చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: జయప్రద, చంద్రమోహన్
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 1976
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిది పూచిన కొమ్మ(2)
పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
చరణం: 1
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక (2)
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో(2)
నిదురించే పెదవిలో పదముంది పాడుకో
చరణం: 2
ఆ రాణి పాదాల పారాణి జిలుగులు
నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో(2)
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో(2)
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను
******** ********* ********
చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
ఝణణ ఝణ నాదంలో ఝళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది
గజ్జ ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది(2)
గుండె ఝల్లుటుంటే కవిత వెల్లువవుతుంది(2)
చరణం: 1
అమరావతి శిల్పంలో అందమైన కలలున్నాయి
అవి నీలో మిలమిల మెరిసే అర కన్నుల కలలైనాయి(2)
నాగార్జున కొండ కొనలో నాట్యరాణి కృష్ణవేణి(2)
నీ విరుపుల మెరుపులలో నీ పదాల పారాణి
చరణం: 2
తుంగబధ్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది
అంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది(2)
అచ్చ తెలుగు నుడికారంలా మచ్చ లేని మమకారంలా(2)
వచ్చినది కవితా గానం నీవిచ్చిన ఆరవ ప్రాణం
********* ********* *********
చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల(2)
చరణం: 1
ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా(2)
చలిత లలిత పద కలిత కవితలెద
సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరిసిరిమువ్వలు పులకించగా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
చరణం: 2
నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి(2)
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే ఒంగె నీకోసం
మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది నాదం
********** ********** *********
చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది(2)
అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మా(2)
నిజమేమో తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరెను మన ఊరి వైపు అది పదిమందికామాట తెలుపు
చరణం: 1
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎదలో ఏదో మాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే
చరణం: 2
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టు మీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే (2)
ఏటి వార లంకలోన ఏటవాలు డొంకలోన(2)
వల్లంకి పిట్ట పల్లకిలోన సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే
గోదారల్లే…
********** ********** *********
చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
కలడందురు దీనుల ఎడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్నిదిశలను
కలడు కలండనెడివాడు కలడో లేడో
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా(2)
రామహరే శ్రీరామహరే రామహరే శ్రీరామహరే(2)
రాతిబొమ్మకు రవ్వలు పొదిగి రామహరే శ్రీరామహరే(2)
అని పట్టిన హారతి చూస్తూ ఏమీ పట్టనట్టు కూర్చుంటే చాలదు
చరణం: 1
అలనాటి ఆ సీత ఈనాటి దేవత
శతకోటి సీతల కలబోత ఈ దేవత
రామచంద్రుడా కదలిరా రామబాణమే వదలరా
ఈ ఘోరకలిని మాపరా
ఈ క్రూరబలిని ఆపరా(రా రా)
చరణం: 2
నటరాజా శతసహస్ర రవితేజా
నటగాయక వైతాళిక మునిజనభోజా(2)
దీనావన భవ్యకళా దివ్య పదాంభోజా
చెరిసగమై రసజగమై చెలగిన నీ
చెలి ప్రాణము బలిపశువై
యజ్ఞ్యవాటి వెలి బూడిద అయిన క్షణము
సతీవియోగము సహించక ధుర్మతియౌ దక్షుని
మదమదంచగ ఢమ ఢమ ఢమ ఢమ
ఢమరుకధ్వనుల నమక చమక యమగమక
లయంకర సకలలోక జర్జరిత భయంకర
వికట నటస్పద విస్పులింగముల విలయతాండవము
సలిపిన నీవే శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో
********** ********** *********
చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి
స్వామి రారా
నా పాలి దిక్కు నీవేరా నీ పాదములంటి మ్రొక్కేరా
నీ దానరా రావేలరా నన్నేలరా
భరత శాస్త్ర సంభరిత పదద్వయ
చరిత నిరత సుమధుర మంగళ గళ రారా స్వామి రారా
రాగాలెన్నో పండిన గారాల నీ మెడలో అనురాగ మాలికలే వేయాలని
నీ చల్లని చరణాలు చల్లిన కిరణాలలో
రేపటి కోసం చీకటి రెప్పల తెర తీయాలని
పిలిచాను ఎదుట నిలిచాను కోరి కోరి నిన్నే వలచాను(2)
చరణం: 1
గంగ కదలి వస్తే కడలి ఎలా పొంగిందో
యమున సాగి వస్తే ఆ గంగ ఏమి పాడిందో
ఆమని వచ్చిన వేళ అవని ఎంత మురిసిందో
మోహన వేణువు తాకిన మోవి ఎలా మెరిసిందో
ఊగింది తనవు అలాగే పొంగింది మనసు నీలాగే
చరణం: 2
శృతి కలిసిందెన్నడో సిరిమువ్వల సవ్వడిలో
జత కలిసిందప్పుడే ఆ గుడిలో నీ ఒడిలో (2)
మువ్వనై పుట్టాలని అనుకున్నానొకనాడు (2)
దివ్వేనై నీ వెలుగులు రువ్వనీ ఈనాడు
పిలిచాను ఎదుట నిలిచాను
కోరి కోరి నిన్నే వలచాను
********* ********* *********
చిత్రం: సిరిసిరిమువ్వ (1976)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
అమ్మా హైమా ఊరుకొమ్మా లే అదుగో అటు చూడు ఆ స్వామివారు ఏమన్నారో తెలుసా
నేను రాయిని కాదు ఆ సాంబడు రూపంలో మీ హైమను ఆదుకుంటాను
అన్ని బాధలు తొలగించి కంటికి రెప్పలా కపడుతాను ధైర్యంగా ఉండమన్నారమ్మ ఊరుకో
ఇంతమంది ఉండి చేయలేనిపని ఆ సాంబడొక్కడు చేస్తున్నాడు
మీ పిన్ని తిరిగొచ్చినా నీకీ కష్టాలు తప్పవమ్మా
అందుకే వాడు పట్నం తీసుకెళతాను అంటే సరే అన్నాను
అంతగా అయితే మీ అత్తయ్య కాశీ నుంచి తిరిగిరాగానే మళ్ళీ మనూరోద్దువు గాని
అయ్యవారు పడవ సిద్దంగా ఉంది రండమ్మాయి గారు వెళ్లిరామ్మా
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
వాన కురిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో
వాన కురిసి కలిసేది వాగులో వాగు వంక కలిసేది నదిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో
కానీ ఆ కడలి కలిసేది ఎందులో…
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక
ఎవరికెవరు ఈ లోకంలో
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై
జోరుసెయ్ బార్సెయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకై