చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)
సంగీతం: శివ శంకర్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్
గానం: రాజేష్ , సుజాత
నటీనటులు: నాగార్జున, భూమిక, సుమంత్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 26.10.2001
నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా కనులకు కళలే చూపావే
చెలీ చెంతకే చేరు
ఎదే ఉండిపో నా మదిలో నిండిపో
సుధవై సఖివై
మన కలయిక కథలుగ సాగాలి
మన కథ ఒక చరితగ వెలగాలి
నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
ఏ దేవిగా బంధమై అల్లుకుంది
ఈ దేవినే అందుకో కానుకంది
నువ్వు పక్కనుంటె ఎండే చల్లగున్నది
నువ్వు ముట్టుకుంటె ముళ్ళే మల్లెలైనవి
నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా
నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా నుదుటిపై కుంకుమై నిలిచిపోవా
మా ఇంటికే దీపమై నడచి రావా
వేల ఊహలందు నిన్నే దాచుకుంటిని
కోటి ఆశలందు నిన్నే చూసుకొంటిని
నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా
నా పెదవికి నవ్వులు నేర్పావు
ప్రియా నీకు జోహారు
నా కనులకు కళలే చూపావే
చెలీ చెంతకే చేరు
ఎదే ఉండిపో నా మదిలో నిండిపో
సుధవై సఖివై
మన కలయిక కథలుగ సాగాలి
మన కథ ఒక చరితగ వెలగాల