చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్. పి. బాలు
నటీనటులు: సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్, మీనా
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: సిహెచ్. రామకృష్ణా రెడ్డి, యన్. భాస్కర రెడ్డి, ఉజ్జురి చిన వీర్రాజు
విడుదల తేది: 20.05.1986
ఊఁ… ఊఁ…
చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె
చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె
కో: చందమామ రావె జాబిల్లి రావె
చలువ చందనములు పూయ చందమామ రావె జాజిపూల తావినీయ జాబిల్లి రావె
చలువ చందనములు పూయ చందమామ రావె జాజిపూల తావినీయ జాబిల్లి రావె
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావె
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావె
గగనపు విరితోటలోని గోగుపూలు తేవె
చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె చందమామ రావె జాబిల్లి రావె
మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధమాధవ గాధలు రంజిలు బృందావనం గోపాలుని మృదు పద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం… బృందావనం… హే… కృష్ణా ముకుందా మురారి
కృష్ణా ముకుందా మురారి జయకృష్ణా ముకుందా మురారి
జయ జయ కృష్ణా ముకుందా మురారి
చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గొగుపూలు తేవె చందమామ రావె జాబిల్లి రావె
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తేలిసాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తేలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగి దాక
ఎగసేను నింగి దాక
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగన గళమునుండి అమర గానవాహిని
గగన గళమునుండి అమర గానవాహిని
జాలువారుతోంది ఇలా అమృతవర్షిణీ అమృతవర్షిణీ అమృతవర్షిణీ
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరూ
ననుకన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలీ ఈ నేలా
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేదీ వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణ మొనరింప దరిచేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కొరేటి ఉక్కు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కొపి తిక్క శంకరుడు
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చె వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై సిరి మువ్వల సవ్వడి నీవై
నర్తించగ రావేలా
నిను నే కీర్తించే వేళ
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో
పదము కదిపితె ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలో
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు
చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన
ఆషాఢ మాసాన ఆ నీలి గగనాన మేఘాల రాగాల ఆలాపన
మేఘాల రాగాల ఆలాపన
చినుకు చినుకు చినుకు చినుకు తొలి తొలి తొలకరి చిలికిన చినుకు
పిలుపు పిలుపు పిలుపు పిలుపు పుడమికి పులకల మొలకల పిలుపు
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ
పొలిమేర దాటిపోతున్నా ఓ గువ్వల చెన్న
పొరుగూరికి చేరిపోతున్న ఓ గువ్వల చెన్న
కథమారే రోజులు కోరేరూ ఓ గువ్వల చెన్న
కలతీరే దారులు వెతికేనూ ఓ గువ్వల చెన్న
గుళ్ళో నిను చూడలేకున్న ఓ గువ్వల చెన్న
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్న
ఏ సీమలొ తిరుగాడిన ఓ గువ్వల చెన్న
నీ దీవెనలందిచాలన్న ఓ గువ్వల చెన్న
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: ప్రకాష్ రావు, పి. సుశీల
పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది
అహ పాటల్లో పాడలేనిది నోటి మాటల్లో చెప్పలేనిది
నీ గుండెల్లో నిండి ఉన్నది ఈ బండల్లో పలుకుతున్నది
ఈ ఆర్టు చూసి హార్ట్ బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నది అది ఆహా ఓహో అంటున్నది
ఈ ఇలలోన శిలపైన కొలువైన రాణి
ఈ ఇలలోన శిలపైన కొలువైన రాణి
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద
పాట వింటూ లోకమంత రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంత రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా
అందమైన సుందరాంగులు ఎందరికొ నెలవైన రాణివాసము
ఈ కొటలోన దాగి ఉన్నది నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులు ఎందరికొ నెలవైన రాణివాసము
ఈ కొటలోన దాగి ఉన్నది నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
హిస్టరీల మిస్టులోని మిస్టరీని చాటి చెప్పి
ఆహా ఓహో అంటున్నది అది అహ అహ ఒహొ ఒహొ అంటున్నది
రాసలీలా రాగహేలా రాసలీలా రాగహేలా
రసమయమై సాగు వేళ
తరుణుల తనువులు వెన్నెల తరగలుగ ఊగువేళా
నురుగుల పరుగులు సాగె యమునా నది ఆగు వేళా
నింగి నేల వాగు వంక చిత్రంగ చిత్తరువాయె
నింగి నేల వాగు వంక చిత్రంగ చిత్తరువాయె
నల్లనయ్యా పిల్లన గ్రోవినూద వెల్లువై ఎద పొంగి పోద
********* ******** ********
చిత్రం: సిరివెన్నెల (1986)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించివిపంచి గానం
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిస వేనియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
ప్రాగ్దిస వేనియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ
విశ్వకార్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హ్రుదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హ్రుదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునె
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం