చిత్రం: శంఖం (2009)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: ఆచార్య శ్రీ శేషం
గానం: పుష్పవనం కుప్పుస్వామి, రంజిత్
నటీనటులు: గోపిచంద్, త్రిష
మాటలు ( డైలాగ్స్ ) : అనిల్ రావిపూడి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిరుతై శివ
నిర్మాతలు: జె.భగవాన్ , జె.పుల్లయ్య
బ్యానర్: శ్రీ బాలాజి సినీ మీడియా
విడుదల తేది: 11.09.2009
ధీరాది ధీరుడివయ్యా
మాట్లాడే దేవుడు నువ్వయ్యా
మారాజ మారాజ మారాజా
ధీరాది ధీరుడివయ్యా
మాట్లాడే దేవుడు నువ్వయ్యా
మారాజ మారాజా
శూరాది సూర్యుడివయ్యా
పోరాడే యోధుడివి నువ్వయ్యా
యువరాజా యువరాజా
మీరిద్దరుంటే లోటేమిటంట
సుఖశాంతులింటింట కొలువుండునంట (2)
నేడు వచ్చిందయ్యోఅసలైన సంక్రాంతి
నందా ఆనందా గోవిందా ముకుందా (2)
ఇన్నాళ్లు కొడుక్కు దూరం ఉన్నావయ్యా
గుండెల్లో అగ్నిగుండం దాచావయ్యా
మాకు ప్రియ నేస్తమయ్యి నిలిచావయ్యా
మన ఊరికే వన్నె తెచ్చావయ్యా
నీ దయా ప్రేమ త్యాగం
నీ ధైర్య సౌర్య గుణం
మీ సాటి లేని వంశ గౌరవం
మీ సత్యం ధర్మం న్యాయం
మీ స్వచ్చమైన దానం
మాకు ఇచ్చే బంగారు లోకం
ఓయ్ రామ
మీరిద్దరుంటే లోటేమిటంట
సుఖశాంతులింటింట కొలువుండునంట
నేడు వచ్చిందయ్య అసలైన సంక్రాంతి
నందా ఆనందా గోవిందా ముకుందా
ధీరాది ధీరుడివయ్యా
మాట్లాడే దేవుడు నువ్వయ్యా
శూరాది సూర్యుడివయ్యా
పోరాడే యోధుడివి నువ్వయ్యా
జాతరే జాతరే ఎల్లమ్మ జాతరే
ఎల్లమ్మ జాతరంటే ఊరంతా సందడంట
మా ఊరి పెద్దోళ్ళు మీరుంటే పండగంట
ఊరంతా పండగంటా
ఊరంతా పండగంటా
కష్టాలు కడతేర్చు నాయకుడివై
తండ్రిని మించినట్టి తనాయుడవై
పేదోళ్లకే ధర్మ బిక్షానివై
వరమీయ వచ్చావు కులదైవానివై
ఆ కోర మీసం జోరు ఆ కొంటి చూపు తీరు
శత్రువుకు సింహా స్వప్నమే
ఆ మందహాసం చూడు
ఆ హుందాతనం చూడు
అందరికి కన్నుల పండగే
ఓయ్ రామ రక్తంలోన నాయకత్వం
ఊపిరిలో ఉందయ్య ఆ వారసత్వం
నేడు వచ్చిందయ్యో అసలైన సంక్రాంతి
నందా ఆనందా గోవిందా ముకుందా (2)
హే ధీరాది ధీరుడివయ్యా
మాట్లాడే దేవుడు నువ్వయ్యా
మారాజ మారాజ మారాజా
మారాజ మారాజ మారాజా
శూరాది సూర్యుడివయ్యా
పోరాడే యోధుడివి నువ్వయ్యా