చిత్రం: సితార (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి బాలు, యస్.పి.శైలజ
నటీనటులు: సుమన్ , భానుప్రియ
దర్శకత్వం: వంశీ
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 1984
తననననన తననననన తననననన తననననన
తననననన తననననన తననననన తననననన
చమకు చమకు జింజిన్న జింజిన్న
చమకు చమకు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
జమకు జమకు జింజిన్న జింజిన్న
జమకు జమకు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరులతేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల తనననన పావడగట్టి తనననన
పచ్చని చేలా పావడగట్టి కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
చరణం: 1
ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి
కనులా గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
చరణం: 2
మాగాణమ్మ చీరలు నేసె
మలిసందెమ్మ కుంకుమపూసె
మువ్వులబొమ్మ ముద్దులగుమ్మ
మువ్వులబొమ్మ ముద్దులగుమ్మ
గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే…
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేలా తనననన
పావడగట్టి తనననన
ఓయ్ పచ్చని చేలా పావడగట్టి
అ కొండమల్లెలే కొప్పునబెట్టీ
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
********* ******** *********
చిత్రం: సితార (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
అ హ హ హ హ…
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు ఏ మైనా ఓ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీ కైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా
తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా
హరివిల్లు రంగుల్లో అందాలే
చిలికిన చిలకవు, ఉలకవు పలకవు ఓ మైనా ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈమైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈమైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
వినువీధి వీణంలో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా
మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా
******* ******* ********
చిత్రం: సితార (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి
అ… అ… అ… అ… అ…
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నుల్లో కన్నీటి దీపం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నుల్లో కన్నీటి దీపం
అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌనగీతం
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నుల్లో కన్నీటి దీపం
జీవిత వాహిని అలలై
ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై
బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో
ఎడబాటే ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా
వెన్నెల్లో గోదారి అందం
నది కన్నుల్లో కన్నీటి దీపం
నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి… ఆ… ఆ… ఆ… ఆ
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై
యవ్వనాలు అదిమి అదిమి
పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే
నాకు లేదు మమకారం
మనసు మీద అధికారం
నాకు లేదు మమకారం
మనసు మీద అధికారం
ఆశలు మాసిన వేసవిలో
ఆవేదనలో రేగిన ఆలాపన సాగే
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో… తిరిగే… సుడులై
ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా
******* ******* ********
చిత్రం: సితార (1984)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
కు కు కు కు కు కు
కు కు కు కు కు కు
కోకిల రావె
కు కు కు కు కు కు
కోకిల రావె
రాణివాసము నీకు ఎందుకో కో కో
రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో
చరణం: 1
రంగుల లోకం పిలిచే వేళ
రాగం నీలో పలికే వేళ
విరుల తెరలే తెరచి రావే
బిడియం విడిచి నడచి రావే
నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో
నా పాటల తోటకు రావె ఈ పల్లవి పల్లకిలో
స్వరమై రావే విరి పొదల ఎదలకు
చరణం: 2
సూర్యుడు నిన్నే చూడాలంట
చంద్రుడు నీతో ఆడాలంట
బురుజు బిరుదు విడిచి రావే
గడప తలుపు దాటి రావే
నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
నువు ఏలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో
లయగా రావే ప్రియ హృదయ జతులకు