చిత్రం: సింహాసనం (1986)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారాం, పి.సుశీల
నటీనటులు: కృష్ణ ఘట్టమనేని, జయప్రద, రాధ
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: కృష్ణ ఘట్టమనేని
విడుదల తేది: 21.03.1986
జుం తన జుం జుం తన జుం జుం తన జుం జుం తన జుం
హే హేహేహేహే ఆ హాహాహా లా లాలాలలా లా ఆఆఆ
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే…
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
జుం తన జుం జుం తన జుం జుం తన జుం జుం తన జుం
అనురాగం అందంలా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే నీ ముద్దు ముంగిళ్లలోన
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
అనురాగం అందంలా మెరిసింది నీ కళ్ళలోన
అందుకో నా లేత వలపే నీ ముద్దు ముంగిళ్లలోన
కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం
కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం
హోయ్ నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
ఓ హోహోహో, లా లాలలా, ఆ హాహాహా, ఓ హోహోహో
ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం
నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు
వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
జుం తన జుం జుం తన జుం జుం తన జుం జుం తన జుం
కాలంతో ఈ బంధం ఈడల్లే మెచ్చింది నన్ను
అల్లుకోన నీతోడై నీ లేత కౌగిళ్లలోన
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
కాలంతో ఈ బంధం ఈడల్లే మెచ్చింది నన్ను
అల్లుకోన నీతోడై నీ లేత కౌగిళ్లలోన
నీవే నా రాచ పదవి నీవే నా ప్రణయ రాణివి
నీవే నా రాచ పదవి నీవే నా ప్రణయ రాణివి
నీవు నేను కలవకపోతే ప్రేమన్నదే లేదులే…
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేల
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ
తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే…
జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
లాలాలా… లాలలలా… లాలాలా… లాలలలా…
లాలాలా… లాలలలా… లాలాలా… లాలలలా…
********** ********** **********
చిత్రం : సింహాసనం (1986)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం: రాజ్ సీతారామ్, పి.సుశీల
పల్లవి:
కైపెక్కిపోయే కళ్ళు… కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..
కైపెక్కిపోయే కళ్ళు… కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..
ఆ.. నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
వస్తాలే.. ఇస్తాలే.. వయసంతా… ఆ..
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
హా… ముద్దులిమ్మా
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
అహా… ముద్దులిమ్మా
చరణం: 1
బుగ్గే ఇస్తా… లాలలూ..
ముద్దే ఇస్తా… లాలలూ
నెనే వస్తా… లాలలూ
నన్నే ఇస్తా… లాలలూ
ఇటు తొలి ఈడు… అటు చలిగాడు…
నా శృతి చూడు… నా జత కూడు…
మత్తెక్కి రాగాలు పాడు…
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
అహా… ముద్దులిమ్మా
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
అహా… ముద్దులిమ్మా
చరణం: 2
పక్కకు వస్తా… లాలలూ
రాతిరి దాకా… లాలలూ
మాపటికొస్తే… లాలలూ
రేపటి దాకా… లాలలూ
ఈ పరదాలు… చేయ్ సరదాలు…
ఇక తాగేసేయ్ నా అందాలు… ఈ రేయికీ హాయి చాలు…
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
అహా… ముద్దులిమ్మా
కైపెక్కిపోయే కళ్ళు… కౌవింత పెట్టే ఒళ్ళు
కౌగిళ్ళకొస్తే చాలు.. రా.. రా. రా..
ఆ.. నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
నీ చూపే కాటేస్తోంటే.. నీ ఊపే వాటెస్తోంటే
వస్తాలే.. ఇస్తాలే.. వయసంతా… ఆ..
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
హా… ముద్దులిమ్మా.. హా..
గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మా.. గుమ్మా.. ముద్దు గుమ్మా…
అహా… ముద్దులిమ్మా.. గుమ్మా గుమ్మా…
******** ******** ********
చిత్రం: సింహాసనం (1986)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: వేటూరి
గానం : రాజ్ సీతారామ్, పి.సుశీల
పల్లవి:
వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి… ఇచ్చుకో
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి… ఉంచుకో
ఈ నిండు యవ్వనాల కౌగిలింతలో…
సాగనీ సంగమం… తియ్యగా… హాయిగా…ఆ.. ఆ.. ఆ..
తకతుతకతై.. తకతై…
తకతుతకతై.. తకతై…
వయసే విరిసే రాతిరి… వయసే విరిసే రాతిరి
చరణం: 1
పెదవుల పొంగిన అమృతం… దాహం తీర్చే వేళా
ఝుమ్మని పొంగిన పరువం… రమ్మని పిలిచే వేళా
ఆ.. పెదవుల పొంగిన అమృతం… దాహం తీర్చే వేళా
ఝుమ్మని పొంగిన పరువం… రమ్మని పిలిచే వేళా
సాగనీ సంగమం… మత్తుమత్తుగా… మెత్తగా…
ఆ.. తకతుతకతై.. తకతై…
తకతుతకతై.. తకతై…
వయసే విరిసే రాతిరి… వయసే విరిసే రాతిరి
చరణం: 2
ఓ.. రాతిరికుండదు ఉదయం ఎదలో దాగిన వేళా..హా
తారలకుండదు గ్రహణం… తనువులు కలిసిన వేళా..ఆ..
