Shivam (2015)

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నరేంద్ర
నటీనటులు: రామ్ పోతినేని,  రాశీఖన్నా
దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి
నిర్మాత: స్రవంతి రవికిషోర్
విడుదల తేది: 02.10.2015

కాలేజీబుల్లెమ్మో… రంగూ రంగుల రబ్బరుబొమ్మో
టీనేజీ గుండెల్నీ.. రంగులరాట్నం తిప్పొద్దమ్మో
బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
ఈ ఏజి పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
నీ హార్ట్ ని లాకర్లో భద్రంగా దాచావే
నా హార్ట్ ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
నువ్వేమో ఏసీలో గురకెట్టీ బజ్జుంటే
నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

Highway లో నేనెళ్తుంటే యూ-టర్నే కొట్టించావే
నాదారి మళ్ళించావే పిల్లా.. నీ అందం తోటి

ఆహా నువ్వే నా వైఫు,నీతో వందేళ్ళ లైఫు సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
Winter లో mango లా నోరే ఊరించావే
పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

బోల్డన్నీగిఫ్ట్లివ్వాలీ.. రీ ఛార్జులు చేయించాలీ

అడిగిందీ కొనిపెడితేనే లవ్వు పుడుతుందనుకున్నా
ఏదో నా టైం బాగుండి ఏమీ శ్రమపడకుండానే ఏంజిల్ లా దొరికేశావే నువ్వూ
I love you చెప్పేసీ who are youఅంటావే
Welcome బోర్డ్ పీకేసీ no entry పెడతావే
కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
కనికరమే లేకుండా దారం తెంచావే
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ.. నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

********   *********   ********

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హరిచరణ్ , యమ్.యమ్. మానసి

గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
అస్తమాను పెదవినట్ట కొరకామాకే
ఇస్తరాకు నడుమునిట్ట తిప్పామాకే
తామరాకులాంటి వయసు చూపామాకే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
గళ్ళలుంగి పైకి ఎత్తికట్టామాకూ
కళ్ళజోడు దించి కన్ను కొట్టామాకూ
కందిరీగ లాంటి చూపు చుట్టామాకూ
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
నీ సిగ్గుల్తోటి సూరేకారం దంచామాకే
నీ మాటల్తోటి ఉప్పూకారం జల్లామాకే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె..ఒళ్ళు కాగిపోతాందే

చక్కెర ఎందుకే.. పెదవులు ఉండగా
అత్తరు ఎందుకే.. నీ సొగసే ఉండగా
దుప్పటి ఎందుకూ.. కౌగిలి ఉండగా
తలగడ.. దండగ.. ఒడిదుడుకుండగా
కేజీ నువు ముస్తాబయ్యీ.. అరకేజీ అప్పుగ ఇస్తే
రోజూ రుచిమరిగీ మరిగీ.. ప్రతి రోజూ ఇమ్మని గోలెడితే

గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే

తక్కెడ ఎందుకే.. తైతక్కుండగా
కత్తెర ఎందుకే.. నీ చూపే ఉండగా
దుద్దులు ఎందుకూ.. ముద్దులు వుండగా
గుటకలు దండగా.. కితకితలుండగా
బేబీ నీ బుగ్గలు పిండీ.. జిలేబీ వేస్తావుంటే
బాబోయ్ నీ చేతులు పడీ.. అయ్ బాబోయ్ చుక్కలు చూపెడితే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే
గుండె ఆగిపోతాందె.. ఒళ్ళు కాగిపోతాందే

*******   *******   *******

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సాగర్ , హరిప్రియ

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం
అందమైన భావం.. అందులో నువు మొదటి అక్షరం
అందుకేగ నీతో ..సాగుతోంది చిన్ని పాదం
ఓ చెలీ అనార్కలీ.. నీ నవ్వులే దీపావళీ
పేరుకే నేనున్నదీ.. నా ఊపిరే నువ్వేమరీ
చందమామనెవ్వరైన పట్టపగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now

ఓర చూపుకి లొంగిపోవడం
దొరా నవ్వుకే పొంగిపోవడం
ప్రేమలోనే నేర్చుకున్నా రాతిరంతా మేలుకోవడం
నిన్ను నాలో దాచుకోవడం.. నన్ను నీలో చూసుకోవడం
నమ్మలేక నన్నునేనే అప్పుడప్పుడు గిల్లుకోవడం
ఓ చెలీ అనార్కలీ.. బాగున్నదీ హడావిడీ
నేనిలా వినాలనే.. ఇన్నాళ్లనుంచి కలలుకన్నదీ

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం

పూటపూటకొ పండగవ్వడం.. మాటిమాటికి నవ్వుకోవడం
ప్రేమలోన తేలుతుంటే కష్టమేలే తట్టుకోవడం
దిండునేమో హత్తుకోవడం.. జుట్టురింగులు తిప్పుకోవడం
ప్రేమపిచ్చే రేగుతుంటే తప్పదేమో దారితప్పడం
ఓ చెలీ అనార్కలీ.. తమాషగుందిలే ఇదీ
అందుకే సరాసరీ.. మనస్సు ఇచ్చిపుచ్చుకున్నదీ

అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం
అందుకేగ నిన్నే ..కోరుకుంది చిన్ని ప్రాణం

Hey girl hey girl wanna say something
Will you listen to me now
Hey boy hey boy a wanna be a thing
Tell me all that you wanna say now

*******   *******   *******

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యాజిన్ నజీర్, సమీరా

సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…
సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…

నా కోసం జీరోసైజే నువు మెంటైన్ చెయ్యక్కర్లేదు…
నా కోసం మేకప్ లిప్ స్టిక్ వెయ్యక్కర్లేదు…
నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోళ్ళేం కొరకక్కర్లేదు…
నా కోసం ఓ కిస్సే నువు ఇవ్వక్కర్లేదూ…
నా కోసం నీ హెయిర్ స్టైలు… నా కోసం డ్రస్సింగ్ స్టైలు…
నా కోసం నీ లైఫ్ స్టైలు… ఏది మార్చక్కర్లేదు…
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదూ…
ఎందుకంటే….
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…
సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…

సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…

తిడతావా తిట్టు… కొడతావా కొట్టూ…
పడతాగా నేను… నీ కోపం నీ ఇష్టం…
వెధవేషాలెయ్యి… ఎక్సట్రాలె చెయ్యి…
వెనకేసుకొస్తా నువ్వంటె అంతిష్టం…
నా కోసం నిన్నే నువ్వు కంట్రోలే చెయ్యక్కర్లేదు…
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు…
బి కాజ్…
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…

చెప్పేది వినవు… పడతావా పడవు…
ఎట్టాగే నీతో… ఇంకెన్నాళ్ళీ తగువు…
బుద్దున్నొడెవడు ఇన్నాఫర్లివడూ…
ఒప్పేసుకోవే ఐ పోతా నీ మొగుడూ…
నా కోసం అంతందంగా అటుతిరిగేం నవ్వక్కర్లేదు…
నా కోసం నువు ఐ లవ్వూ చెప్పక్కర్లేదు…
క్యూ…
క్యూం కి…
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…
ఐ లవ్వూ టూ… ఐ లవ్వూ టూ…
సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…
సనిగససనిగససనిగససనిప…
పమనిపపమనిగగమనిప…

*******   *******   *******

చిత్రం: శివమ్ (2015)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్

నేనే గానీ ఫ్రెండై ఉంటే దేవదాసై పుట్టేవాడా
మందుకొట్టేవాడా? కుక్కని పెంచేవాడా? అట్టా పోయేవాడా?
నేనే గానీ ఫ్రెండై ఉంటే మజ్ను పిచ్చోడయ్యేవాడా? సోలోగా తిరిగేవాడా? శోకంలో మునిగేవాడా? లైఫంతా ఏడ్చేవాడా?
ఓ.. వయసొస్తే ప్రేమించాలి..
ఓ ..ప్రేమిస్తే ఎదురెళ్ళాలి
ఓ..ఎదురెళ్ళి సాధించాలి
భయపడ్డం అంటే చావేరా

శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

చరణం: 1
నాకే గానీ ఫ్రెండ్సై వుంటే రోమియో జూలియట్టు
పెళ్ళైపోయి పాడేవాళ్ళు లవ్ డ్యూయెట్టూ..
డైలీ పార్కుల చుట్టూ
నాకే గానీ ఫ్రెండ్సై ఉంటే సలీం అనార్కలీ
జంటైపోయి గెంతే వాళ్ళు గల్లీ గల్లీ..
ఊటీ హనీమూన్ కెళ్ళీ

ఓ.. – ఆరోజుల్లో గనకా..
ఓ..  – నేనే పుట్టుంటే
ఓ..  – ప్రేమల్నే గెలిపించేసీ..
ఓ.. happy ending చేసుంటా

శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

చరణం: 2
నాకే గానీ నచ్చినపిల్లా దొరికేసిందంటే
మాయల్ చేసో మంత్రం వేసో లైన్లో పెడతా..
Heart ని హైజాక్ చేస్తా
నేనూ నచ్చీ ఏదోరోజూ love you అందంటే
టన్నులకొద్దీ హేపీనెస్సుని తనకిచ్చేస్తా
స్వర్గం కిందకితెస్తా
ఓ.. – మా ప్రేమకడ్డం పడితే ..
ఓ.. – వాడెంతటోడైనా
ఓ… – గుండెల్లో నిద్దరపోయీ..
ఓ…నరకం చూపించేస్తాగా

శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం

Your email address will not be published. Required fields are marked *

Previous
Ready (2008)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Subha Sankalpam (1995)
error: Content is protected !!