చిత్రం: శివకాశీపురం (2017)
సంగీతం: పవన్ శేషా
సాహిత్యం: అమరేశ్ కుచినెర్ల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: రాజేష్ శ్రీ చక్రవర్తి , ప్రియాంక శర్మ
దర్శకత్వం: హరీష్ వట్టికూటి
నిర్మాత: మోహన్ బాబు పులిమామిడి
విడుదల తేది:
పల్లవి:
అమ్మ అందని త్యాగం కోటి దైవాల రూపం
కదిలే కోవెల నీదేహం
నోమే నోచే జన్మం పూవై పూచే ప్రాణం
అమ్మా నువ్వే ఆ రూపం
దాయి దాయి జోల పాడి కనుపాపై కాచేను
ముత్యమంత ముద్దు చేచి
ఆడి పాడి హాయిలోని తల్లి ప్రేమే పంచేనే
ఆరారు కాలాలు పూచే పున్నాలే
చరణం: 1
పూసే పొద్దె దీపం వీచే గాలే శోకం
సాగే శూన్యం నీ గమ్యం
దోషం లేదే పాపం దైవం ఇచ్చే శాపం
మోసే భారం నీకోసం
రేయే రేపై నీ గూడు నిండేనా
నిదరే రానీ వేళా
నావే నదిలో నడి వడ్డే చేరేనా
నేరం నీదే కాదే…
చరణం: 2
దీపం కన్నే దాచి చూపై నిన్నే కాచి
వెలిగే వేకువ సింధూరం
నింగి నేలే నేస్తం నీవై నిండే లోకం
నీతో జన్మే సావాసం
ఎదో బాధే ఎద గంగై పొంగేనా
నీడే తోడై పోయే
మోసే భారం మరి దూరం ఎంతైనా
ఆశే శ్వాసై సాగే