
చీపో అంటావో నాతో ఉంటావో
ఇంకేం అంటావో తెల్లవారితే
విసుక్కుంటావో అతుక్కుంటావో
ఎలా ఉంటావో లేఖ అందితే
ఇంకా ఊరించకు ఇంత వేధించకు నిన్నిలా చంపకు
ఏయ్ ఒకటి రెండు మూడు అంటూ
అరేయ్ ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా
ఆ మూడు రెండు ఒకటి అంటూ
గడియరాన్ని వెనక్కి నేను తిప్పనా
*************** ***************** ***************
చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, చిరు, శ్రీకాంత్
క్యారే క్యా హువారే జల్ది చెప్పురే లేక చచ్చురే
హే జగదీక వీరునికి అతిలోక సుందరికి
ఫిక్స్ అయ్యింది మ్యాచ్ ఫిక్స్ అయ్యింది
క్యారే క్యా హువారే
హే ఈ గ్యాంగ్ లీడర్ కి రామ్మా చిలకమ్మకి
మిక్స్ అయ్యింది టేస్ట్ మిక్స్ అయ్యింది
క్యారే క్యా హువారే
బ్యాక్ సీటులో ఆ కిస్సింగ్ కారులో
బ్యాక్ సీటులో ఆ కిస్సింగ్ కారులో
చకా చకా చకా చకా ఒకే ఒక పప్పి ఇచ్చింది
అన్న పప్పి అంటే కుక్క పిల్లనా
ఒరేయ్ పప్పీ అంటే హిందీలో ముద్దురా ముద్దు
ఒరేయ్ అన్నకి ముద్దు పెట్టేసిందంట రా…
హే హైరామా హైరా హైరామా
హైరామా హైరా హైరామా
గి కిస్సింగ్ కారేందన్న
షావుకారు పట్టకారు ఆస్కారు సర్కారు
ఆఖరికి బేకార్ అంటే కూడా నాకు తెలుసు
అదేరా మన చమత్కారు
అబ్బా గీ కిస్సింగ్ కారు కథ జర స్టార్ట్ చేయరాదె
ఏ ఇంజిన్లో డీజిల్ కొట్టించి అలా సాయంకాలం వెళ్లామండి ఫిల్మ్ కి
ఇంటర్వెల్లో చెయ్యే పట్టేసి
అరే పాప్ కార్న్ పెట్టానండి పాపకి
కుర్చీలో సిట్టింగ్ అయ్యింది
ఇహ కొంచం కొంచం సెట్టయ్యింది జంటకి
సినిమా హాల్లో పవర్ పోయింది
ఇక ఇంకో సినిమా స్టార్ట్ అయ్యింది ఒంటికి
కైపెక్కింది భలే కిక్కెక్కింది తనే కారెక్కి కిస్ ఇచ్చింది
అన్న పిక్చర్ చూపించి పిచ్చెక్కించినావన్నా
నువ్ మామూలోడివి కాదన్నో
దా దా దా దా దా దా శంకర్ దాదా
శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్ శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్ జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్
హే జగదీక వీరునికి అతిలోక సుందరికి
హే హైరామా హైరా హైరామా
హైరామా హైరా హైరామా
నీది వన్డే మ్యాచ్ కాదే టెస్ట్ మ్యాచ్ లా ఉంది
నెక్స్ట్ ఏం జరిగిందన్నా
వింటావా అయితే వినుకో
హే బ్రదర్స్ మళ్ళీ రివర్స్
మేం జంబో సర్కస్ కెళ్లామండి జుమ్మని
గాండ్రింపుల్సు సింహం గర్జింంగ్స్
విని బెంబేలెత్తి పోయిందండి భామిని
అదుర్స్ తనే బెదుర్స్
అలా ఒల్లోకొచ్చి వాలిందండి చాందిని
తన టెన్సన్స్ నాలో టెంప్టింగ్స్
రెండు ఏకం అయ్యి పెంచిందండి మూడుని
క్లచ్చేశాను అలా టచ్ చేశాను
అరే ఇవ్వాల్సిందిచ్చేశాను
ఏమిచ్చావన్న
ముద్దే ముందు తనిచ్చింది కదా మళ్ళీ తన ముద్దు తనకిచ్చేశాను
మనం ఒకళ్ళ సొమ్మునుంచుకోము రోయ్
ఎవరిదాళ్లకిచ్చేశాను అంతే
నువ్వు ఏడికో ఎసిగిపోయావన్నా
హే పోరా
శంకర్ దాదా శంకర్ దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్
హే జగదీక వీరునికి అతిలోక సుందరికి
హే హైరామా హైరా హైరామా
హైరామా హైరా హైరామా
అరె హోయ్ శంకర్ దాదా MBBS కి జై బోలో
ఓయ్ ఎవర్రా అది ఇది శంకర్ దాదా MBBS కాదు
శంకర్ దాదా జిందాబాద్
సారి అన్న అలవాటైపోయింది
అది ఇప్పుడేస్కో
హే శంకర్ దాదా జిందాబాద్ హుహా హుహా (10)
హే శంకర్ దాదా శంకర్ దాదా
శంకర్ దాదా జిందాబాద్
*************** ***************** ***************
చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: అద్నాన్ సామి, గోపిక పూర్ణిమ
భూగోళమంతా సంచిలోన…
భూగోళమంతా సంచిలోన
నా ప్రేమనంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్ని పిల్లా గుత్తంగ పాడుకొచ్చా
హే నా గుప్పెడంత గుండె పైన
నీ చిట్టి పేరే రాసుకొచ్చా
నీ సోకు క్షేమంకే గుళ్లో ఆకు పూజ చేసుకొచ్చా
బాపురే నా కోసం ఇంత లేనిపోని ఖర్చా
ప్రేమలో ఈ పాఠం ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్ కెళ్ళి చదవలేదు…
హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
హేయ్ భూగోళమంతా సంచిలోన
