Shri Kanakamalaxmi Recording Dance Troupe (1988)

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ
నటీనటులు: నరేష్ , మాధురి
దర్శకత్వం: వంశీ
నిర్మాతలు: పి.రమేష్ రెడ్డి, పి. విజయకుమార్ రెడ్డి
విడుదల తేది: 1988

కలలా కరగాలా గతమై తపించాలా
నిశిగా నీలిమనై నిన్నే జపించాలా
వెలుగుల కోసం వెతుకుతు వున్నా సీతాశ్రమ వాసిని
కలలే కన్నీటి అలలై స్రవించాలా

వినా వాయు పుత్రం  ననాద ననాదః
సదా రామ దూతం స్మరామి స్మరామి
విభూ మారుతేత్వం ప్రసీద ప్రసీద
ప్రియం ఆంజనేయం ప్రయచ్చ ప్రయచ్చ

పురివిప్పి అధరం విరబూసి నయనం పిలిచాయి కాంక్షతో
ధారాల మైన మన ప్రేమ కథని పాడాయి వాంఛతో
శాసించు రాణి పాలించు రాజ్యం స్వప్నాల స్పర్శతో
ఊహా వసంతంలో స్వగతం ఎన్నాళ్ళు
రాలిన కలనే పాడుతు బతికే వేదనకే వేదికని నేనై

కలలే కన్నీటి అలలై స్రవించాలా
గతమే నిజమయ్యే ఆశా నిశాంతంలో

కల్లోల హృదిలో శోకాల రధమై సాగించు యాత్రని
జలతారు కలలా జాగరణ చేసే నిట్టూర్పు నీడని
నాలోన నేనే ఎన్నాళ్ళు దాచను శివరాత్రి శోభని
రేపే నాకోసం చూపే సారించు
సౌదామినిలా శివకామినిలా
వస్తాను ఉదయంలో వెన్నెలై

హృదయం పాడింది గంగా తరంగంలా
అధరం ప్రభాతంలా నయనం ప్రకాశంలా
కోమలమైన శ్యామలమైన ప్రేమాశ్రమ వాసిలా…

********   ********   ********

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు
ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు
జింక పిల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు
చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు
బుగ్గ పైన కొన గోట మీటి నా సిగ్గు దొంతరలు దోచేవు

నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే

*********   *********   *********

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

మల్లిక  – పొగడకు
గీతిక – పాడకు
కోరిక – తాకకు
కోపమా కారణం తెలుసులే
నేరమే చేసిన దోషిని
పెదవుల పొదలో శిక్షను వెయ్యి
కౌగిలి ఉరితో ప్రాణం తియ్యి
వెళ్లిక  – కారణం
చెప్పను – ఎందుకు
చంపకు – దేనికి
వేషమే వెయ్యడం నీ తరం
మోసమే చెయ్యడం నీ పరం
నిజము కలలా నువ్వు నేను
అతకదు మనకు పండగ బ్రతుకు

మల్లిక  – పొగడకు
గీతిక – పాడకు
కోరిక – తాకకు

ఇచ్చిన మాటకి నిలవడం తెలియదా
జరిగన కధలనే దాయడం కుదరదా
గుండెలో గాధనే పూలపై రుద్దనా
పెదవిపై బాధనే దానిపై అద్దనా
గుండె మువ్వ గాధ మోవికెంపు బాధ
పొద్దు నవ్వులాగ విచ్చుకునే దారి
ఏదని ఎవరిని అడగాలి ఈవేళ
నేరమే చెయ్యనే శాపం పెట్టొద్దు

నిన్ననే పూసిన ప్రమిదలో పువ్వుని
నవ్వులో మువ్వని మురిసిన మెరుపుని
పెదవితో ముద్దుల ముగ్గులే వెయ్యకు
హంగుల రంగుల వలలతో ముయ్యకు
తప్పు ఒప్పుకుంటూ శిక్ష వేయమన్నా
నవ్వు రాని శిలకి….సుఖము లేదు
కదలదు కరగదు రాతి సంతానం
మనిషితో బంధమే కెరటాలతో స్నేహం

*********   ********   *********

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

వెన్నెలై  – పాడనా
నవ్వులే – పూయనా
మల్లెలే – పొదగనా
పూవులో నవ్వులో మువ్వలా
ఒంపులో సొంపులో కెంపులా
కలకల పొదలో కిలకిల కధనం
ముసిముసి రొదలో అలసట మధురం

పొద్దులో  – మీటనా
ముద్దులే – నాటనా
హద్దులే  – దాటనా
ఇవ్వనా యవ్వనం పువ్వునై
గువ్వనై గవ్వనై నవ్వనా
లలనామణినై కలలో మణినై
నవలామణినై చింతామణినై

వెన్నెలై  – పాడనా
నవ్వులే – పూయనా
మల్లెలే – పొదగనా

లీలగా తూగుతూ ఏమిటో దేహమే
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడినా కోరుతూ పాడిన
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
 వెలుతురు నేత్రమే సోకని ప్రాంగణము
గాలికే ఊపిరి పూసే పరిమళము

చందనం పూయనా పూలలో రాజుకి
నోచిన నోముకే పూచిన రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి
జాలిగా గాలిలో వీచిన మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కళలు రాసే కధలు పురము వాసి
బ్రతుకున పలికిన కిలకల కూజితము
మధురమై మొలవనీ ఉలి శిల ఖేలనము

పొద్దులో  – మీటనా
ముద్దులే – నాటనా
హద్దులే  – దాటనా

*********   **********   ***********

చిత్రం: శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని

ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుచల ఆమనిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన
రాగసుధ పారే అలల శృతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలము కలగానమై
నిలవాలి మన కోసము ఈ మమత

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మదుప గానం
ఏ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం
పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నది ఈ పూటనే
చేరింది మన జంటకు ముచ్చటగ

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Adavi Simhalu (1983)
error: Content is protected !!