చిత్రం: సీతాదేవి (1982)
సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటినటులు: చిరంజీవి , సుజాత
దర్శకత్వం: ఈరంకి శర్మ
నిర్మాత: టి.రామన్
విడుదల తేది: 1982
దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా
దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా
అన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా
అన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా
మనసు మమతల మాపేసి మమకారాన్ని చంపేసి
మనిషి నెత్తురును మనిషే తాగే
క్షుద్ర యాగమును చెయ్ మన్నాడా
మనసు మమతల మాపేసి మమకారాన్ని చంపేసి
మనిషి నెత్తురును మనిషే తాగే
క్షుద్ర యాగమును చెయ్ మన్నాడా
చచ్చేదెవడు చంపేదెవడు అంతా నేనే అన్నాడా
నరుడన్యాయం చేసిననాడు దేవుడుతోటి మొరపెడతాము
దేవుడే తప్పులు చేసిన నాడు ఎవ్వరితోటి చెబుతాము
దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా
అన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా
చక్కని ఇంటిని కడతాడా ముక్కలు చక్కలు చేస్తాడా
ఉడికే నెత్తురు చల్లని నీటితో కడిగే వాడు మేలయ్యా
చక్కని ఇంటిని కడతాడా ముక్కలు చక్కలు చేస్తాడా
ఉడికే నెత్తురు చల్లని నీటితో కడిగే వాడు మేలయ్యా
నిప్పుని నిప్పుతో చల్లార్చేది ఎప్పుడు జరగని వింతయ్య
అనురాగలు అనుబంధాలె ఆనందానికి మార్గాలు
ఆవేశాలు ఆక్రోశాలు పెరిగినప్పుడే నరకాలు
దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా
అన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా
అన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా