Simharasi (2001)

చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత
నటీనటులు: రాజశేఖర్, సాక్షి శివనంద్
దర్శకత్వం: వి.సముద్ర
నిర్మాత: ఆర్. బి. చౌదరి
విడుదల తేది: 06.07.2001

రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని
రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని హాఁ…
రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కోరస్: అరె రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
కోరస్: అరె కమ్మంగా కానీరా
కండలు తిరిగిన మామ కోరివచ్చాను కాదందువా
పూజలు చేసే మామ కొంగు పూజను చేయించవా
పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండ నీ దమ్ము చూపెట్టూ
రాణి రాణి రాణి ఏయ్… రంగసాని రాణి హాఁ…
కాని కాని కాని హాఁ… రాసలీలలన్ని
ఆఁ రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా

ఎంతకాలం ఒంటరి గుంటావు జంటగ నన్నుంచుకో
అంతులేని తుంటరి ఆశలు వెంటనే తీర్చేసుకో
ఎయ్ మాటలన్ని చాలించి కాస్త పైటింక సరిచేసుకో
వెంటపడి వేదించకింక నీ దారి నువు చూసుకో
ఆడ జాతిలోనే నేనందమైన దాన్ని మొగలిపూల పొదలో వయసొచ్చి ఉన్నదాన్ని
ఉఁ అంటే సరదాగా ఉందామయ్యా ఆ మూడు స్వర్గాలు చూద్దామయ్యా
నే తలుచుకుంటే సాగదు నీ బ్రహ్మాచర్యము
పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ
రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా

సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా
స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లార్లు అందించనా
మేను చూపి మంచుకొండను కరిగించలేవమ్మడూ
అందమంత ఆరబోసినా లొంగడు హనుమంతుడు
ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చా
నులక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా
వంపులతో వజ్రాన్ని కొయ్ లేవమ్మా వలవేస్తే సూరీడు పడబోడమ్మా
నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా
పట్టే పట్టూ హే పట్టే పట్టూ ఏ కోడి కూసిన ఆపకుండా నీ దమ్ము చూపెట్టూ
హే రాణి రాణి రాణి రంగసాని రాణి రమ్మంటే రావేరా
కోరస్: అరె రమ్మంటే రావేరా
కాని కాని కాని రాసలీలలన్ని కమ్మంగా కానీరా
కోరస్: అరె కమ్మంగా కానీరా
పస్తైన ఉంటుంది గానీ గడ్డి మేయదు ఏ సింహాము ఆహా…
ప్రాణాలు ఇస్తాడు గానీ తప్పు చేయడు నరసింహాము ఏయ్…
అరె పట్టుకోవద్దు నను ముట్టుకోవద్దు
మీ ఆడజాతికే అవమానమే తెచ్చే తప్పు చేయొద్దు హూఁ…
రాణి రాణి రాణి రా… రంగసాని రాణి రా…
కాని కాని కాని ఏయ్… రాసలీలలన్ని హాఁ…
రాణి రాణి రాణి రంగసాని రాణి కాని కాని కాని రాసలీలలన్ని

*********  *********  ********

చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: విజయ్ కుమార్
గానం: యస్.జానకి

అమ్మా అని పిలిచి పిలిచి గుండె కోయకురా
ఆకలని ఏడ్చి ఏడ్చి ఏడిపించకురా
గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయ్యింది రా
చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా

*********  *********  ********

చిత్రం: సింహరాశి (2001)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: వి.రాంబాబు
గానం: హరిహరన్, చిత్ర

తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి
మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి
మమతలే పండాలి మనసులే నిండాలి
దైవం పలకాలి దీవెనలివ్వాలి

ప్రేమపైన నమ్మకాన్ని
పెంచుకున్న చిన్నదాన్ని
ప్రేమతోనే జీవితాన్ని
పంచుకుంటూ ఉన్నవాణ్ని

చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన

తెలుసా నేస్తమా నేస్తమా
ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

ఎదురుగా రారాజు కదలగా ఈరోజు
పరువం పులకించి పరుగులు తీసింది
ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది
పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది

నింగి విడిచి గంగలాగ
నిన్ను చేరుకున్నదాన్ని
కొంగులోనే దాచుకోవే
పొంగుతున్న సాగరాన్ని

ఆడపిల్ల మనసు తెలిసిన తోడు నీడ నీవే

తెలుసా నేస్తమా నేస్తమా
ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ

మదిలో మౌనరాగమే
మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Paadi Pantalu (1976)
error: Content is protected !!