నా ప్రేమనంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్ని పిల్లా గుత్తంగ పాడుకొచ్చా
నీ అందమెంతో లేత లేత అది కందకుండ కాపు కాస్తా
నీ సుందరాల మేనికి సబ్బు రుద్దాడానికి
చందురుణ్ణి పట్టుకొస్తా
నీవి దోర దోర వన్నెలంత చేయి జారకుండ చూసుకుంటా
నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దాడానికి
మెరుపునైన పట్టి తెస్తా
దేవుడో ఈ ట్రిక్స్ ఏడ నేర్చినావు
నువ్వు చెప్పు కాస్తా
హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు…
స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
హరే నువ్వేనంటా నా సీత
దాన్ని రాసినాడు బ్రహ్మ తాత
నువ్వు మాయలేడి నడిగినా శివుడి విల్లు నడిగినా ఇరగ కుండ తీసుకొస్తా
అరె నువ్వేనంట సత్యభామ
నిన్ను అలగనీను నమ్మవమ్మా
కంచి పట్టు చీరలడిగిన పర్సు చిల్లు అయినా కిక్కురనకుండ పట్టుకొస్తా
అయ్యా బాబోయ్ ఈ జోక్స్
ఏడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్తా
హేయ్ స్కూల్ కెళ్ళి చదవలేదు…
స్కూల్ కెళ్ళి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్న 1 4 3
పలక పట్టి దిద్దలేదు A B C
ప్రేమ నేర్చినాడు అంట నన్ను చూసి
*************** ***************** ***************
చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: మమతా మోహన్ దాస్, నవీన్
హే ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
హే సయ్యంటే సెంటే పూస్తా రెంటిస్తే టెంటే వేస్తా
హింటిస్తే వెంటే వస్తా బుల్లోడా
హే వయసన్న మాట మా వంశంలో లేదు
అరె మావన్నది తప్ప ఏ వరసా పడదు
లేదన్న మాట మేం పలికిందే లేదు
మా పడకింట్లో ఎపుడు పగలంటూ రాదు
ఆకలేస్తే… ఆకలేస్తే…
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
ఎంత గొప్పైనా ఆ మేలిమి బంగారం
నిప్పులోన పడితే కాని కాదు వడ్డాణం
హో ఎంత చురుకైన నీ గుండెలో వేగం
నా ఒళ్ళో కొచ్చి పడితే గాని రాదు రా మోక్షం
అరె అందాల అరకోకమ్మో
హోయ్ నా మీద పడబోకమ్మో
హేయ్ అందాల అరకొకమ్మో
హోయ్ నా మీద పడబోకమ్మో
మరి మరి తగిలితే నీ చెవి మెళికలు
తప్పవు బుల్లెమ్మో
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
సంతలో పరువం ఇక ఆడుకో బేరం
ఆ సూది మందే గుచ్చెరో నీ చూపులో కారం
క క క కాదు శనివారం మరి ఎందుకీ దూరం
నీ గాలి సోకి జివ్వు మంది కన్నె సింగారం
అరె నాజూకు నడుమొంపమ్మో
హోయ్ పరువాలు అటు తిప్పమ్మో
హేయ్ నాజూకు నడుమొంపమ్మో
హోయ్ పరువాలు అటు తిప్పమ్మో
ఎరుగని మనిషితో చొరవలు ముప్పని
తెలుసుకో ముందమ్మో
ఆకలేస్తే…
ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా
మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా
*************** ***************** ***************
చిత్రం: శంకర్ దాదా జిందాబాద్ (2007)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సాగర్, దేవి శ్రీ ప్రసాద్
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
ఓ బాపు నువ్వే రావాలి
నీ సాయం మళ్ళీ కావాలి
వందేమాతరం గాంధీ ఓంకారం
జరిగే దుర్మార్గం ఆపాలి
నువ్వే ఓ మార్గం చూపాలి
వందేమాతరం గాంధీ ఓంకారం
కళ్ళజోడుతో చేతికర్రతో
కదిలే ఓ సత్యాగ్రహం
కదిలే ఓ సత్యాగ్రహం
వెండికొండలా శిరసు పండినా
యువకుల మించిన సాహసం
యువకుల మించిన సాహసం
బక్కపలచని బాపు గుండెలో
ఆ సేతుహిమాచలం
బిక్కు నరాల్లో ఉప్పొంగే
స్వాతంత్ర రక్త గంగాజాలం
సత్య మార్గమున మడమ తిప్పని
స్వరాజ్య దీక్షా మానసం
అతడంటే గడ గడ వణికింది
ఆంగ్లేయుల సింహాసనం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
చాకు పిస్తోలు కొడవలి గొడ్డలి
ఎందుకు హింసా సాయుధం
ఆవేశం కోపం ద్వేషం కాదు
చిరునవ్వే మన ఆయుధం
చిరునవ్వే మన ఆయుధం
సాటి మనిషిపై ప్రేమేగా
మన మాతృ భూమికి గౌరవం
మానవతే మనకెన్నడు చెరగని
అందమన్న గాంధీఇజం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
భయం చెందని నెత్తురు చిందని
గాంధీ మహోద్యమ జ్వాలలు
గాలి తరంగాలై వీచినదీదేశంలో నలుమూలలు
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం
వందేమాతరం గాంధీ ఓంకారం