By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Sign In
A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Notification
Aa
  • Movie Albums
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Reading: Shirdi Sai (2012)
Share
A To Z Telugu LyricsA To Z Telugu Lyrics
Aa
  • Movie Albums
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Search
  • Movie Albums
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics
Have an existing account? Sign In
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
Copyright © A To Z Telugu Lyrics 2019-2023. All Rights Reserved.

Home - 2012 - Shirdi Sai (2012)

Movie AlbumsNagarjuna

Shirdi Sai (2012)

Last updated: 2020/06/06 at 3:28 AM
A To Z Telugu Lyrics
Share
12 Min Read
SHARE

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాతలు: మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి
విడుదల తేది: 06.09.2012

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం
దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

అలా ఒకనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రి మహాముని పత్ని
అనసూయ పరమసాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయా జలధిని మునిగి
అనసూయనే పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరముగా వడ్డింపమనిన దిక్పతులను చూసి
దిగ్ర్బాంతి చెందినది

కాలమూర్తులను చంటి పాపలుగ మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించినది

పతులు పసిపాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరి
గొల్లుమనుచూ పతిభిక్ష పెట్టమని కొంగుచాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యంతో పాలకులోకటిగ బాసిల్లిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మొరడిలిరి

ముగురు మూర్తులను ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశ అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది

దత్తాత్రేయుని అవతరణం భక్తబృంద భవతరణం
సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం

సృష్టి స్థితి లయ కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలగా
అన్ని ధర్మముల ఆలవాలముగా ఆవు పృష్ఠమున అలరగా
నాల్గు వేదముల నడివడిగా నాల్గు శునకములు నానుడిగా
సమర్థ సద్గురు అంశమే ఆ దత్తుని ఐదు అంశములై
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా
ధర వెలిగే ధర్మ జ్యోతులుగా

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యమ్. యమ్. కీరవాణి

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై

పల్లవి:
నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైనా తీర్థమైన నీవేగా
ఓ జీవమైనా భావమైన నీవేగా
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవులేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా

చరణం: 1
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ

కృష్ణా… రాధాకృష్ణా హే కృష్ణా
తనువులన్ని నీవుకాచుకోలేనురా కృష్ణా
త్రోవచూపు తోడు నీవే కృష్ణా
తలపులన్ని నీవరనా పోలేమురా
తరలిపోని తావి నీవే కృష్ణా
జగదేక జ్ఞానమూర్తి వసుదైక ప్రాణకీర్తి
తరగపోని కాంతి నీవే నంద నందనా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా
నీవులేని చోటులేదు కృష్ణా
ఈ జగమంతా నీవేలే కృష్ణా

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు,  సినీత

పల్లవి:
సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము
నువ్వోస్తావన్న ఆశతో
బ్రతికొస్తావన్న ఆశతో
జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము
కోటి చుక్కలమయ్యాము
కన్నీటి చుక్కుల మయ్యాము

తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

చరణం: 1
బోథలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
బోథలు చేసేదెవరు మాలో బాధలు బాపేదెవరు
లీలలు చూపేదెవరు మాతో గోళీలాడే దెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు
తీయగ కసిరేదెవరూ…
తీయగ కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు
సాయి… జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా?
నువు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు

తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

చరణం: 2
మాకిచ్చిన నీ విబూదిని నీకూ కాస్త పూసేమయ్యా
లేవయ్యా సాయి లేవయ్యా
నీ చేతిచిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్య
లేవయ్యా బాబా లేవయ్యా
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
ఇన్నాళ్లు నువ్వడిగావు మానుండి భిక్షని
యివ్వాళ మేమడిగేము నీ ప్రాణ భిక్షని
నీ ప్రాణ భిక్షని
యిచ్చేవరకు ఆగలేము
యిచ్చేవరకు ఆగలేము
నువ్వొచ్చేవరకు వూరుకోము
వచ్చే వరకు వూరుకోము
పచ్చి మంచినీరైనా తాకబోము

సాయి అంటే తల్లి
బాబా అంటే తండ్రి
సాయి బాబా నీ తోడేలేక
తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము
రెక్కలు రెండూ లేని పక్షుల మయ్యాము

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి (13)

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహాదేవన్

సబ్ కా మాలిక్ ఏక్ హై
ఒక్కడే సూర్యుడు
ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలించింది మీరు
ఏసునే దైవమనీ తలచింది మీరు
అల్లా అని ఎలుగెత్తి పిలించింది మీరూ
ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా
ఏ తీరుగా ఎవరు పూజించినా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

కాషాయ ధ్వజమునెత్తి  ప్రణవ గంగ గలగలలను హిందూమతమన్నావు నీవు
ఆకుపచ్చ కేతనాన చంద్రవంక తళతళలను ఇస్లాము అన్నావు నీవు
శిలువపైన ఏసు రక్త కన్నీళ్ళతొ ఎదను తడిసి క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధమని జైన మని సిక్కు అని ఒప్పుకునే పలు గుండెల పలుగొంతుల పలుకేదైనా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద బేధమెపుడు చూపబోదు గాలీ
అది దేవదేవునీ జాలీ…
పసిడి మేడనీ పూరి గుడిసనీ బేధమెరిగి కురియబోదు వానా
అది లోకేశ్వరేశ్వరుని కరుణా
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువు దీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని భ్రాంతి విడు
ప్రతి అణువున తన రూపమె ప్రతిబింబముగా
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతి రూపముగా
ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు

ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

సాయీ శిరిడి సాయి శిరిడి సాయీ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

యోగి ఓలే భిక్షాటన చేసి
మా పాలకు జోలిపట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞాన చక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
రగిలే ధునిలో… చేతులు ఉంచి
పసి పాపను ఆదుకున్న ఆత్మబంధువూ

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరి అని నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
తిరగలి విసిరి… వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీనబంధువు

శరణు శరణు శరణం గురుసాయి నాధ శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె
ఎపుడు చూసినా ఆత్మధ్యానమే కానీ నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి

ప్రతిరూపం తన ప్రతిరూపమని
యుగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకుపడగా
బీతిల్లిన జనులు పరుగులిడగా
ఆగిపోమ్మని ఆజ్ఞపించినా
గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: కె. శివశక్తిదత్త
గానం: శ్వేతా పండిట్

అమరా రామా సుమా రామచరి
కామధేను క్షీరాలతో
సాయినాధుని పావనమూర్తికి
అభిషేకం క్షీరాభిషేకం
అభిషేకం క్షీరాభిషేకం

సురకల్పలతా సురభిడ సుమాలా
సురుచర సుమధుర మకరందంతో
సాయినాధుని మంగళమూర్తికి
అభిషేక్షం మధురాభిషేకం
అభిషేక్షం మధురాభిషేకం

మలయమై దర శిఖరవనంతార
చందన శీతల గంధంతో
సాయి నాధుని సుందరమూర్తికి
అభిషేక్షం చందనాభిషేకం
అభిషేక్షం చందనాభిషేకం

శ్రీహరి పదరాజీవ సముద్భవ
గగన గంగ పావన శ్రీకరముల
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం
సాయి నాధుని శ్రీకర మూర్తికి
అభిషేకం నీరాభిషేకం

నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
నీ భవహీజ సమీప ధూనీగత
ఆ దివ్యది నిరోధి ఊదితో
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం
సాయినాధుని తేజోమూర్తికి అభిషేక్షం
పూజాభిషేఖం

జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం
జయహో సాయి జయం జయం
నీ పదకమలములకు జయం జయం

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: యమ్. యమ్. కీరవాణి
గానం: దీపు

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా

చరణం: 1
మమతా కరుణా తనరక్తం
తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదంగా
ప్రియభాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని, ప్రేమే దైవమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా

చరణం: 2
సిరి సంపదలు ఎన్నున్నా
శీలం విలువ చేయవని
సుఖభోగములే నీవైనా
దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనరా బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి శ్రీ సాయిబాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా
మానవ సేవే మాధవ సేవని
బోధించినాడు ఒక బాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా
ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా
షిరిడిలోన ఉన్న షిరిడి సాయిబాబా

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: మేడిచెర్ల
గానం: సునీత

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయి
కడసారి కనులార దర్శనమునీయి
నీలోని ఈ ఆత్మ కలసిపోనీ

ఈ జన్మకిది చాలునోయి
నీ ఒడిలో కనుమూయానీ

*********    **********  **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: ట్రెడిషనల్
గానం: యమ్. యమ్. కీరవాణి

సదానింబ వృక్షస్య మూలాది వాసాత్
సుధా స్రావిణం తిక్త మప్యప్రియంతం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నామామీశ్వరం సద్గురుం సాయినాథం

Sadaa nimbavrikshasya muladhivasat
Sudha sravinam tikthamapya priyantam
Tarum kalpavrikshadhikam saadhayantam
Namaameeswaram sadgurum sai nadham

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం: హరిచరణ్ ,  మాళవిక

శ్రీ రామా జయ రామా రమణీయ నామ రఘురామా (5)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రామనవమి చెప్పింది రామకథా సారం
రామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
శ్రీరామనవమి చెప్పింది రామకథా సారం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
ఊరు వాడా సంబరం
చిందేసింది అంబరం
రామ నవమి జయనామ నవమి శ్రీరామ నవమి చెప్పింది రామకథా సారం

దశరధుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాశరథి విశ్వశాంతి విలసిల్లెను
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
పాదధూళితో రాయిని రమణిగ మార్చెను మంగళధాముడు
శివ థనువు విరిచి నవ వధువును సీతను చేరెను రాముడు
సాయి…
ఆ రాముడు కొలిచిన పరమ శివుడవు పరమేశ్వరుడవు నీవే సాయి
పరమేశ్వరుడవు నీవే సాయి

రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథా సారం

తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము
మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణము
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
వానర సేనలు వారధి కట్టగ వారధి దాటెను నరవరుడు
రణ శిరమున రావణుకూర్చి  పట్టాభిరాముడాయే రఘురాముడు
సాయి…
ఆ రామసాయి శ్రీకృష్ణ సాయి శ్రీరంగ సాయివి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే సమర్ద సద్గురు షిరిడి సాయి

రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ సాయి రామ సాయి రామ సాయిరాం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ నవమి చెప్పింది రామ కథాసారం

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: శ్రీ వేదవ్యాస
గానం:  యమ్. యమ్. కీరవాణి

పరమ యోగీంధ్రులకు పరమ పదమందించు
పరమ పావన విష్ణు పాదం
భవబంధ రహితమై బ్రహ్మమై బాసిల్లు
పరమ పావన విష్ణు పాదం
పరమ పావన పరబ్రహ్మ పాదం

ఘనభూమి గగనముల కొలిచి చుంబించి
ఫలితం భ్రమణంన వామనుడి పాదం
దివ్యమౌ భవ్యమౌ దివిజా గంగాజలము
జాలువారిన  జగన్నాథ పాదం
కూనీగుండెల నిండి మైత్రి పండించిన
కులమాతీత రఘుకుల రామ పాదం
దశ దిశ దీపమీ పాదం దయకు ప్రతిరూపమీ ధర్మపాదం

శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం

కపట రాక్షస వికట బహుపదాటోప
విదుషకట సువిపాటన సుచనలపటు పాదం
కాళీయు తలలపై తక్దిమ్మి తకదిమ్మి
తాండవమ్ముల కృష్ణ పాదం
కంసాది విధ్వంస హింసావిధ్రంశ
యదువంశ నరరాజ హంస పాదం
మూడు మూర్తుల ముక్తి పాదం
ముక్కోటి దేవతల మూలపాదం

శరణం శ్రీవిష్ణు పాదం
శరణం శ్రీరామ పాదం
శరణం శ్రీకృష్ణ పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం శ్రీసాయి పాదం
శరణం గురుసాయి పాదం

*********    ***********    **********

చిత్రం: షిరిడిసాయి (2012)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: చైత్ర ,  యమ్. యమ్. కీరవాణిి, రేవంత్ , యస్. పి. బాలు, సాయి కుమార్

గాలే ఆగిపోతుందంటే నమ్మాలా
నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా
నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా
దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా
అది జరగబోదు అని, జగరనివ్వనని
వస్తున్నా బాబా వస్తున్నా
ఆ మృత్యువు రాకని ఆపేయాలని వస్తున్నా
మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా

బాబా మిమ్మల్ని చూడకుండా
మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకటం బాబా

బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి
ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా

భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను
సూర్యచంద్రులు, చుక్కలు నేనై కనపడుతుంటాను
మిమ్ము కనిపెడుతుంటాను
బాబా నేను మీ భారం మోస్తుంటాను

సమాధి నుండే సమాధి నుండే బదులిస్తాను
సహాయమడిగితే కదిలొస్తాను
పిలిస్తే పలుకుతాను పిలిస్తే పలుకుతాను
పిలిస్తే పలుకుతాను, బాబా బాబా

వస్తున్నా బాబా వస్తున్నా
నీ బదువుగా నేనే బలిఅవుతానని వస్తున్నా బాబా వస్తున్నా
వస్తున్నా బాబా వస్తున్నా

మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా
మాకిప్పుడు వెలుగు లేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమే లేదు
మీరు లేనిలోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి

నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో
నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువవుతాను
నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను
నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను
నా విభూది ధరియించండి, మీ వేదన నాదంటాను
నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను
నా చరితను పఠియించండి మిము చరితార్థుల చేస్తాను
మరణ శయ్య కాదిది శరణు కోరినవారికి కరుణ శయ్య
సమాధి కాదిది, కష్టాల తొలగించు సన్నిధి
జ్ఞాన సిరిలనందించు పెన్నిధి
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ షిరిడీ
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ

You Might Also Like

Na Roja Nuvve Song Lyrics

Jai Shri Ram Jai Shri Ram Lyrics

Chamkeela Angelesi Song Lyrics

Kallalo Undhi Prema

Zari Zari Panche Katti Song Lyrics – Telugu Folk Songs Maanas, Vishnu Priya

TAGGED: 2012, K. Raghavendra Rao, M. M. Keeravani, Nagarjuna Akkineni, Shirdi Sai

Sign Up For Daily Lyricsletter

Be keep up! Get the latest lyrics delivered straight to your inbox.

    By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
    Share this Lyric
    Facebook Twitter Email
    Share
    By A To Z Telugu Lyrics
    Follow:
    Vocal Of Youth
    Previous Lyric Boss (2006)
    Next Lyric Gharana Bullodu (1995)
    25 Comments 25 Comments
    • Nagasiri says:
      07/16/2020 at 6:48 am

      good

      Reply

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    Facebook Fan Page👍

    A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

    Copyright © A To Z Telugu Lyrics 2019-2023. All Rights Reserved.

    • About Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms and Conditions
    • Contact Us
    A To Z Telugu Lyrics
    Join Us!

    Subscribe to our lyricsletter and never miss our latest lyrics, updates etc..

      Zero spam, Unsubscribe at any time.
      login A To Z Telugu Lyrics
      Welcome Back!

      Sign in to your account

      Lost your password?
      x
      x