Sivamani Songs Telugu Lyrics

Sivamani (2003)

Sivamani Songs Telugu Lyrics

ఏలో ఏలో ఎన్నియల్లో… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: విశ్వ
గానం: స్మిత
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో… యవ్వనాల్లో… యవ్వనాల్లో…
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో… జావళీల్లో… జావళీల్లో…

ఏలో ఏలో ఎన్నియల్లో.. కూసే గువ్వ కొమ్మలల్లో..
వచ్చే మాఘం ఎన్నినాళ్ళొ… ఎన్నినాళ్ళొ…
కోలో కోలో కన్నెవళ్ళో.. వచ్చి వాలే వానవిల్లో..
రేగే నాలో కోరికేదో… కోరికేదో…

నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో..
ఊరుకోనంటు ఊసులేవో.. ఉరకలేశాయి తలపుల్లో..

ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో… యవ్వనాల్లో… యవ్వనాల్లో…
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో… జావళీల్లో… జావళీల్లో…

నింగిలోని తారలన్నీ.. నిచ్చెనేసి అందుకో..
మెరుపుతీగె కోసుకొచ్చి… కురులలోన తురుముకో…
వెన్నెలమ్మ వాకిట.. ముగ్గులేసి ముంగిట..
వింత వింత వేడుకే.. చేయి..
కొత్తదారి కోరితే.. హాయి..
ఆకతాయి అల్లరేనోయీ…

ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో… యవ్వనాల్లో… యవ్వనాల్లో…
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో… జావళీల్లో… జావళీల్లో…

కలతలన్నీ.. పక్కనెట్టి మమతలన్నీ.. అల్లిపో..
పగలు రేయి పదిలమైన ప్రేమలేదు పంచుకో…
రేగితున్న గాలిలా.. ఉరకలేసే ఏరులా..
సాహసంతో సాగిపోవాలి..
కొత్తపాటె పాడుకోవాలి..
అంబరాలే అందుకోవాలి ..

ఏలో ఏలో ఎన్నియల్లో.. తేలే ఈడే తేనియల్లో..
అల్లిబిల్లి యవ్వనాల్లో… యవ్వనాల్లో… యవ్వనాల్లో…
నింగి నేల వేడుకల్లో.. ఈడే వచ్చే పల్లకీలో..
కన్నెజాజి జావళీల్లో… జావళీల్లో… జావళీల్లో…

నిన్నమొన్నల్లో.. కానరాని వన్నెలొచ్చాయి మేనిలో..
ఊరుకోనంటు ఊసులేవో.. ఉరకలేశాయి తలపుల్లో..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

రామ రామ రామ నీలి మేఘ శ్యామ… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: కౌశల్య
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

ధోం ధోం తన : ధోంతన : ధోంతన ధీం ధీం అ ఆ.. ఆ..
ధోం ధోం తన : ధోంతన : ధోంతన ధీం ధీం అ ఆ.. ఆ..

రామ రామ రామ నీలి మేఘ శ్యామ ఆ..
సా … సనిపని సా… ఆ…
రామ రామ నీలి మేఘ శ్యామ
రావా.. రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే.. ప్రతి సుమగానం నీకేలే..
కరుణించి కురిపించే.. నీ ప్రతి దీవెన మాకేలే..
నిరతం పూజించే మాతో.. దాగుడు మూతలు నీకేలా..
రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా..
రామ రామా…
రామ రామ రామ నీలిమేఘ శ్యామ
రావా.. రఘుకుల సోమ భద్రాచల శ్రీరామా.. ఆ… ఆ….

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: చక్రి
గానం: హరిహరన్, కౌశల్య
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా..
నీ పలుకే నా వీణ.. నీదా డిజిటల్ టోనా..

సుకుమార మాటలతో.. నీ వశమే నేనైతే..
మహవీరా చూపులతో.. నా తనువే నీదైతే..
నా గుండెల్లో మాటేదో.. త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో.. విన్నర్ నేనే కావాలీ..
మోన మోనా…

మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా..
నీ పలుకే నా వీణ.. నీదా డిజిటల్ టోనా..

హిమమేదో కురియాలి, చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే.. నిలువెల్లా తాకాలి
మనమేదో చేయాలి, చిరుగాలి వీయాలి
తలపేంటో.. అడిగిందంటూ కౌగిట్లో చేరాలి
చలిగిలి చేసేను మోనా.. తొలిముద్దులకై రానా..
చలిగిలి చేసేను మోనా.. తొలిముద్దులకై రానా..
జరిగేది ఏమైనా.. జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల
మోన మోనా…

మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా..
నీ పలుకే నా వీణ.. నీదా డిజిటల్ టోనా..

