Simha (2010)

Simha Lyrics

బంగారు కొండ… లిరిక్స్

చిత్రం: సింహా (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గాత్రం: హరిహరన్, కౌసల్య
నటీనటులు: బాలక్రిష్ణ , నయనతార, స్నేహా ఉల్లాల్
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 30.04.2010

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడ
నీ అడుగు జాడ అది నాకు మేడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

ఈ మహారాజు చిరునవ్వునే
నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపునే
నా ధన దాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం
ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వై నావే గాయత్రి మంత్రం
పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

నీ మీసాల గిలిగింతకే
ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే
ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సోగసాభిషేకం
నిముషం నిముషం చేయించనా
నీతో తనువు మనసు మమేకం
మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ
కలియుగపు భగవంతుడా

బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా

*********   **********   ********

జానకీ జానకీ… లిరిక్స్

చిత్రం: సింహ (2010)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గాత్రం: కునాల్ గంజ్ వాల, టీనా

జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?
ఎహ్ వచ్చెయ్ వచ్చెయ్ గట్టు చాటుకి
చమటెక్కిస్తా తెల్ల చీరకి
సర్లే అంటె ఒక్క పుటకి కావలంట మాటి మాటికీ
అరేయ్ అందాలే దాచోద్దె హైసలకడి దాటికి

జానకీ… జానకీ…
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

సోయగాల సంపదే హైలైటు
ఎలా పెంచినావొ చెప్పవె సెక్రేటు
కౌగిలింత ఒక్కటె టాబ్లెట్
నిన్ను పట్టుకున్న ఫీవరే హంఫట్టూ
వరెవా నువ్వు ఇంత తేరగా ఇస్తుంటే
తిమ్మిరే తిర్చేసుకొనా
ఇస్ లా మన్నిస్త నిస్ గా లాగిస్తే
వయసునే వడ్డించుకోనా
ఎ బరిలొ నాదేలే గెలుపు
హే త్వరగ ముసేయి తలుపు
చలో నా రాణి నువ్వే లే మల్లెపుల్ల కొటకీ

జానకీ…జానకీ…
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ?

లిప్పు తోటి లిప్పుకే లింకెట్టు
ఇక మొగుతాయ్ యవ్వనాల ట్రంపెట్టు
మాయదారి సిగ్గులే కప్పెట్టు
జరా ఒంటిలోన ఎక్కడో తీపెట్టు
జోరుగా నే పైట జారగా ఈ పుటా
జాతరే నా గుండెలోనా
ఎహ్ ఆగలేనంటుంటే ఆపుగా చూస్తుంటే
ఆకలే తీర్చేసిపోనా
హేయ్ అదిరే నీ ఒంటి మెరుపు
ఆ పరువాలే పట్టు పరుపు
మరి లేటైతే బాగోదే లేటు నైటు ఆటకి

జానకీ…జానకీ…
come on Baby…come on…
జానకీ జానకీ జానకీ ఎక్కడికి పోతావే జానకీ
దేనికీ దేనికీ దేనికీ వెనకేనేకే పడతావు దేనికీ??
దేనికీ??