చిత్రం: శివుడు శివుడు శివుడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All Songs)
గానం: యస్.పి. బాలు, సుశీల (All Songs)
నటీనటులు: చిరంజీవి , రాధిక
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతికుమార్
విడుదల తేది: 09.06.1983
పల్లవి:
ఆకాశంలో తారా తారా ముద్దాడే.. పెళ్ళాడే అందాలతో.. బంధాలతో..ఓ
ఓ..ఓఓఓ ఓఓఓ ఓఓఓ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో.. తాళాలతో..ఓ
హో..ఓఓఓ ఓఓఓ ఓఓఓ
చరణం: 1
ఈ పూల గంధాలలోనా..ఏ జన్మ బంధాలు కురిసే..ఏ.. ఏ
ఆ జన్మ బంధాలతోనే ఈ జంట అందాలు తెలిసే..ఏ.. ఏ
వలచే వసంతాలలోనే..
మమతల పందిరి వేసుకుని మల్లెలలో తలదాచాలి
మనసులతో ముడి వేసుకుని.. బ్రతుకులతో మనువాడాలి
శృతి..లయ సరాగమై..కొనసాగాలి
ఆకాశంలో తారా తారా ముద్దాడే..పెళ్ళాడే అందాలతో..ఓ..
లల్లాలలా..ఆ..బంధాలతో….ఓఓఓ..హే..ఏ.. ఏ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ల..ల
లల్లాలలా..ఆ..తాళాలతో..ఓ..ఓఓఓఓఓ
చరణం: 2
తెల్లారు ఉదయాలలోన..గోరంత పారాణి తీసి.. ఈ.. ఈ
ఆరాణి పాదాలలోనే.. పరువాల నిట్టూర్పు చూసి..ఈ… ఈ
ఈ తీపి కన్నీటిలోనే.. కరిగిన ఎదలను చూసుకుని
కలలకు ప్రాణం పోయాలి
తనువుల అల్లిక నేర్చుకుని..పెళ్ళికి పల్లకి తేవాలి
స్వరం..పదం..కళ్యాణమై..జత కావాలి
ఆకాశంలో తారా తారా ముద్దాడే..
పెళ్ళాడే అందాలతో లాలలలా.. బంధాలతో..లాలలలా..ఆ
కైలాసంలో గౌరీ శివుడూ ఈనాడే పెళ్ళాడే మేళాలతో..ఓఓఓ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..తాళాలతో..ఓఓఓ..లలాలలా