Sita Rama Kalyanam (1986)

చిత్రం: సీతారమకళ్యాణం (1986)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి. బాలు, పి. సుశీల
నటీనటులు: బాలక్రిష్ణ , రజిని
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: కె.మురారి
విడుదల తేది: 15.04.1986

లా.. లా… ల లా లా ల లా.. లా ల ల ల లా…
లా లా లా… ల లా లా ల లా లా లా… ల లా…
మ్…హూ హూ… ఆహాహా ఓహొహో…
లా లా లా ఆహాహా ఓహొహో…

రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో
రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

కలలన్నీ పంటలై పండెనేమో
కలిసింది కన్నుల పండగేమో
చిననాటి స్నేహమే అందమేమో
అది నేటి అనురాగ బంధమేమో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
తొలకరి వలపులలో పులకించు హృదయాలలో
ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు
ఆ మేళ తాళాలు మన పెళ్లి మంత్రాలై
వినిపించు వేళలో… ఎన్నెన్ని భావాలో

రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో

చూశాను ఎన్నడో పరికిణీలో
వచ్చాయి కొత్తగా సొగసులేవో
హృదయాన దాచిన పొంగులేవో
పరువాన పూచెను వన్నెలేవో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
వన్నెల వానల్లో వనరైన జలకాలలో
మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో
ఆ మోహదాహాలు మన కంటి పాపల్లొ
కనిపించు గోములో… ఎన్నెన్ని కౌగిళ్లో

రాళ్ళల్లో ఇసకల్లొ రాశాము ఇద్దరి పేర్లు
కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తియ్యగా గురుతు తెచ్చుకో
లా ల లా ల లా… లాలలా  ల లా ల లా….
లా ల లా ల లా… లాలలా  ల లా ల లా….

*********  *********  *********

చిత్రం :  సీతారామకళ్యాణం (1986)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏమని పాడను..
ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను…
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం

అది చెబుతున్నప్పుడు… లయ పుడుతున్నప్పుడు…
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు

ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం

అది చెబుతున్నప్పుడు… లయ పుడుతున్నప్పుడు…
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు

చరణం: 1
వయసొచ్చిన మర్నాడే… మనసిస్తుంది
మనసిచ్చీ ఇవ్వగానే కథమౌదలౌతుంది
వయసొచ్చిన మర్నాడే… మనసిస్తుంది
మనసిచ్చీ ఇవ్వగానే కథమౌదలౌతుంది
నిదరన్నది కంటికి రాకా.. కుదురన్నది వంటికి లేకా
నిదరన్నది కంటికి రాకా.. కుదురన్నది వంటికి లేకా
ఆకలిగా.. దాహంగా… కౌగిలిగా.. మోహంగా
బ్రతుకు పంతమై.. బతిమాలుకునే నమస్కార బాణమ్
అదే.. మొదటి చుంబనమ్
ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం

అది చెబుతున్నప్పుడు… లయ పుడుతున్నప్పుడు…
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు

చరణం: 2
తొలి చూపే వలపులకు శ్రీకారం
కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం
తొలి చూపే వలపులకు శ్రీకారం
కలవరింతలయ్యే ఒక కమ్మని రాగం
నడిరాతిరి ముగ్గులు పెట్టి…తెలవారని పొద్దులు దాటి
నడిరాతిరి ముగ్గులు పెట్టి…తెలవారని పొద్దులు దాటి
ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా
పులకరింతగా పలకరించినా మల్లెపూల బాణమ్
అదే….  వలపు వందనం

ఏమని పాడను రెండు మనసుల మూగ గీతం
ఏదని చెప్పను నాలుగు పెదవుల ఏక తాళం

అది చెబుతున్నప్పుడు… లయ పుడుతున్నప్పుడు…
నా గుండెల్లో చప్పుడే ప్రేమా
నీ పెదవుల్లో చప్పుడే ముద్దు

ఏమని పాడను… ఏదని చెప్పను
ఊమ్మ్..ఊమ్మ్మ్

********  *********  *********

చిత్రం: సీతారామకళ్యాణం (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఎంత నేర్చినా…  ఎంత నేర్చినా
ఎంత చూచినా… ఎంత చూచినా
ఎంత వారలైన… ఎంత వారలైన
కాంత దాసులే… ప్రేమ దాసులే

ఆ.. ఆ.. ఆ.. కాదమ్మా..
ప్రేమదాసులే కాదు.. కాంతదాసులే
కాదు సార్.. ప్రేమ దాసులే
తప్పమ్మా.. తప్పదు సార్

అంతేనంటావా..

ఎంత నేర్చినా ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే… ఎంత నేర్చినా
సంతతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంతమైన మార్గ
చింత లేని వా…రెంత నేర్చినా
సంతతంబు ఏకాంత సెవకై
ఇంత తంతు చేసి చెంత చేరు వా..రెంత నేర్చినా

ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే
ఎంత నేర్చినా….

చరణం: 1
లయ లేనిదే స్వరముండునా.. స్వరరాగములు లేక పాటుండునా
నువు లేనిదే నేనుండునా.. నా మనసు నిను వీడి బ్రతికుండునా
రాముడు విలు వంచి… సీతను పెండ్లాడె కదా
పార్వతి తపియించి పరమేశుని పొందెగదా
ఆ పాటి మనమైనా తెగియించమా

ఎంత నేర్చినా…  ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే
ఆ.. ఆ.. ఎంత నేర్పినా…

చరణం: 2
ముద్దున్నది.. పొద్దున్ననది
అధరాలు అదిరదిరి పడుతున్నవి
తలపున్ననది.. తలుపున్నది
గడివేస్తే ఇరుకైన గది ఉన్నది
ఇల్లే గుడి కన్నా మనకెంతో పదిలంగా
పెద్దలు ఇద్దరినీ ఇటులెంతో భద్రంగా
కలిపారు సరదాల చెరసాలలో

ఎంత నేర్చినా…  ఎంత చూచినా
ఎంత వారలైన ప్రేమ దాసులే
ఎంత నేర్చినా…

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Neramu Siksha (1973)
error: Content is protected !!