రాతిరికుండదు ఉదయం ఎదలో దాగిన వేళా..హా
హ.. హ.. హ.. హ..
తారలకుండదు గ్రహణం… తనువులు కలిసిన వేళా..ఆ..
సగనీ సంగమం… రాసలీలలో… తేలగా.. హా..
తకతుతకతై.. తకతై…
తకతుతకతై.. తకతై…
వయసే విరిసే రాతిరి… వయసే విరిసే రాతిరి
వయ్యారమంతా కోరే ఒక్క కౌగిలి… ఇచ్చుకో
నా ముద్దు ముద్దర్లడిగే కన్నె జాబిలి… ఉంచుకో
ఈ నిండు యవ్వనాల కౌగిలింతలో…
సాగనీ సంగమం… తియ్యగా… హాయిగా…ఆ.. ఆ.. ఆ..
తకతుతకతై.. తకతై…
తకతుతకతై.. తకతై…
వయసే విరిసే రాతిరి… వయసే విరిసే రాతిరి
హహహహ..హహహహహహహా…
హహహహ..హహహహహహహా…
******* ******* *********
చిత్రం: సింహాసనం (1986)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: వేటూరి
గానం : రాజ్ సీతారామ్, పి.సుశీల
పల్లవి:
ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఇది ఎక్కడి సుందర రూపం
ఇది ఏదో మన్మధ బాణం
తొలి చూపుల వలలో పడితే… ఏ…
చెలరేగెను వలపుల తాపం
వహవా…వహవా…
అరె వహవా నీ యవ్వనం… వహవా నీ జవ్వవనం
బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
వహవా నీ రాజసం… వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
అరె ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
చరణం: 1
చూడగానే అంటుకుంది నాకు యవ్వనం… వహవా
చూడకుండ ఉండలేను నిన్ను ఏ దినం… వహవా
కనివిని ఎరుగని రాగబంధనం… వహవా
కౌగిలించి చేసుకుంట ప్రేమవందనం.. వహవా
నీ కళ్ళలల్లో నీలాకాశం మెరిసింది నా కోసం…
ధింతాన ధింతాన వహవా…ధింతాన ధింతాన..ఆ..ఆ..
అరె ధింతాన ధింతాన వహవా…ధింతాన ధింతాన..ఆ..
చరణం: 2
సాహస వీరా… సింహ కిశోరా… వహవా
సరసుడవేరా సరసకు రారా… వహవా
మాపటి చిలక మన్మధ మొలక… వహవా
ఒంగుతున్న వన్నెలన్ని తొంగి చూడనా… వహవా
నీ చూపులతో విసిరిన బాణం… చేసేను మది గాయం
హా.. ధింతాన ధింతాన వహవా… ధింతాన దింతాన
అరె ధింతాన ధింతాన వహవా… ధింతాన దింతాన
వహవా నీ యవ్వనం… వహవా నీ జవ్వనం
బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు
ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
వహవా నీ రాజసం… వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి చేసాడు ఆ దేవుడు
హా ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
అరె ధింతాన ధింతాన వహవా… ధింతాన ధింతాన
******** ********* ********
చిత్రం: సింహాసనం (1986)
సంగీతం: బప్పిలహరి
సాహిత్యం: వేటూరి
గానం : రాజ్ సీతారామ్, పి.సుశీల
పల్లవి:
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
చరణం: 1
నీ ఊహల ఊయలలోన.. ఉర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోన.. సిరిమువ్వై నిలిచిపోనా
నీ ఊహల ఊయలలోన.. ఉర్వశినై ఊగిపోనా
నీ అడుగుల సవ్వడిలోన.. సిరిమువ్వై నిలిచిపోనా
లాలాలాలా.. లాలలలా
నీ కంటిపాపలోన.. నా నీడ చూసుకోనా
నీ నీడ కలువలలోన.. నూరేళ్ళు ఉండిపోనా
ఇది కలయని నేననుకోనా.. కలనైనా ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని.. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..
చరణం: 2
నీ జీవన గమనంలోన.. జానకినై నడచిరానా
నీ మయూరి నడకలలోన.. లయ నేనై కలసిపోనా..ఆ..
నీ జీవన గమనంలోన.. జానకినై నడచిరానా
నీ మయూరి నడకలలోన.. లయ నేనై కలసిపోనా
లాలాలాలా.. లాలలలా
నీ సిగ్గుల బుగ్గలలోన.. ఆ కెంపులు నే దోచుకోనా
నను దోచిన నీ దొరతనము.. నాలోనే దాచుకోనా
ఇది కలయని నేననుకోనా.. కలనైన ఇది నిజమౌనా
కనులెదుటే నిలిచిన స్వర్గాన్ని .. కలదో లేదో అనుకోనా
లాలాలాలా లలలలల లాలలలా
లాలలా.. లలాలలా..