చిత్రం: సీతారాములు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 1980
పల్లవి:
హేయ్ బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసింది
ఆహా.. బుంగమూతి బుల్లెమ్మా.. దొంగ చూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటురాయి.. అబ్బా..
చురుక్కు చురుక్కు మంటొంది.. పగలు ..రేయి
చురుక్కు చురుక్కు మంటొంది.. పగలు.. రేయి
కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
కోడెకారు చిన్నోడు.. చేతిలో చెయ్ ఏశాడు
ఆ చేతిలో ఏముందో ఆకురాయి..
అబ్బా చురుక్కు చురుక్కు మంటోంది.. పగలు.. రేయీ..
చురుక్కు చురుక్కు మంటోంది.. పగలు.. రేయీ..
చరణం: 1
మరుమల్లె తీగలాగ..నిలువెల్లా చుట్టేస్తుంది
అణువణువు నాలో నిండీ..మనసంతా పండిస్తుందీ
మనసులో ఏముందో అంత గారం..నన్ను..
కొరుక్కు..కొరుక్కు తింటోంది..ఆ సింగారం..ఓ..
కొరుక్కు..కొరుక్కు తింటోంది..ఆ సింగారం
వద్దన్న ఊరుకోడు..కలలోకి వచ్చేస్తాడు
మొగ్గలంటి బుగ్గలమీద..ముగ్గులేసి పోతుంటాడు
ముచ్చటలో ఏముందో చెప్పలేను..అబ్భా..
ఉలిక్కి ఉలిక్కి పడుతుంటాను నాలో నేనూ..
అహా..బుంగమూతి బుల్లెమ్మా..దొంగచూపు చూసింది
ఆ చూపులో ఏదో సూదంటూరాయి..
అబ్భా.. చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ..అహా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చరణం: 2
చుక్కల్లో చక్కదనం..వెన్నెల్లో చల్లదనం
అడుగడుగున అందిస్తుందీ..చిరునవ్వులు చిలికిస్తుందీ
నవ్వుల్లో ఏముందో ఇంద్రధనుస్సు..అబ్భా
ఖలుక్కు ఖలుక్కు మంటోంది నాలో వయసూ
ఉడికించే రాతిరిలో..ఊరించే సందడిలో
బాసలనే పానుపు చేసి..ఆశలనే కానుకచేసి
స్వర్గాలు చూడాలి ఆ మనసులో..నేను..
ఇరుక్కు ఇరుక్కు పోవాలి ఆ గుండెలో
కోడెకారు చిన్నోడు..చేతిలో చెయ్ ఏసాడు..
ఆ చేతిలో ఏముందో..ఆకురాయి..అబ్బా..అబ్బా
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
చురుక్కు చురుక్కు..మంటుంది..పగలూ..రేయీ
***** ****** ******
చిత్రం: సీతారాములు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల
సాకీ:
వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని.. జయ జయ జయ…
పల్లవి:
పలికినది… పిలిచినది …
పరవశమై నవమోహనరాగం
పలికినది… పిలిచినది …
పరవశమై నవమోహన రాగం
పలికినది ….పిలిచినది..
చరణం: 1
గగనాంగనాలింగనోత్సాహియై…
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై
గగనాంగనాలింగనోత్సాహియై …
జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..
మమతలు అల్లిన పెళ్ళిపందిరై …
మమతలు అల్లిన పెళ్ళిపందిరై …
మనసులు వీసిన ప్రేమ గంధమై ….
పలికినది… పిలిచినది..
పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
చరణం: 2
గంగా తరంగాల సంగీతమై… కమణీయ రమణీయ యువగీతమై
గంగా తరంగాల సంగీతమై… కమణీయ రమణీయ యువగీతమై
కలిమికి లేమికి తొలి వివాహమై…కలిమికి లేమికి తొలి వివాహమై..
యువతకు నవతకు రసప్రవాహమై…
పలికినది పిలిచినది… పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
చరణం: 3
మలయాద్రి పవనాల అలాపనై …మధుమాస యామిని ఉద్ధీపనై …
మలయాద్రి పవనాల అలాపనై …మధుమాస యామిని ఉద్ధీపనై…
అనురాగానికి ఆది తాళమై..అనురాగానికి ఆది తాళమై …ఆనందానికి అమర నాదమై…
పలికినది పిలిచినది… పరవశమై నవమోహనరాగం
పలికినది పిలిచినది..
***** ****** ******
చిత్రం: సీతారాములు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి
గానం: పి. సుశీల
పల్లవి:
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
చరణం: 1
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. ఆ.. ఆ… ఆ..
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం.. దొరికే ఒక హృదయం..
ఆ హృదయం సంధ్యారాగం.. మేలుకొలిపే అనురాగం..
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
చరణం: 2
సాగరమే పొంగుల నిలయం..
దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతికెరటం..చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం.. అది అంటదు ఆకాశం..
ఆ ఆకాశంలో ఒక మేఘం.. మేలుకొలిపే అనురాగం
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
***** ****** ******
చిత్రం: సీతారాములు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు
పల్లవి:
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో… వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో… వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
చరణం: 1
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం.. ఆ.. ఆ… ఆ..
జీవితమే రంగుల వలయం.. దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
గడిచే ప్రతి నిమిషం.. ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం.. దొరికే ఒక హృదయం..
ఆ హృదయం సంధ్యారాగం.. మేలుకొలిపే అనురాగం..
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
చరణం: 2
సాగరమే పొంగుల నిలయం.. దానికి ఆలయం సంధ్యా సమయం
సాగరమే పొంగుల నిలయం.. దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతికెరటం.. చేరదు అది తీరం
వచ్చే ప్రతికెరటం.. చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం.. అది అంటదు ఆకాశం..
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
తొలి సంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో..
తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం..
ఎగరొచ్చి కెరటం సింధూరం….
***** ****** ******
చిత్రం: సీతారాములు (1980)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాసరి
గానం: ఎస్.పి. బాలు, జయప్రద
పల్లవి:
ఊఁ… ఉహు…హు… హుహు…
ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది..
ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది..
ఇల్లు ఊడ్చాలి.. కళ్ళాపు చల్లాలి..
నీళ్ళు తోడాలి.. ఆపై కాఫీ కాయాలీ..ఈ..
ఏవండోయ్ శ్రీమతిగారు.. లేవండోయ్ పొద్దెక్కింది..
చరణం: 1
హబ్బ.. ప్లీజ్.. ఒక్క గంటండీ..
గంటా గంటని అంటూ ఉంటే లోనుంచీ ఆకలి మంటా..
మంటా మంటని గిజ గిజమంటే అమ్మానాన్నతో తంటా..
మంటను మరి చేసి తలుపులు మూసేసీ..
దుప్పటి ముసుగేసి సరిగమ పాడేసి..
ఆఫీసుకి నామం పెడితే ఆడబాసుతో తంటా..
హూఁ ‘Who is that రాక్షసి’
ఉన్నది ఒక శూర్పణఖా.. లేటైతే నొక్కును నా పీకా..
ఆపై ఇచ్చును ఒక లేఖా.. ఆ లేఖతో ఇంటికి రాలేకా..
నలిగి నలిగి.. కుమిలి కుమిలి.. చచ్చి చచ్చి.. బ్రతికి బ్రతికి..
అయ్యబాబోయ్..
అందుకే..
ఏమండోయ్ శ్రీమతిగారూ.. లేవండోయ్ పొద్దెక్కింది.. హబ్బా..
చరణం: 2
కాఫీ.. కాఫీ..
కాఫీ కాఫీ అంటూ ఉంటే ఉలకరు పలకరు ఏంటంటా…
వంటా వార్పు చేసేది ఇంటికి పెళ్ళామేనంటా…
అఫ్కోర్స్ నాకు రాదే.. ఒక్కసారి చేసి చూపించండీ…
మ్మ్.. పాలను మరిగించీ.. గ్లాసులో పోసేసి
పౌడరు కలిపేసీ.. స్పూనుతో తిప్పేసి
వేడిగ నోటికి అందిస్తే..
నాన్సెన్స్.. చక్కెర లేదు..
హబ్బా.. అరవకు అరవకు ఓ తల్లీ..
అరిస్తె ఇల్లే బెంబెల్లీ.. ఇరుగూపొరుగూ బయల్దేరి
నిన్నూ నన్నూ చూసెళ్ళి…
ఇంటా బయటా.. ఊరూ వాడా.. గుస గుసలాడేస్తే
నిజంగా..
నీతోడు అందుకే..
ఏవండోయ్ శ్రీమతిగారు.. ఆగండోయ్ చల్లారండీ..