జపమేదో చెయ్యాలి, హృదయాలు కలవాలి
గగనాన తారల తోడై, గళము విప్పి పాడాలి
జతలన్నీ మురియాలి, ఒకటైన మన చూసి
కథలల్లుకోవాలి, ఘన చరితై నిలవాలి
భ్రమలే నిజమే అగునా.. బ్రతుకే నీవనుకోనా..
భ్రమలే నిజమే అగునా.. బ్రతుకే నీవనుకోనా..
చింతేల ప్రియ బాల.. నీచెంత నే లేనా..
కొంతైనా ఓపిక ఉంటే.. సొంతం నే కాలేనా..
మోన మోనా…

మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా..
నీ పలుకే నా వీణ.. నీదా డిజిటల్ టోనా..

సుకుమార మాటలతో.. నీ వశమే నేనైతే..
మహవీరా చూపులతో.. నా తనువే నీదైతే..
నా గుండెల్లో మాటేదో.. త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదాటేదో.. విన్నర్ నేనే కావాలీ..
మోన మోనా…

హేయ్…
మోనా.. మోనా.. మోనా.. మీన కనుల సోనా..
నీ పలుకే నా వీణ.. నీదా డిజిటల్ టోనా..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

సున్ సున్ సున్ సుందరి… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: శంకర్ మహాదేవన్, కౌశల్య
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ..
చేస్తానే రామరి సోకుల్ని రాబరీ..
నవ్వేనా నిండు గోదారి, ఓ బాలామణి
వెల్లువలా రావే మరి, నా సోకు గని
రానంటె ఎట్టామరి….రి పరువాల పంచాక్షరి…రీ
రానంటె ఎట్టామరి….. రి పరువాల పంచాక్షరి…రీ….

కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ..
గుండెల్లో తొందరా హ… హ…

చంద్రకళ పైడి వల నీకు నాకు దూరమిలా..
ఇంకా ఎన్నినాళ్ళు చెప్పవె లీల
గుండెల్లోచేరి….చేరి… గొడవే చేస్తాలే..
పున్నమిలో వెన్నెలలా.. తుంటరి నీ కన్నులిలా..
పిలిచి చంపుతుంటే.. ఏం చెయ్యాలి

చూపులతో.. చూపు కలపవోయ్ పిల్లడు
వలపేదో.. పంచి పెట్టవోయ్… ఓయ్..
సన్నజాజి తీగలాగ, అల్లుకుంటే ఆపైనా..
పొమన్నా పోనే మరి…రి… నిందలొద్దె నీలాంబరీ… రీ…
కౌగిలంటే ఓకె కాని… నీ కవ్వింతే ఒద్దోయ్ మరీ…

సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ..

రూపమతి నిన్ను చూసి ఉన్నమతి చెదిరిపోయి
మనసే చిన్నపాటి చెరువయ్యిందే…
ఆ.. చెరువులోకి.. లోకి.. లోకి.. చేపయి వస్తాలే…
కొండపల్లి బొమ్మలాంటి కోమలాంగి నవ్వు విని
వయసే నీవైపు పరుగులు తీసే..
ఇన్ స్పైరై పోమాకురోయ్.. పిల్లడు
ఎస్స్ పైరై పోతావురోయ్… రోయ్….
ఇంత దూరమొచ్చినాక, ఇంటి తలుపులేసుకుంటు
బెట్టుచేస్తే ఎట్టామరి…హెహే… కమలమారి కాదాంబరి….రి
ఆగకుంటె కట్టోయ్ తాళి… హెహే.. ఇచ్చేస్తా బిగి కౌగిలీ…

కమ్ కమ్ కమ్ సుందరా.. ఆ.. ఆ.. ఆ..
గుండెల్లో తొందరా హ… హ…

సున్ సున్ సున్ సుందరి ఊరించె క్యాడ్బర్రీ..
నువ్వేనా నిండు గోదారి… ఓ బాలామణి
వెల్లువలా రావే మరి, నా సోకుగని
రానంటే ఎట్టామరి…రి పరువాల పంచాక్షరి…..రీరీ
రానంటే ఎట్టామరి…రి పరువాల పంచాక్షరి…..రీరీ…..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: రవి వర్మ, రేవతి
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
నన్ను నీ వైపు రా.. రమ్మన్నవి
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి
నా చిన్ని గుండెను కోస్తున్నవి
కోలో.. కోలో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి రారో..
ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో మారో..
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొస్తాలే…
వస్తాలే… వస్తాలే… వస్తాలే…

ఏయ్..
గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]

రాశిలో కన్యలా.. వాసిలో రంభలా..
ఎందుకో నువ్విలా నచ్చుతున్నావే…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
చూపుతో కింగులా.. స్పీడుతో సుందరా..
గుండెలో సూటిగా.. గుచ్చుతున్నావే…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]

అబ్బా సొంపుల పాపా.. అలా జారకె సోపా..
ఒక ముద్దు ముద్దరేసుకుంటె రంగుల చేపా..
జల్లుమని గిల్లుమని కోరుకుంది రా.. మరి
కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ.. చలి
జల్లుమని గిల్లమని కోరుకుంది రా మరి
కమ్ముకుంటె కౌగిలిలో.. తీరతుంది ఈ చలి
పున్నమిలో వెన్నెలలా.. చెయ్యిపట్టి చెంతకొస్తావా…
వస్తావా… వస్తావా… వస్తావా…

