Simham Navvindi (1983)

చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, బాలక్రిష్ణ , కళారంజని, శ్రీదేవి
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 03.03.1983

ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
పిట్ట సింగారం కింద వయ్యారం
సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే
ముట్ట పొగరు పిల్లగాడా
నాకు ముక్కు పచ్చలారనీర
అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా

ముంజలాంటి చిన్నదానా
అరె ముట్ట పొగరు పిల్లగాడా

తళుకు తాంబులమిచ్చి తాళి ఏదన్న రోజు
వస్తుందని లగ్గమొస్తుందని
ఎదురెంతో చూశానమ్మో అరె నిదరంతా కాశనమ్మో
కులుకు పేరంటమాడి తలుపు మూసేటి రోజు
వస్తుందని ముద్దులిస్తుందని
కలలెన్నో కన్నానమ్మో కథలెన్నో విన్నానమ్మో
జాజి పూల జల్లులోన
జాజి పూల జల్లులోన తడవాలని
కన్నుకొట్టాడే కమ్ముకొచ్చాడే
గాలిముద్దులెన్నొ పెట్టి గిల్లుకున్నాడే

ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా
అరె ముంజలాంటి చిన్నదానా
అరె ముట్ట పొగరు పిల్లగాడా

వయసే తొలినోము నోచి వలపే నీదన్న రోజు
వస్తుందని కౌగిలిస్తుందని
ఉసురొచ్చి వేసానమ్మ ఎదురెండ కాగనమ్మో
సొగసే సొగసారబోసి సగమే నీదన్న రోజు
ఇస్తుందని కట్నమిస్తుందని
సొదలెన్నో పడ్డానమ్మో బ్రతుకంతా వడ్డానమ్మో
మాపటేల మల్లెపూల
మాపటేల మల్లెపూల తావిళ్ళతో
నల్లమబ్బుల్లో పిల్ల జాబిల్లి
వెన్నెలంటు సన్నముద్దు పెట్టి పోయిందే

ముట్ట పొగరు పిల్లగాడా
నాకు ముక్కు పచ్చలారనీర
అహ కొత్త ఆరాటం కొంగు కోలాటం
రెప్పదాటి రెచ్చగొట్టు చూపు కొచ్చిందా
అరె ముంజలాంటి చిన్నదానా
లేత ముద్దులన్ని దోచుకోనా
పిట్ట సింగారం కింద వయ్యారం
సిగ్గుపూల మొగ్గలేసి కాపుకొచ్చిందే
ముట్ట పొగరు పిల్లగాడా
అరె ముంజలాంటి చిన్నదానా

error: Content is protected !!