Sneham Kosam (1999)
Sneham Kosam (1999)

Sneham Kosam (1999)

చిత్రం: స్నేహం కోసం (1999)
సంగీతం: ఎస్. ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
నటీనటులు: చిరంజీవి, మీనా
దర్శకత్వం: కె.యస్. రవికుమార్
నిర్మాత: ఏ. యమ్.రత్నం
విడుదల: 01.01.1999

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కాని మనసు మక్కువా
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడా

మీసమున్న నేస్తమా హొయ్

ఏటి గట్టు చెపుతుంది అడుగు మన చేప వేట కధలు
మర్రిచెట్టు చెపుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులూ
చెరుకు తోట చెపుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు
టెంట్ హాలు చెపుతుంది ఏన్ టి ఆర్ స్టంటు బొమ్మ కధలూ
పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈతకొడుతూ
ఏన్నేలో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి
వయసంత మరచికేరింతలాడె ఆ తీపిగ్నాపకాలూ
కలకాలం మనతోటే వెన్నంటే వుంటాయి
మనలాగే అవికూడా విడిపోలేదంటాయి

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా

ఒక్క తల్లి సంతానమైన మన లాగ ఉండగలరా
ఒకరు కాదు మనమిద్దరంటె ఎవరైన నమ్మగలరా
నువ్వు పెంచినా పిల్లపాపలకు కన్నతండ్రినైనా
ప్రేమ పంచినా తీరులోన నేనిన్ను మించగలనా
ఏ పుణ్యం చేసానో నే నీస్నేహం పొందాను
ఆ ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా
నీకు సేవ చేసెందుకైన మరుజన్మ కోరుకోనా
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడా

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా
రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా
కోపమెక్కువా కాని మనసు మక్కువా
స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా
ఏల్లెదిగిన పసివాడా ఎన్నటికి నినువీడా

Manam (2014)
Previous
Manam (2014)