ఏయ్..
గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]

కాశిలో నీటిలా.. గంగలో వరదలా..
లవ్వుతో నన్నిలా.. ముంచుతున్నావే..
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
పువ్వులోతేనెలా.. ఏటిలో చేపలా..
చిలకపచ్చకోకలా.. మస్తుగున్నావే..
[ఓఓ ఓ… ఓఓ ఓ…]

ఇలా ఎప్పడు ఇట్టా.. గిచ్చి చంపుతె ఎట్టా..
ప్రతి దానికంటుంది ఒకవేళాపాళా..
అవును అని కాదు అని ఆడుకోకే.. సుందరి
వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
ఆ..ఆ.. అవును అని కాదుఅని ఆడుకోకే.. సుందరి
వేస్తున్నా ఆగుమరి మల్లెపూల పందిరి
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా…
వచ్చేసా… వచ్చేసా… వచ్చేసా…

గోల్డ్ రంగు పెదవులు బాగున్నవి…
ఓయ్… ఓయ్…
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
నన్ను నీ వైపు రా.. రమ్మన్నవి
[ఓఓ ఓ… ఓఓ ఓ…]
ఓయ్… ఓయ్…

వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి
నా చిన్ని గుండెను కోస్తున్నవి
కోలో.. కోలో.. కోలో.. సారో.. కొంగు చాటు రైకతీసి రారో..
ఏలో.. ఏలో.. ఏలో.. యారో.. పెదవుల్ని పెదవుల్తో మారో..
పున్నమిలో వెన్నెలలా.. చంద్రముఖి చెంతకొచ్చేసా…
వచ్చేసా… వచ్చేసా… వచ్చేసా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఏ నాటికీ మనమొకటేనని… లిరిక్స్

చిత్రం: శివమణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: రఘుకుంచె, కౌశల్య
నటీనటులు: నాగార్జున , అశిన్, రక్షిత
దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాణం: పూరి జగన్నాథ్
విడుదల తేది: 23.10.2003

ఏ నాటికీ మనమొకటేననీ.. ఏ చీకటి ఇటు రాలేదనీ..
పొరపాటుగా అనుకున్నామనీ.. తెలిసిందిలే కలగన్నామనీ..
కన్నీరు జోరైయింది, ఆ నీరు ఏరైయింది, నువ్వు లేక సంతోషమా..
వాకిట్లో వాసంతాలు, ఆనాటి సాయంత్రాలు, నువ్వు లేక శూన్యం సుమా..
నాతోనే నువ్వు ఉంటాననీ.. ఆరోజే నువ్వు అన్నావనీ..
ఎలా నేను మరిచేది ఓ.. నేస్తమా…

ఏ నాటికీ మనమొకటేననీ.. ఏ చీకటి ఇటు రాలేదనీ..
పొరపాటుగా అనుకున్నామనీ.. తెలిసిందిలే కలగన్నామనీ..

నీ కోసమే మిగిలున్నానిలా.. నువ్వురాక నేనింక ఎన్నాళ్ళిలా..
నా గుండెలో నీ ఆలోచనా.. నా కంటి పాపల్లో ఆవేదనా..
ఇదీ మౌనరాగాల సంకీర్తనా.. ఇలా చూడు ఏవైపు అడుగేసినా..
నీలోనే సగమున్నాననీ.. నీ కోసం మిగిలున్నాననీ..
ఎలా నీకు తెలిపేది ఓ.. నేస్తమా…

ఏ నాటికీ మనమొకటేననీ.. ఏ చీకటి ఇటు రాలేదనీ..
పొరపాటుగా అనుకున్నామనీ.. తెలిసిందిలే కలగన్నామనీ..

మరుపన్నది ఇటు రాదే ఎలా.. నా మనసుకేమైంది లోలోపలా..
వలపన్నది చెలరేగే అలా.. ఎదలోన దాగుండి పోదే ఎలా..
జడివానలా వచ్చి తడిపేయవా.. ప్రియా అంటు ప్రేమార పిలిచేయవా..
నీవైపే ఎద లాగిందనీ.. నీ చూపే అది కోరిందనీ..
చెలీ.. నీకు తెలిశాక చెలగాటమా..

ఏ నాటికీ మనమొకటేననీ.. ఏ చీకటి ఇటు రాలేదనీ..
పొరపాటుగా అనుకున్నామనీ.. తెలిసిందిలే కలగన్నామనీ..
కన్నీరు జోరైయింది, ఆ నీరు ఏరైయింది, నువ్వు లేక సంతోషమా..
వాకిట్లో వాసంతాలు, ఆనాటి సాయంత్రాలు, నువ్వు లేక శూన్యం సుమా..
నాతోనే నువ్వు ఉంటాననీ.. ఆరోజే నువ్వు అన్నావనీ..
ఎలా నేను మరిచేది ఓ.. నేస్తమా…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Michael Madana Kamaraju (1991)
error: Content is protected !!