చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర
నటీనటులు: రవితేజ, జ్యోతిక, టబు
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 09.02.2006
మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం
ప్రణయం మధురం కలహం మధురం
క్షణమొ సగమొ విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
అందం అందం అని ఊరించె అందాలన్నీ అసలే మధురం
శ్రవణం మధురం నయనం మధురం
కులుకె మధురం కురులె మధురం
గమనం మధురం జఠనం మధురం
లయలో సాగే పయనం మధురం
గమనం మధురం జఠనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే వుంటె అదిరె మధురం
చెదిరే జుట్టు చమటె మధురం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం
అన్ని మధురం అఖిలం మధురం
ఆమె మధురం ప్రేమే మధురం
కనులె మధురం కలలె మధురం
కొంచెం పెరిగె కొలతె మధురం
కనులె మధురం కలలె మధురం
కొంచెం పెరిగె కొలతె మధురం
మనసె మధురం సొగసె మధురం
విరిసె పెదవుల వరసె మధురం
ఉదయం దాచె మధురిమ గారి ఉదరం మధురం హృదయం మధురం
తాపం మధురం శోకం మధురం
అలకె చిలికె కోపం మధురం
అలుపే మధురం సులుపే మధురం
అతిగ మరిగే పులుపె మధురం
అలుపే మధురం సులుపే మధురం
అతిగ మరిగే పులుపె మధురం
అధరం మధురం ఎదనం మధురం
పెరిగి చిరిగి తిలకం మధురం
బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
బాలా మధురం… మధురం మధురం
డోలా మధురం… మధురం మధురం
లీలా మధురం హేలా మధురం
జోజో మధురం… మధురం
జోలా మధురం… మధురం
మనువాటకిదే ఫలితం మధురం
మధురం మధురం ప్రణయం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్ని మధురం అఖిలం మధురం మనమే మధురం ప్రేమే మధురం
********* ******** *********
చిత్రం: షాక్ (2006)
సంగీతం: అజయ్-అతుల్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బి.చరణ్ , కౌశల్య
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
ముద్దుతో పాపిటలోనే దిద్దవా కస్తూరి
ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరి
చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి
రూపమె దీపంగ రాతిరె పగలవనీ
లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవ్రి నైట్ అండ్ ఎవ్రి డె, దట్ మేక్స్ యు స్వింగ్ అండ్ మేక్స్ యు స్వింగ్
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి
చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి
తారకాపురమల్లే కాపురం వెలగాలి
నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి
వెన్ యు ఆర్ ఇన్ లవ్, యు జస్ట్ డోంట్ నొ వాట్ యు సె,
జస్ట్ లువ్ విల్ టేక్ యువర్ బ్రెత్ అవె
నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అణువణువణువున
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన
మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
మనసే సుమమై విరిసెను నా సిగలోన
మమతె ముడులై మెరిసెను నా మెడలోన