చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: నాగార్జున, అమల
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ
నిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 05.10.1989
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే…
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
చరణం: 1
గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది
లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది
కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు
నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే…
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
చరణం: 2
లైఫు బోరుగున్నది కొత్త కైపు కోరుతున్నది
గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కింది కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా
వసంతమాడే వేళ
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
*********** *********** *********
చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో, ఎస్. జానకి
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
విరహాల గోల ఇంకానా వీలు కాదు
వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
సూర్యుడే చుర చుర చూసినా
చీరనే వదలడు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోకుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌదరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా
తియ్యగ తిడుతూనే లాలించనా
సరసాలు చాలు శ్రీవారు తాన నాన
విరహాల గోల ఇంకానా ఊహు ఊహు
కొత్తగా కుదిరిన వేడుక
మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర
బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా
ఆరారగా చేరక తీరేదెలా గొడవా
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
********** ********** *********
చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ
బోటని పాఠముంది మ్యాటని ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా…
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బెస్ట్ రా
బోటని క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రొష్టు కన్న రెస్ట్ మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు
జగడ జగడ జగడ జగడ జాం (4)
దువ్వెనే కోడిజుట్టు నవ్వెనే ఏడ్చినట్టు
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరి వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్ బాండ్
గీరగా వేస్తాడే ఈల సౌండ్
నీడలా వెంటాడే వీడి బ్రాండ్
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు
జగడ జగడ జగడ జగడ జాం (4)
అయ్యో మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
ఆ చి తాళం రాదు మార్చట మార్చి
తాళం లో పాడురా వెధవా
మార్చినే తలుచు కుంటే
మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది
ఏందిరా ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రినాయన
వెళ్ళరా సులువైన దారిలోన
ఉందిరా సెప్టెంబర్ మార్చి పైన
హోయ్ వాయిదా పద్దతుంది దేనికైనా
మాక్సిమం మార్కులిచ్చు
మాథ్స్ లో ధ్యాస ఉంచు
కొద్దిగా ఒళ్ళు వంచురా ఒరేయ్
తందన తందనాన తందన తందనాన
తందన తందనాననా
క్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై పెట్టు కాస్త
ఫస్ట్ రాంక్ పొందవచ్చురా తందన
అరె ఏం సర్
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు
లక్కుతోని లచ్చలల్లో మునిగిపోతరు
పుస్తకాల్తో కుస్తీలు పట్టేటోళ్లు
సర్కారు క్లర్క్ అయ్యి మురిగిపోతరు
జగడ జగడ జగడ జగడ జాం (4)
******** ********* *********
చిత్రం: శివ (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే… హోయ్!
ఎన్నియల్లో మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
సిగ్గేయగా.. బుగ్గ మొగ్గ.. మందార ధూళే దులిపే
జారేసినా.. పైటంచునా.. అబ్బాయి కళ్ళే నిలిచే
సందిళ్ళకే చలి వేస్తుంటే.. అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలిచేస్తోంటే.. వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కధకళి లోనా
ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఈ చీకటే.. ఓ చీరగా.. నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా.. క్రీనీడలే.. నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే .. జాబిల్లిలా పడుకోనా
తబ్బిబుతో తడబడుతుంటే.. నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై.. ఉరుముతున్నా
చెదరని నిదరలో.. కుదిరిన పడకలలోనా
ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో.. తుళ్ళింతల్లో.. ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటె చాలు నాట్యాలు
శృంగార వీణ రాగాలే… హోయ్!
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
లలలల..లలలలలా..